శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఎన్ 95 మాస్కులు, పిపిఈ, వైద్య పరికరాలను తిరిగి వినియోగించడానికి అవకాశం కల్పించే క్రిమిసంహారక వ్యవస్థకు డీఎస్టీ ఆమోదం తగనున్న కోవిడ్-19 బయో-మెడికల్ వ్యర్థాల ఉత్పత్తి

వ్యవస్థను ఐఐటీ ముంబయిలో పరీక్షించి ఆమోదించిన బయోసైన్సెస్, బయో ఇంజనీరింగ్ శాఖ

Posted On: 27 MAY 2021 5:58PM by PIB Hyderabad

ఎన్ 95 మాస్క్ / పిపిఈ లను శుద్ధి చేయడానికి ముంబయికి చెందిన అంకుర సంస్థ ఇంద్ర వాటర్ అభివృద్ధి చేసిన  క్రిమిసంహారక వ్యవస్థను మహారాష్ట్ర మరియు  తెలంగాణలోని పలు ప్రభుత్వ ఆసుపత్రులలో ఏర్పాటు చేశారు.

వజ్ర కవచ పేరిట అభివృద్ధి చేసిన ఈ  క్రిమిసంహారక వ్యవస్థ కోవిడ్ కట్టడి, నివారణలో ఎక్కువగా ఉపయోగిస్తున్న ఎన్ 95 మాస్క్ / పిపిఈ, వైద్య వైధ్యేతర పరికరాలను శుద్ధి చేసి తిరిగి వినియోగించడానికి అవకాశం కలిగిస్తుంది. దీనివల్ల ఖర్చు తగ్గడమే కాకుండా కోవిడ్ సంబంధిత బయో-మెడికల్ వ్యర్థాల ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీనివల్ల పర్యావరణ కాలుష్యం తగ్గడంతో పాటు వ్యక్తిగత రక్షణ పరికరాలు తక్కువ ఖర్చుతో అందరికి అందుబాటులోకి వస్తాయి. 

పీపీఈ లలో ఉండే వైరస్సులు, బాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులను అధునాతన ఆక్సీకరణ,కరోనా విడుదల, యూవీ-సి లైట్ స్పెక్ట్రమ్ లతో ఈ వ్యవస్థ 99.99% వరకు తొలగించే సామర్ధ్యం కలిగి ఉంటుంది. 

నీటి రంగంలో ఆవిష్కరణల కోసం డిఎస్టీ  (సైన్ -ఐఐటీ  బొంబాయి ద్వారా)  నిధి-ప్రయాస్ కింద విడుదల చేసిన గ్రాంటుతో   ఇంద్ర వాటర్ ఒక అంకుర సంస్థగా ఏర్పాటయింది.  కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి అమలు చేస్తున్న చర్యలను వేగవంతం చేయడానికి ఈ కేంద్రాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించిన కేంద్రప్రభుత్వం దీనికి అవసరమైన నిధులను విడుదల చేసింది. సెంటర్ ఫర్ ఆగ్మెంటింగ్ వార్ ను కోవిడ్-19 హెల్త్ క్రైసిస్, శాస్త్రసాంకేతికశాఖ విడుదల చేసిన నిధులతో ఇంద్ర వాటర్ తన సాంకేతికతను సవరించుకుంది.  సైన్ -ఐఐటీ  బొంబాయి సహకారంతో నెలకు 25 25 క్రిమిసంహారక వ్యవస్థలను తయారు చేసి సరఫరా చేసే సామర్ధ్యాన్ని సమకూర్చుకుంది. 

ఐఐటి బొంబాయిలోని బయోసైన్సెస్ , బయో ఇంజనీరింగ్ విభాగం ఈ వ్యవస్థను  పరీక్షించి ధృవీకరించింది. ఇది   వైరస్లు మరియు బ్యాక్టీరియాను 5 లాగ్  (99.999%) వరకు నిర్వీర్యం చేస్తున్నదని నిర్ధారించింది.  సీస్ఐఆర్ నీరి ఆమోదించిన ఈ వ్యవస్థ ఐపీ 55 ధృవీకరణ పొందింది.   భారతదేశం అంతటా కోవిడ్-19 రోగులకు చికిత్స అందిస్తున్న దీనిని నెలకొల్పుతున్నారు. 

***(Release ID: 1722293) Visitor Counter : 51