విద్యుత్తు మంత్రిత్వ శాఖ

ఉత్త‌రాఖండ్‌లోని పిత్తోడ్‌గ‌డ్ బేస్ ఆసుప‌త్రిలో నిమిషానికి 1000 లీట‌ర్ల ఆక్సిజ‌న్‌ను ఉత్ప‌త్తి చేసే ప్లాంట్‌ను, ఇత‌ర వైద్య స‌దుపాయాల‌ను ఏర్పాటు చేయ‌నున్న ఆర్ఇసి

Posted On: 31 MAY 2021 7:04PM by PIB Hyderabad

కార్పొరేట్ సామాజిక బాధ్య‌త (సిఎస్ ఆర్‌)లో భాగంగా రూ. 1.85 కోట్ల మేర‌కు ఆర్థిక స‌హాయాన్ని అందించేందుకు ప్ర‌ముఖ ఎన్‌బిఎఫ్‌సి అయిన ఆర్ ఇసి లిమిటెడ్ కు చెందిన ఆర్ ఇసి ఫౌండేష‌న్ ఉత్త‌రాఖండ్‌లోని ఫిత్తోడ్‌గ‌ఢ్‌కు చెందిన చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌తో ఎంఒయుపై సంత‌కాలు చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఉత్త‌రాఖండ్‌లోని పిత్తోడ్‌గ‌ఢ్‌కు చెందిన బేస్ ఆసుప‌త్రిలో నిమిషానికి 1000 లీట‌ర్ల ఆక్సిజ‌న్‌ను ఉత్ప‌త్తి చేయ‌గ‌ల ప్లాంట్‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. దానితో పాటుగా, ఆసుప‌త్రికి 22 ఆక్సిజ‌న్ కాన్స‌న్ట‌రేట‌ర్లు,  చ‌క్రాలు ఉన్న 200 ఫౌల‌ర్ ప‌డ‌క‌ల‌ను అందించి, ప‌డ‌క‌ల సంఖ్య‌ను 250 నుంచి 450కు పెంచ‌నున్నారు. స్థానిక ప్ర‌జానీకానికి అవ‌స‌ర‌మైన వైద్య చికిత్స‌ను అందించేందుకు ఆసుప‌త్రిలో కోవిడ్ కేర్ సౌక‌ర్యాన్ని బ‌లోపేతం చేసే ల‌క్ష్యంతో ఈ చొర‌వ‌ను చేప‌ట్టారు. 
దేశంలో ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌రిచేందుకు ఆర్ఇసి ఫౌండేష‌న్ నిరంత‌రం ప‌ని చేస్తోంది. ఈ నెల మొద‌ట్లో, పైణెకు చెందిన ద‌ల్వీ ఆసుప‌త్రిలో నిమిషానికి 1700 లీట‌ర్ల ఆక్సిజ‌న్ చేయ‌గ‌ల (పూర్తిగా కూర్చిన‌)  ప్లాంట్‌ను , 150కెవిఎ జ‌న‌రేట‌ర్ ప్లాంట్ ఏర్పాటు కోసం రూ. 2.21 కోట్ల ఆర్ధిక స‌హాయాన్ని ఫౌండేష‌న్ అందించింది. ఈ ప్రాజెక్టును పూణె మునిసిప‌ల్ కార్పొరేష‌న్ అమ‌లు చేస్తూ, ఆసుప‌త్రికి నిరాటంకంగా ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాను చేస్తోంది. 
ఫౌండేష‌న్ చేప‌ట్టి, తోడ్ప‌డిన మరొక ప్రాజెక్టు ఉత్త‌రాఖండ్‌, ఉద్దంసింగ్ న‌గ‌ర్‌లోని రుద్ర‌పూర్‌లోని పండిత్ రామ్ సుమేర్ శుక్ల స్మృతి గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజీని కోవిడ్ చికిత్సా కేంద్రంగా మార్చ‌డం.  ఈ సెంట‌ర్‌లో 36 ప‌డ‌క‌ల ఐసియు వార్డుతో స‌హా 300 ప‌డ‌క‌ల ఆసుప‌త్రి, ఐసొలేష‌న్ సెంట‌ర్‌, ప‌రీక్షా కేంద్రం, త‌దిత‌రాలు ఉన్నాయి. జిల్లాలోని వైద్య మౌలిక స‌దుపాయాల‌ను బ‌లోపేతం చేయ‌డ‌మే కాకుండా,  మ‌హ‌మ్మారి కాలంలో స‌మ‌యానుకూలంగా వైద్య చికిత్స‌, సేవ‌ల‌ను అందించ‌డంలో స్థానిక పాల‌కుల స్పంద‌న‌ను ఈ ప్రాజెక్టు పెంచింది. 
విద్యుత్ మంత్రిత్వ శాఖ ప‌రిధిలో దేశ‌వ్యాప్తంగా విద్యుత్ రంగ ఫైనాన్సింగ్‌, అభివృద్ధిపై దృష్టి పెట్టిన న‌వ‌ర‌త్న ఎన్‌బిఎఫ్‌సి - ఆర్ ఇసి లిమిటెడ్‌. 1969లో ప్రారంభ‌మైన ఆర్ఇసి లిమిటెడ్ యాభై సంవ‌త్స‌రాలకు కార్య‌క‌లాపాల‌ను సాగిస్తోంది. ఈ సంస్థ రాష్ట్ర విద్యుత్ బోర్డుల‌కు, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు, కేంద్ర‌, రాష్ట్ర విద్యుత్ వినియోగాల‌కు, స్వ‌తంత్ర విద్యుత్ ఉత్ప‌త్తిదారులు, గ్రామీణ విద్య‌త్ కోఆప‌రేటివ్లు, ప్రైవేటు రంగ వినియోగ‌దారుల‌కు ఆర్థిక స‌హాయాన్ని అందిస్తుంది. విద్యుత్ రంగ విలువ లంకెలో  ప్రాజెక్టుల‌కు నిధుల‌ను అందించ‌డం, ఈ ప్రాజెక్టుల‌లో విద్యుత్ ఉత్ప‌త్తి, స‌ర‌ఫ‌రా, పంపిణీ ప్రాజెక్టులు, పున‌రుత్పాద‌క ఇంధ‌న ప్రాజెక్టులు ఉన్నాయి.

 

 

***
 


(Release ID: 1723255) Visitor Counter : 161