ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత ప్రభుత్వం రాష్ట్రాలకు 21.80 కోట్లకు పైగా ఉచిత టీకా డోసుల పంపిణీ
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల దగ్గర 1.9 కోట్ల డోసులకు పైగా నిల్వ
Posted On:
23 MAY 2021 11:31AM by PIB Hyderabad
కోవిడ్ మీద పోరులో భాగంగా భారత ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యాధి నిర్థారణ పరీక్షలు, సోకినవారీ ఆచూకీ కనిపెట్టటం, తగిన చికిత్స అందించటం, వ్యాప్తి నివారణకు తగిన జాగ్రత్తలు పాటింపజేయటం, టీకాలివ్వటం అనే ఐదు అంశాల ప్రాధాన్యంలో భాగంగా టీకాల మీద ప్రత్యేక దృష్టిసారించింది. భారత ప్రభుత్వం దేశవ్యాప్త టీకాల కార్యక్రమానికి అండగా ఉండి రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు టీకా డోసులు ఉచితంగా అందిస్తూ వచ్చింది. అంతే కాకుండా ఉత్పత్తి, సరఫరాను పెంచటానికి అనేక చర్యలు తీసుకుంటోంది.
మూడో దశ టీకాల కార్యక్రమాన్ని మరింత సరళంగా, వేగంగా అమలు చేయటం మే 1న మొదలైంది. ఈ వ్యూహంలో భాగంగా ప్రతి నెలలో సెంట్రల్ డ్రగ్స్ లేబరేటరీ ఆమోదించిన ఉత్పత్తి సంస్థలలో తయారైన 50% టీకా మందును కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రాష్ట్రాలు మిగిలిన 50% నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ప్రభుత్వం అందించే టీకామందు మునుపటిలాగానే రాష్టాలకు ఉచితంగా పంపిణీ జరుగుతుంది.
భారత ప్రభుత్వం ఇప్పటిదాకా రాష్ట్రాలకు, కేంద్రపాలితప్రాంతాలకు దాదాపు 21.8 కోట్లకు పైగా (21,80,51,890) కోవిడ్ డోసులు ఉచితంగా అందజేసింది. ఇందులో రాష్ట్రాల వాడకం, వృధా కలిపి 22వ తేదీ వరకు 19,90,31,577 డోసులు ఉన్నట్టు ఈ ఉదయం 8 గంటల వరకు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
రాష్ట్రాల దగ్గర ఇంకా 1.90 కోట్లకు పైగా (1,90,20,313) టీకా డోసులు పంపిణీకి అందుబాటులో ఉన్నాయి
పైగా, మరో 40,650 టీకా డోసులు వచ్చే 3 రోజుల్లో కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపబోతోంది
****
(Release ID: 1721026)
Visitor Counter : 224
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam