రక్షణ మంత్రిత్వ శాఖ
ఎంవిఎక్స్-ప్రెస్ పెర్ల్‌పై సంభవించిన అగ్నిని నియంత్రించేందుకు కార్యకలాపాలను కొనసాగిస్తున్న ఇండియన్ కోస్ట్ గార్డ్
Posted On:
28 MAY 2021 10:33AM by PIB Hyderabad
వ్యతిరేక వాతావరణ పరిస్థితులు, అల్లకల్లోలంగా ఉన్న సముద్రం నడుమ భారతీయ కోస్ట్ గార్డ్ (ఐసిజి) నౌకలు వైభవ్, వజ్రలు శ్రీలంకలోని కొలంబో సమీపంలో భారీ వాహనాలు తరలించే నౌక్ ఎంవిఎక్స్- ప్రెస్ పెర్ల్ లో చెలరేగిన మంటలను ఆపేందుకు పోరాటం చేస్తున్నాయి. శ్రీలంక మోహరించిన నౌకలతో ఉమ్మడిగా ఐసిజి నౌకలు కంటైనర్ నౌక రెండు వైపులా పలుసార్లు తిరుగుతూ ఎఎఫ్ఎఫ్ఎఫ్ ద్రావణాన్ని/ సముద్ర నీటిని బాహ్య అగ్నిమాపక వ్యవస్థ ద్వారా విరజిమ్ముతున్నాయి.
నౌకకు ఇరువైపులా పేర్చిన కంటైనర్లు పాక్షికంగా లేదా పూర్తిగా కలిపోయాయని, కొన్ని ప్రాంతాలలో అవి దొర్లి కింద పడిపోయే ప్రమాదం ఉందని వార్తలు వచ్చాయి. అయితే, యుక్తితో ఐసిజి నౌకలు ప్రమాదంలో చిక్కుకున్న నౌకకు 40-50 మీటర్ల దగ్గరకు వెళ్లి ప్రభావవంతంగా సముద్రపునీరు/ ఫోమ్‌ను స్ప్రేచేశాయి. ఐసిజి నౌకలు అవిరామంగా, సంయుక్తంగా చేసిన అగ్నిమాపక చర్యల ఫలితంగా ఆపదలో ఉన్న నౌక ముందు, మధ్య భాగాలలో అగ్ని తగ్గింది. అయినప్పటికీ ఉపరినిర్మాణానికి దగ్గరలో ఉన్న వెనుకభాగంలో కొనసాగుతోంది.
వైమానిక నిఘా చేపట్టిన ఐసిజి డోర్నియర్ విమానం మే 27, 2021న చమురు ఎక్కడా ఒలకలేదని తెలిపింది. ఈ విమానం మదురై నుంచి కార్యకలాపాలు సాగిస్తుంది. అగ్నిమాపక యత్నాలను మరింతగా పెంచడానికి, చమురు ఎక్కడైనా ఒలికితే స్పందించడానికి ప్రత్యేక కాలుష్య ప్రతిస్పందన (పిఆర్) నౌకను పిఆర్ కన్ఫిగరేషన్‌తో పంపారు.
ఆపదలో ఉన్న ఎంవి ఎక్స్- ప్రెస్ పెర్ల్ 1,486 కంటైనర్ల నైట్రిక్ ఆసిడ్ ను, ఐఎండిజి కోడ్ గల ప్రమాదకర రసాయనాలను రవాణా చేస్తోంది. తీవ్రమైన మంటలు, కంటైనర్లు దెబ్బతినడం, ప్రతికూల వాతావరణం నౌక ఒకవైపుకు ఒరగడానికి దారి తీసాయి. ఫలితంగా కంటైనర్లు నౌకలోంచి కింద పడ్డాయి. అగ్నిమాపక కార్యకలాపాలను తీవ్రతరం చేసేందుకు ఐసిజి నౌక వజ్ర 26 మే 2021న శ్రీలంక అధికారులకు 4,500 లీటర్ల ఎఎఫ్ఎఫ్ఎఫ్ కాంపౌండ్, 450 కిలోల పొడి రసాయన పొడిని అందచేసింది.
కాలుష్య ప్రతిస్పందనకు తక్షణ తోడ్పాటును అందించేందుకు కొచ్చి, చెన్నై, ట్యూటికార్న్‌లలో ఐసిజి ఫార్మేషన్లను స్టాండ్‌బైగా ఉంచారు. అగ్నిని అదుపులోకి తెచ్చేందుకు సమగ్ర స్పందనను మరింతగా పెంచేందుకు శ్రీలంక కోస్ట్ గార్డ్, శ్రీలంక అధికారులతో నిరంతర సహాయ సహకారాలను అందిస్తున్నారు.
***
(Release ID: 1722609)
Visitor Counter : 198