రైల్వే మంత్రిత్వ శాఖ

ఢిల్లీ ఎన్.సి.ఆర్. ప్రాంతానికి 7,500 మెట్రిక్ టన్నుల ఎల్.ఎం.ఓ. ను రవాణా చేసిన - ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు


21,939 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ పరిమాణంలో ఎల్‌.ఎం.ఓ. ను దేశానికి అందించిన - ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు

దేశవ్యాప్తంగా ఆక్సిజన్ రవాణా ను పూర్తి చేసిన - 321 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు

ఇప్పటివరకు 1304 ట్యాంకర్ల ఎల్‌.ఎం.ఓ. ను రవాణా చేసి 15 రాష్ట్రాలకు ఉపశమనం కలిగించిన - ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు

46 ట్యాంకర్లలో 827 మెట్రిక్ టన్నులకు పైగా ఎల్‌.ఎమ్‌.ఓ. తో నడుస్తున్న - 11 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు

కర్ణాటక, తమిళనాడు, హర్యానా రాష్ట్రాలు ఒక్కో రాష్ట్రానికీ 2,000 మెట్రిక్ టన్నులు దాటిన - ఎల్.ఎం.ఓ. సరఫరా

మహారాష్ట్రలో 614 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్; ఉత్తరప్రదేశ్ లో దాదాపు 3797 మెట్రిక్ టన్నులు; మధ్యప్రదేశ్ లో 656 మెట్రిక్ టన్నులు; ఢిల్లీ లో 5527 మెట్రిక్ టన్నులు; హర్యానా లో 2034 మెట్రిక్ టన్నులు; రాజస్థాన్ లో 98 మెట్రిక్ టన్నులు; కర్ణాటక లో 2115 మెట్రిక్ టన్నులు; ఉత్తరాఖండ్‌ లో 320 మెట్రిక్ టన్నులు; తమిళనాడు లో 2016 మెట్రిక్ టన్నులు; ఆంధ్రప్రదేశ్‌ లో 1896 మెట్రిక్ టన్నులు; పంజాబ్ లో 225 మెట్రిక్ టన్నులు; కేరళ లో 380 మెట్రిక్ టన్నులు; తెలంగాణలో 1978 మెట్రిక్ టన్న

Posted On: 31 MAY 2021 5:42PM by PIB Hyderabad

అన్ని అడ్డంకులను అధిగమించి, కొత్త పరిష్కారాలను కనుగొనే దిశగా, భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌.ఎం.ఓ) ను పంపిణీ చేయడం ద్వారా, ఉపశమనం కలిగించే ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.  భారత రైల్వే, ఇప్పటివరకు, 1304 కి పైగా ట్యాంకర్ల లో 21,939 మెట్రిక్ టన్నులకు పైగా,  ఎల్‌.ఎం.ఓ.ను దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేసింది.

321 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ లు ఇప్పటివరకు తమ ప్రయాణాన్ని పూర్తి చేసి వివిధ రాష్ట్రాలకు ఉపశమనం కలిగించిన విషయాన్ని గమనించవచ్చు.

ఈ సమాచారాన్ని విడుదల చేసే సమయానికి, 46 ట్యాంకర్ల లో  827 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ ఎల్.ఎం.ఓ. తో నింపిన, 11 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు తమ గమ్యం దిశగా నడుస్తున్నాయి.

కర్ణాటక, తమిళనాడు, హర్యానా రాష్ట్రాలు ఒక్కో రాష్ట్రానికీ 2,000 మెట్రిక్ టన్నులకు పైగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ రవాణా అయ్యింది.  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1800 మెట్రిక్ టన్నులకు పైగా, తెలంగాణ రాష్ట్రానికి 1900 మెట్రిక్ టన్నులకు పైగా, లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌.ఎం.ఓ) రవాణా చేయడం జరిగింది. 

37 రోజుల క్రితం ఏప్రిల్ 24వ తేదీన మహారాష్ట్రలో 126 మెట్రిక్ టన్నులు సరఫరా చేయడంతో, ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు తమ రవాణా కార్యక్రమాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. 

సాధ్యమైనంత తక్కువ సమయంలో వీలైనంత ఎక్కువగా ఎల్‌.ఎం.ఓ.ను వివిధ రాష్ట్రాల కు రవాణా చేయాలని భారత రైల్వే లక్యం గా కృషి చేస్తోంది.

ఈ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు, ఇంతవరకు, ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, అస్సాం వంటి 15 రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా ద్వారా ఉపశమనం కల్పించాయి.

ఈ సమాచారాన్ని విడుదల చేసే సమయం వరకు, మహారాష్ట్రలో 614 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్; ఉత్తరప్రదేశ్ లో దాదాపు 3797 మెట్రిక్ టన్నులు;  మధ్యప్రదేశ్ లో 656 మెట్రిక్ టన్నులు; ఢిల్లీ లో 5527 మెట్రిక్ టన్నులు; హర్యానా లో 2034 మెట్రిక్ టన్నులు; రాజస్థాన్ లో 98 మెట్రిక్ టన్నులు;  కర్ణాటక లో 2115 మెట్రిక్ టన్నులు;  ఉత్తరాఖండ్‌ లో 320 మెట్రిక్ టన్నులు; తమిళనాడు లో 2016 మెట్రిక్ టన్నులు; ఆంధ్రప్రదేశ్‌ లో 1896 మెట్రిక్ టన్నులు;  పంజాబ్ లో 225 మెట్రిక్ టన్నులు; కేరళ లో 380 మెట్రిక్ టన్నులు;  తెలంగాణలో 1978 మెట్రిక్ టన్నులు; ఝార్ఖండ్ లో 38 మెట్రిక్ టన్నులు; అస్సాం లో 240 మెట్రిక్ టన్నులు;  ఆక్సిజన్ దింపుకోవడం జరిగింది.

ఈ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు  - ఇప్పటి వరకు,  ఉత్తరప్రదేశ్‌ లోని లక్నో, వారణాసి, కాన్పూర్, బరేలీ, గోరఖ్‌పూర్, ఆగ్రా;  మధ్యప్రదేశ్‌ లోని సాగర్, జబల్‌పూర్, కట్ని, భోపాల్;  మహారాష్ట్ర లోని నాగ్‌పూర్, నాసిక్, పూణే, ముంబై, సోలాపూర్;  తెలంగాణ లోని హైదరాబాద్;  హర్యానా లోని ఫరీదాబాద్, గురుగ్రామ్; ఢిల్లీ లోని తుగ్లకాబాద్, ఢిల్లీ కంటోన్మెంట్, ఓఖ్లా;  రాజస్థాన్‌ లోని కోటా, కానక్‌పారా;  కర్ణాటక లోని బెంగళూరు;  ఉత్తరాఖండ్‌ లోని డెహ్రాడూన్;  ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, గుంటూరు, తాడిపత్రి, విశాఖపట్నం;  కేరళ లోని ఎర్నాకుళం;  తమిళనాడు లోని తిరువల్లూరు, చెన్నై, టుటికోరిన్, కోయంబత్తూర్, మదురై;  పంజాబ్‌ లోని భటిండా, ఫిల్లౌర్;  అస్సాం లోని కామరూప్;  జార్ఖండ్‌ లోని రాంచీ;  వంటి దేశంలోని 15 రాష్ట్రాల్లోని 39 నగరాలు / పట్టణాలకు, ఆక్సిజన్ సరఫరా చేశాయి.   

రైల్వేలు ఆక్సిజన్ సరఫరా స్థానాలతో వేర్వేరు మార్గాలను గుర్తించి, ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాల అవసరాలకు సిద్ధంగా ఉన్నాయి.  కాగా, ఎల్‌.ఎం.ఓ. ను సరఫరా చేయడానికి, రాష్ట్రాలు, భారత రైల్వేకు ట్యాంకర్లను అందిస్తున్నాయి. 

పశ్చిమంలో హపా, ముంద్రా; తూర్పున రూర్కెలా, దుర్గాపూర్, టాటా నగర్, అంగుల్ వంటి ప్రదేశాల నుండి భారత రైల్వే,  ఆక్సిజన్ సేకరించి, సంక్లిష్ట కార్యాచరణ మార్గ ప్రణాళికల ద్వారా, దేశంలోని వివిధ మార్గాల గుండా ప్రయాణించి, ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, అస్సాం వంటి దేశంలోని వివిధ రాష్ట్రాలకు రవాణా చేస్తోంది.

ఆక్సిజన్ సరఫరా సాధ్యమైనంత వేగంగా చేరుకునేలా చూడటానికి, ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ పేరుతో సరకు రవాణా రైళ్ళను నడపడంలో రైల్వే కొత్త ప్రమాణాలతో పాటు, అపూర్వమైన లక్ష్యాలను సాధిస్తోంది.   ఈ క్లిష్టమైన సరుకు రవాణా రైళ్ళ సగటు వేగం చాలా సందర్భాలలో 55 కన్నా ఎక్కువగా ఉంటోంది. ఆక్సిజన్ సరఫరా, వేగంగా, సాధ్యమైనంత అతి తక్కువ సమయ వ్యవధి లో చేరుకోవాలనే లక్ష్యంతో, అధిక ప్రాధాన్యత కలిగిన గ్రీన్ కారిడార్‌లో, అత్యవసర భావనతో, వివిధ మండలాల కార్యాచరణ బృందాలు, అనేక సవాలు పరిస్థితులలో 24 గంటలూ పనిచేస్తున్నాయి.   వివిధ ప్రాంతాల్లో సిబ్బంది మారడం కోసం సాంకేతికంగా రైళ్ళు నిలిపి ఉంచే సమయాన్ని ఒక నిమిషానికి తగ్గించారు. 

ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఎక్కడా ఆగకుండా, వేగంగా గమ్యం చేరుకోడానికి వీలుగా, అధిక అప్రమత్తతను, పాటిస్తూ, ఎక్కడికక్కడ రైలు మార్గాల్లో అవరోధాలు లేకుండా చూస్తున్నారు. 

ఇవన్నీ ఇతర సరకు రవాణా కార్యకలాపాల నిర్వహణ వేగం ఏమాత్రం తగ్గని రీతిలో కొనసాగుతున్నాయి.

కొత్తగా ఆక్సిజన్‌ ఎక్స్ ప్రెస్ రైళ్ళను నడపడం,  ఎప్పటికప్పుడు గణాంకాలతో తాజా సమాచారాన్ని సమకూర్చడం, ఒక క్రియాశీలమైన ప్రక్రియగా జరుగుతోంది.  మరింతగా లోడ్ చేసిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు అర్ధరాత్రి తరువాత ప్రయాణాలను ప్రారంభిస్తాయని భావిస్తున్నారు.

 

*****


(Release ID: 1723319) Visitor Counter : 130