రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

విశాఖపట్నం, నావల్ డాక్ యార్డ్, అడ్మిరల్ సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన - రియర్ అడ్మిరల్ ఐ.బి. ఉత్తయ్య, వి.ఎస్.ఎమ్.

Posted On: 31 MAY 2021 4:26PM by PIB Hyderabad

విశాఖపట్నం, నావల్ డాక్ యార్డ్, అడ్మిరల్ సూపరింటెండెంట్ గా, రియర్ అడ్మిరల్ ఐ.బి. ఉత్తయ్య, వి.ఎస్.ఎమ్. 2021 మే నెల 31వ తేదీన జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో, రియర్ అడ్మిరల్ శ్రీకుమార్ నాయర్ నుండి బాధ్యతలు స్వీకరించారు.

రియర్ అడ్మిరల్ ఐ.బి. ఉతయ్య, వి.ఎస్.ఎమ్. 1987, నవంబర్ నెలలో భారత నావికాదళంలో నియమించబడ్డారు.   అడ్మిరల్ ఐ.బి. ఉతయ్య, మెరైన్ ఇంజనీరింగ్‌లో బి.టెక్. డిగ్రీ, గణిత మోడలింగ్ మరియు కంప్యూటర్ సిమ్యులేషన్‌లో ఎం.టెక్ డిగ్రీతో పాటు స్ట్రాటజిక్ స్టడీస్‌ లో ఎం. ఫిల్. డిగ్రీని కలిగి ఉన్నారు.

తన 33 సంవత్సరాల సర్వీసులో, అడ్మిరల్  ఐ.బి. ఉతయ్య, భారత నావికాదళానికి  చెందిన, యుద్ధ నౌకల రూపకల్పన డైరెక్టరేట్, శిక్షణ అకాడమీ లు, నావల్ డాక్ యార్డ్, కమాండ్ మరియు నావల్ ప్రధాన కార్యాలయాలలో వివిధ హోదాల్లో సేవలందించారు.   యుద్ధనౌక రూపకల్పన, నిర్మాణం,  స్వాధీనం చేసుకోవడం; యుద్ధ నౌకల నిర్వహణ; మరమ్మత్తు; శిక్షణ; భారీ నౌకల ప్రాజెక్టు యాజమాన్యం; సివిల్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు మొదలైన విభాగాల్లో ఆయన కీలక పదవులు నిర్వహించారు.   ఇటీవల ఆయన నిర్వహించిన కార్యాచరణ మరియు సిబ్బంది నియామకాల పదవులలో, విశాఖపట్నం లోని నావల్ డాక్ యార్డ్, జనరల్ మేనేజర్ (రీఫిట్) మరియు ప్రిన్సిపల్ డైరెక్టర్ (షిప్ ప్రొడక్షన్) ఉన్నాయి.  రియర్ అడ్మిరల్ హోదాకు పదోన్నతి తరువాత, ఆయన ప్రాజెక్ట్ సీబర్డ్ ప్రధాన కార్యాలయంలో అదనపు డైరెక్టర్ జనరల్ (టెక్నికల్) గా కూడా నియమితులయ్యారు.  మెగా ప్రాజెక్టులో లో భాగంగా కార్వార్ వద్ద భవిష్యత్ నావికా స్థావరం, నాలుగు స్వీయ-నియంత్రణ టౌన్‌షిప్‌లు, నావల్ ఎయిర్ స్టేషన్ తో పాటు, 400 పడకల ప్రత్యేక సంరక్షణ ఆసుపత్రి ఏర్పాటు వంటివి కూడా ఉన్నాయి.

నావల్ వార్ కళాశాల పూర్వ విద్యార్థి అయిన ఐ.బి. ఉతయ్య, నావల్ డాక్ యార్డు లో విశిష్ట సేవ చేసినందుకు విశిష్ట సేవా మెడల్ (వి.ఎస్.ఎమ్) అందుకున్నారు. అదేవిధంగా, ప్రిన్సిపల్ డైరెక్టర్‌ గా రష్యా మరియు భారత షిప్‌ యార్డుల మధ్య ప్రధాన యుద్ధ నౌకల నిర్మాణ ఒప్పందాలను కుదుర్చుకోవడం లో కూడా ఆయన,  కీలకపాత్ర పోషించారు.

రియర్  అడ్మిరల్ శ్రీకుమార్ నాయర్, ఎన్.ఎమ్., విశాఖపట్నం లోని, నావల్ డాక్ యార్డ్ వద్ద అధికారాన్ని అప్పగించిన అనంతరం, పదోన్నతిపై విశాఖపట్నం లోని నావల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరిస్తారు.

 

*****


(Release ID: 1723198) Visitor Counter : 223