కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఐఈపీఎఫ్ “హిసాబ్ కి కితాబ్” పేరుతో నిర్మించిన ఆరు లఘు చిత్రాలను ప్రారంభించారు.
Posted On:
03 JUN 2021 5:23PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ & ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఈఈపీఎఫ్ఎ) "హిసాబ్ కి కితాబ్" పేరుతో రూపొందించిన ఆరు లఘుచిత్రాలను ఢిల్లీలో గురువారం ప్రారంభించారు. "హిసాబ్ కి కితాబ్" అనేది 6 లఘు చిత్రాల శ్రేణి. దీనిని సీఎస్పీ ఈ–గవ్ వాళ్లు.. వారి శిక్షణ సాధనంలో భాగంగా అభివృద్ధి చేశారు. ఇందులో 5 నిమిషాల వ్యవధి కలిగి 6 షార్ట్ ఫిల్మ్‌లు / మాడ్యూల్స్ ఉన్నాయి. వివిధ మాడ్యూల్స్.. బడ్జెట్, పొదుపు, భీమా పథకాల ప్రాముఖ్యత, ప్రభుత్వంలోని వివిధ సామాజిక భద్రతా పథకాలు మొదలైనవాటిని గురించి విశదీకరిస్తాయి. సామాన్యుడు మోసపూరిత పథకాలకు బలైపోతున్న పరిణామాలను ఒక మాడ్యూల్ చూపిస్తుంది. పోంజీ వంటి మోసపూరిత పథకాల నుండి తమను తాము ఎలా రక్షించుకోవాలో కూడా ఆసక్తికరంగా చూపిస్తుంది. ఈ లఘు చిత్రాలను దేశవ్యాప్తంగా ఇన్వెస్టర్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌ల కోసం ఈఈపీఎఫ్‌ఎ, దాని భాగస్వామ్య సంస్థలు ఉపయోగించుకుంటాయి. ఈ సందర్భంగా మొత్తం 6 మాడ్యూళ్ళను కాసేపు ప్రదర్శించారు.
ఈ లఘు చిత్రాలను ప్రారంభించిన సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన విధాన ప్రాధాన్యతలలో అందరికీ ఆర్థిక స్వావలంబన ఒకటని అన్నారు. ఆర్థిక అక్షరాస్యత, విద్యలు.. ఆర్థిక స్వావలంబన, సమగ్ర వృద్ధి స్థిరమైన శ్రేయస్సులో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, తత్ఫలితంగా, జనాభాలో సింహభాగాన్ని సంఘటిత ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చామన్నారు. ఆర్థిక విద్య సామూహిక సామర్థ్యాన్ని గ్రహించడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు. "ఈఈపీఎఫ్ అథారిటీ లక్ష్యం గ్రామీణ పట్టణ ప్రాంతాలలో వివిధ భాగస్వాపక్షాలకు చెందిన పెట్టుబడిదారుల అవగాహనను పెంపొందించడం. డిజిటల్ గ్లోబల్ కమ్యూనిటీ కారణంగా, భారతదేశంలో పట్టణ,-గ్రామీణ విభజన అస్పష్టంగా ఉంది. పెట్టుబడి దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికకు సంబంధించి గ్రామీణ ప్రజలలో ప్రవర్తనా మార్పును తేవాల్సిన అవసరం ఉంది” అని ఠాకూర్ అన్నారు. ఈ వర్చువల్ లాంచ్ కార్యక్రమానికి కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసిఎ) కార్యదర్శి రాజేష్ వర్మ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ, పెట్టుబడిదారులకు సంబంధించిన సందేశాలను వ్యాప్తి చేయడానికి ఈపీఎఫ్ఎ వినూత్న పద్ధతులను అన్వేషించిందని ప్రశంసించారు "సిఎస్సి ఈ–గవ్ ఆసక్తికరమైన ఆకృతిలో అభివృద్ధి చేసిన ఈ లఘు చిత్రాలు గ్రామీణ ప్రజలకు బడ్జెట్, పొదుపులు, వివిధ పథకాల ప్రాముఖ్యత గురించి వివరిస్తాయి. పొంజీ పథకాల నుండి తమను తాము ఎలా కాపాడుకోవాలో అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి’’ అని ఆయన అన్నారు. ఈఈపీఎఫ్ అథారిటీ భాగస్వామ్య సంస్థల, నెహ్రూ యువ కేంద్ర సంగటన్, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, ఐసిఎస్ఐ, ఐసిఎఐ సీనియర్ ప్రతినిధులు ఈ వర్చువల్ కార్యక్రమానికి హాజరయ్యారు.
***
(Release ID: 1724244)
Visitor Counter : 170