వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ప్రస్తుత ఆర్‌ఎంఎస్ 2021-22లో రూ81,196 కోట్ల రూపాయల ఎంఎస్‌పి విలువగలిగిన గోధుమలను సేకరించారు.
వరి సేకరణ కార్యకలాపాలు రూ. 1,50,990.91 కోట్లు ఎంఎస్పి విలువ కలిగిన సేకరణ పూర్తయింది.
గతేడాది మొత్తం కొనుగోళ్లతో పోలిస్తే గోధుమల సేకరణ 5.44% పెరిగింది.
డిఎఫ్‌పిడి కార్యదర్శి పిఎంజికెవై-III, ఒఎన్‌ఒఆర్‌సి మరియు ఆహార ధాన్యాల సేకరణ గురించి మీడియాకు వివరించారు.
Posted On:
03 JUN 2021 6:11PM by PIB Hyderabad
పిఎంజికెవై-III, ఆహార ధాన్యం సేకరణ మరియు వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకం కింద ఆహార ధాన్యాల పంపిణీ పురోగతి గురించి ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి శ్రీ సుధాన్షు పాండే ఈ రోజు మీడియా ప్రతినిధులకు వివరించారు.
ప్రస్తుత కొనసాగుతున్న ఆర్‌ఎంఎస్ 2021-22లో రబీ మార్కెటింగ్ సీజన్ గోధుమల సేకరణ హర్యానా, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, మరియు జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రాల్లో సజావుగా కొనసాగుతోందని డిఎఫ్‌పిడి తన ప్రారంభ వ్యాఖ్యలలో చెప్పారు. గత సంవత్సరం మొత్తం 389.92 ఎల్‌ఎంటీల కొనుగోలు జరగ్గా ఈ ఏడాది 02.06.2021 వరకు 411.12 ఎల్‌ఎంటి కంటే ఎక్కువ గోధుమలు సేకరించబడ్డాయి. ఇప్పటికే జరుగుతున్న ఆర్‌ఎంఎస్ సేకరణ కార్యకలాపాల వల్ల సుమారు 44.43 లక్షల మంది రైతులు రూ. 81,196.20 కోట్ల ఎంఎస్‌పి విలువతో లబ్ధి పొందారని.. అందులో ఇప్పటికే రూ .76,055.71 కోట్లు దేశవ్యాప్తంగా రైతులకు బదిలీ చేయబడ్డాయని వివరించారు. పంజాబ్‌లో సుమారు రూ .26,103.89 కోట్లు, హర్యానాలో సుమారు రూ .16,706.33 కోట్లు నేరుగా రైతుల ఖాతాలోకి ఇప్పటివరకు బదిలీ చేయబడ్డాయి.
02 వ జూన్ 2021 వరకు మొత్తం 411.12 ఎల్‌ఎమ్‌టి గోధుమల కొనుగోలులో పంజాబ్- 132.27 ఎల్‌ఎమ్‌టి (32.17%)లతో మొదటి స్థానంలో ఉంది. ఇదే ఇప్పటివరకూ అత్యధికం. అలాగే హర్యానా- 84.93 ఎల్‌ఎమ్‌టి (20.65%) మరియు మధ్యప్రదేశ్ -128.08 ఎల్‌ఎమ్‌టి (31.15%)కొనుగోళ్లు జరిగాయి.
ప్రజా సేకరణ చరిత్రలో ఈ సంవత్సరం ఒక కొత్త అధ్యాయం జతచేయబడింది. హర్యానా మరియు పంజాబ్ కూడా ఎంఎస్‌పి యొక్క పరోక్ష చెల్లింపు నుండి భారత ప్రభుత్వ సూచనల ప్రకారం మరియు అన్ని సేకరణ సంస్థల ద్వారా రైతుల బ్యాంక్ ఖాతాకు ఆన్‌లైన్ ప్రయోజనాలను ప్రత్యక్షంగా బదిలీ చేయడానికి మారాయి. "వన్ నేషన్, వన్ ఎంఎస్పి, వన్ డిబిటి" కింద తమ గోధుమ పంటలను ఎటువంటి ఆలస్యం మరియు కోతలు లేకుండా విక్రయించడానికి వారు ప్రత్యక్ష ప్రయోజనాలను పొందారు.
గత ఏడాది 799.74 ఎల్‌ఎమ్‌టిల వరి (ఖరీఫ్ - 706.69 ఎల్‌ఎమ్‌టి + రబీ -93.05 ఎల్‌ఎమ్‌టి) కొనుగోలు జరగగా.. ప్రస్తుతం కొనసాగుతున్న సీజన్ ఖరీఫ్ 2020-21లో వరి సేకరణ సజావుగా కొనసాగుతోందని శ్రీ పాండే చెప్పారు. 728.49 ఎల్‌ఎంటి కొనుగోలు ద్వారా సుమారు 118.60 లక్షల మంది రైతులు ఇప్పటికే కొనసాగుతున్న కెఎంఎస్ సేకరణ కార్యకలాపాల నుండి లబ్ధి పొందారు. 1,50,990.91 కోట్లలో 02.06.2021 వరకు 1,38,330.12 కోట్ల ఎంఎస్‌పి నేరుగా రైతుల ఖాతాలోకి బదిలీ చేయబడింది.
****
(Release ID: 1724242)
Visitor Counter : 235