పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

పూణే విమానాశ్రయం ద్వారా దేశం వివిధ ప్రాంతాలకు జనవరి 2021 నుంచి రవాణా అయిన 10 కోట్లకు పైగా వాక్సిన్ డోసులు

Posted On: 03 JUN 2021 4:53PM by PIB Hyderabad

సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న కోవీషీల్డ్ వాక్సిన్ ను దేశం వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తూ పూణే విమానాశ్రయం వాక్సిన్ పంపిణీలో కీలక పాత్ర పోషిస్తోంది.  2021 జనవరి 12వ తేదీ నుంచి మే 27వ తేదీ వరకు 10 కోట్లకు పైగా వాక్సిన్ డోసులు ( 2,89,465 కేజీల బరువు) వివిధ విమాన సంస్థల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా అయ్యాయి. ఢిల్లీ కోల్‌కతాచెన్నైఅహ్మదాబాద్బెంగళూరుభోపాల్గోవాజైపూర్పోర్ట్ బ్లెయిర్విజయవాడభువనేశ్వర్,పాట్నా,లక్నోచండీఘర్లేహ్కర్నాల్హైదరాబాద్,గౌహతిరాంచిజమ్మూ,కొచ్చిన్డెహ్రాడూన్శ్రీనగర్త్రివేండ్రం  వంటి వివిధ గమ్యస్థానాలకు టీకాలు తరలి వెళ్లాయి. దేశంలోని అన్ని విమానాశ్రయాలు టీకాలు, ఇతర వైద్య సామాగ్రి రవాణాలో ఎటువంటి ఆటంకం కలగకుండా సహకరిస్తున్నాయి. 

 

కోవీషీల్డ్ టీకాల రవాణా సజావుగా ఎటువంటి అంతరాయం లేకుండా జరగడానికి ఎఎఐ తో సహా సీరం సంస్థభారత వైమానిక దళంసీఐఎస్ఎఫ్ లాంటి సంబంధిత వర్గాలు సమన్వయంతో పనిచేస్తూ టీకాలను రవాణా చేస్తున్న విమానాలకు ప్రాధాన్యత ఇస్తూ పంపుతున్నాయి. 

విదేశాలకు కూడా విమానాశ్రయం ద్వారా టీకాలు రవాణా అయ్యాయి. ఫిబ్రవరిలో ఇక్కడ నుంచి సురినామ్సెయింట్ కిట్స్సెయింట్ విన్సెంట్ మరియు గెర్నాడైన్స్ఆంటిగ్వా మరియు బార్బుడాసెయింట్ లూసియా లకు ప్రత్యేక విమానాల్లో 2,16,000 డోసుల ( 570 కేజీలు) టీకాలు రవాణా అయ్యాయి.  కోల్‌కతాకు 161 దోషుల  (3670 కిలోలు)  పివిసి వ్యాక్సిన్, ఢిల్లీకి  కోవిడ్ 19 టెస్టింగ్ కిట్‌లను పూణే విమానాశ్రయం నుంచి రవాణా చేశారు.

ప్రయాణీకులు సురక్షితంగా ప్రయాణించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన మార్గదర్శకాలను పూణే విమానాశ్రయంలో అమలు చేస్తున్నారు. మార్గదర్శకాలను పాటించాలని ప్రయాణీకులను కోరుతున్న సిబ్బంది ఎక్కువమంది గుమికూడకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణీకుల్లో అవగాహన కల్పించడానికి నియమనిబంధనలను విమానాశ్రయ ఆవరణలో ప్రదర్శిస్తున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం, వైమానిక దళం, పూణే నగరపాలకసంస్థ సహకారంతో సిబ్బంది కోసం భద్రతా ప్రమాణాలను పాటిస్తూ అధికారులు టీకా కేంద్రాన్ని నిర్వహించారు. 

***



(Release ID: 1724222) Visitor Counter : 183