వ్యవసాయ మంత్రిత్వ శాఖ
2020-21 సంవత్సరానికి సంబంధించి ముఖ్యమైన పంటల దిగుబడి ముందస్తు అంచనాలను విడుదల చేసిన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ 305.44 మిలియన్ టన్నుల రికార్డు స్థాయి ఆహారధాన్యాల దిగుబడి రాగలదని అంచనా
ఇది 2019-20 సంవత్సరం నాటికంటే 7.94 మిలియన్ టన్నులు అధికం.
రైతుల నిర్విరామ కృషి, శాస్త్రవేత్తల సూచనలు, ప్రభుత్వ విధానాలు ఈ సానుకూల ఫలితాలు రానుండడానికి కారణం : శ్రీ నరేంద్ర సింగ్ తోమర్
Posted On:
25 MAY 2021 7:12PM by PIB Hyderabad
కేంద్ర వ్యవసాయ, సహకా, రైతు సంక్షేమ శాఖ 2020-21 సంవత్సరానికి ప్రధాన వ్యవసాయ ఉత్పత్తుల కు సంబంధించచి మూడవ ముందస్తు దిగుబడి అంచనాలను విడుదల చేసింది.
మొత్తం ఆహారధాన్యాల దిగుబడి 305.44 మిలియన్ టన్నులుగా ఉంటుందని అంచనా. మన రైతుసోదరులు, సోదరీమణుల నిర్విరామ కృషి, వ్యవసాయ శాస్త్రవేత్తల కృషి, భారత ప్రభుత్వ విధానాలు, రాష్ట్రప్రభుత్వాల నుంచి మెరుగైన సహకారం, సమన్వయం వల్ల ఈ సానుకూల ఫలితాలు సాధ్యం కానున్నాయని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రధాన దృష్టి వ్యవసాయరంగంపై ఉందని ,. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు
వివిధ పంటల దిగుబడికి సంబంధించిన అంచనాల గణాంకాలు వివిధ రాష్ట్రాల నుంచి అందిన సమాచారాన్ని, ఇతర రకాలుగా అందిన సమాచారంతో సరిపోల్చుకుని ఒక అంచనా కు రావడం జరిగింది. 2005-06 నుంచి ప్రధాన పంటలన దిగుబడి అంచనాల పోలిక జతచేయడం జరిగింది.
మూడవ విడత ముందస్తు అంచనాల ప్రకారం 2020-21 సంవత్సర కీలక పంటల దిగుబడి అంచనాలు కిందివిధంగా ఉన్నాయి.
ఆహారధాన్యాలు - 305.44 మిలియన్ టన్నులు (రికార్డు)
ధాన్యం -121.46 మిలియన్ టన్నులు (రికార్డు)
గోధుమలు-108.75 మిలియన్ టన్నులు (రికార్డు)
న్యూట్రి , తృణధాన్యాలు -49.66 మిలియన్ టన్నులు
మొక్కజొన్న- 30.24 మిలియన్ టన్నులు (రికార్డు)
పప్పుధాన్యాలు-25.58 మిలియన్ టన్నులు
కందిపప్పు -4.14 మిలియన్ టన్నులు
గ్రామ్ -12.61 మిలియన్ టన్నులు (రికార్డు)
నూనెగింజలు -36.57 మిలియన్ టన్నులు
వేరుశనగ- 10.12 మిలియన్ టన్నులు (రికార్డు)
సోయాబీన్-13.14 మిలియన్ టన్నులు
కుసుమ, ఆవాలు-9.99 మిలియన్ టన్నులు (రికార్డు)
చెరకు-392.80 మిలియన్ టన్నులు
పత్తి -36.49 మిలియన్ బేళ్లు (ఒక్కొక్కటి 170 కేజీల వంతున)
జనపనార, మెస్తా-9.62 మిలియన్ బేళ్లు (ఒక్కొక్కటి 180 కేజీలు)
.2020-21 మూడవ ముందస్లు అంచనాల ప్రకారం, దేశంలో మొత్తం ఆహార ధాన్యాల దిగుబడి రికార్డు స్థాయిలో 305.44 మిలియన్ టన్ననులుగా ఉండనుంది, ఇది 2019-20 సంవత్సరంలో సాధించిన 297.50 మిలియన్ టన్నులతో పోల్చిచూసినపుడు 7.94 మిలియన్‌టన్నులు అధికం. దీనికితోడు, 2020-21 ఉత్పత్తి అంతకు ముందు ఐదు సంవత్సరాల కాలం అంటే 2015-16 నుంచి 2019-20 కాలానికి సగటు ఆహార ధాన్యాల ఉత్పత్తికన్న 26.66 మిలియన్ టన్నులు అధికం.
2020-21లో ధాన్యం ఉత్పత్తి 121.46 మిలియన్ టన్నులుగా ఉండనుంది. ఇది గత ఐదు సంవత్సరాల సగటు ఉత్పత్తి 112.44 మిలియన్ టన్నుల కంటే 9.01 మిలియన్ టన్నులు అధికం.
2020-21 సంవత్సరానికి గోధుమల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 108.75 మిలియన్ టన్నులు ఉండనుంది. ఇది సగటు గోధుమల ఉత్పత్తి 100.42 మిలియన్ టన్నుల తో పోలిస్తే 8.32 మిలియన్ టన్నులు అధికం.
పోషకాహారర విలువలుగల తృణధాన్యాల దిగుబడి 49.66 మిలియన్ టన్నులు ఉండగలదని అంచనా. ఇది 2019-20లో దిగుబడితో పోలిస్తే 1.91 మిలియన్‌టన్నులు అధికం. సగటు దిగుబడి కంటే ఇది 5.68 మిలియన్‌టన్నులు అధికం.
మొత్తం పప్పు ధాన్యాల దిగుబడి 2020-21 లో 25.58 మిలియన్‌టన్నులుగా ఉండనుంది. ఇది గత ఐదు సంవత్సరాల సగటు దిగుబడి అయిన 21.93 మిలియన్ టన్నులతో పోల్చినపుడు 3.64 మిలియన్ టన్నులు అధికం.
మొత్తం చమురు గించల ఉత్పత్తి దేశంలో 2020-21 లో రికార్డు స్థాయిలో 36.57 మిలియన్ టన్నులు గా ఉండనుంది. ఇది 2019-20 లో దిగుబడి అయిన 33.22 మిలియన్ టన్నుల కంటే 3.35 మిలియన్ టన్నులు అధికంగా ఉండబోతున్నది. అంతే కాకుండా 2020-21 లో చమురు గింజల ఉత్పత్తి సగటు చమురు గింజల ఉత్పత్తి కన్న 6.02 మిలియన్ టన్నులు అధికంగా ఉండనుంది.
దేశంలో 2020-21లో మొత్తం చెరకు ఉత్పత్తి 392.80 మిలియన్ టన్నులు ఉండగలదని అంచనా. ఇది సగటు చెరకు ఉత్పత్తి 362.07 మిలియన్ టన్నుల కంటే 30.73 మిలియన్ టన్నులు అధికం.
కాటన్ ఉత్పత్తి అంచనా 36.49 మిలియన్ బేళ్లు ( ఒక్కొక్కటి 170 కేజీలది) గా అంచనా వేశారు. ఇది సగటు పత్తి ఉత్పత్తి కన్న 4.59 మిలియన్ బేళ్లు ఎక్కువ. జనపనార , మెస్తా దిగుబడి 9.62 మిలియన్ బేళ్లుగా ( ఒక్కొక్కటి 180 కేజీలు) ఉండనుంది.
2020-21 సంవత్సరానికి ఆహార ధాన్యాల దిగుబడి కి సంబంధించి మూడవ ముందస్తు అంచనాల కోసం క్లిక్ చేయండి..
(Release ID: 1721834)
Visitor Counter : 274