రక్షణ మంత్రిత్వ శాఖ
పళాస కోవిడ్ కేర్ సెంటర్‌కు ఆక్సిజన్ ఆన్ వీల్స్‌ను అందించిన భారతీయ నావికాదళం
Posted On:
26 MAY 2021 10:42AM by PIB Hyderabad
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ విజ్ఞప్తికి స్పందించి భారతీయ నావికాదళం పళాస కోవిడ్ కేర్ సెంటర్‌కు 25మే 21న ఆక్సిజన్ ఆన్ వీల్స్ ప్లాంట్‌ను అందచేసింది. ఈ ఆక్సిజన్ ఆన్ వీల్స్‌కు నావికాదళానికి చెందిన నౌకా నిర్మాణ స్థలం (నావల్ డాక్‌యార్డ్) రూపకల్పన చేసింది. దీనిని పళాస కోవిడ్ కేర్ సెంటర్‌లో పశుసంవర్ధక, డైరీ డెవలప్‌మెంట్ మత్స్యశాఖా మంత్రి సీదిరి అప్పలరాజు సబ్ కలెక్టర్ సూరజ్ గనోర్, నావికాదళ బృంద సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు. విశాఖపట్నానికి చెందిన నావల్ డాక్ యార్డ్ నుంచి వచ్చిన నిపుణుల బృందం పళాసలోని కోవిడ్ హెల్త్ కేర్ సెంటర్‌లో ఆక్సిజన్ పైప్‌లైన్ తో ఆక్సిజన్ ఆన్ వీల్స్‌ను అనుసంధానం చేశారు. ఆసుపత్రిలో చేరిన 12మంది వరకూ రోగులకు ఇది 24 గంటలూ ఆక్సిజన్‌ను అందిస్తుంది. ఈ ప్లాంట్ నిర్వహణలో ఆసుపత్రి సిబ్బందికి నిపుణుల బృందం శిక్షణను ఇచ్చింది.
ఆక్సిజన్ ఆన్ వీల్స్ నావల్ డాక్ యార్డ్ చేపట్టిన ప్రత్యేక చొరవ. మారుమూల ప్రాంతాలలో ఉన్న ఆసుపత్రులకు సేవలు అందించేందుకు పిఎస్ఎ ఆక్సిజన్ ప్లాంట్‌ను చలన వేదికతో (మొబైల్ ప్లాట్‌ఫాం) ఏకీకృతం చేశారు. దీనిని వైస్ అడ్మిరల్ ఎబి సింగ్, ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-ఛీప్, ఇఎన్‌సి 20 మే 21న విశాఖపట్నంలో లాంఛనంగా ప్రారంభించారు.
***
(Release ID: 1721860)
Visitor Counter : 275