గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

గ్రామీణాభివృద్ధి పథకాలపై పర్యవేక్షణకు రెండుయాప్.లు

కేంద్రమంత్రి నరేంద్ర తోమర్ చేతులమీదుగా ఆవిష్కరణ

Posted On: 21 MAY 2021 7:47PM by PIB Hyderabad

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పాటుగా, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలుచేసే కార్యక్రమాలను సజావుగా నిర్వహించేందుకు రెండు ఐ.టి. అప్లికేషన్లను ప్రభుత్వం ప్రారంభించింది. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సాఫ్ట్.వేర్ (ఎన్.ఎం.ఎం.ఎస్.)  అనే యాప్ ను, ఏరియా ఆఫీసర్ మానిటరింగ్ యాప్ ను. కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, రైతు సంక్షేమం, పంచాయతీ రాజ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ రోజు ఆవిష్కరించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ  సహాయమంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి, మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు, వివిధ రాష్ట్రాలకు చెందిన అధికారులు వీడియో కాన్ఫరెన్సింగ్ పద్ధతిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  మహాత్మాగాంధీ జాతీయ. గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్.ఆర్.ఇ.జి.ఎస్.) పనులను నిర్వహించే ప్రదేశాల్లో కార్మికుల క్షేత్రస్థాయి హాజరు వివరాలను సేకరణకు ఎన్.ఎం.ఎం.ఎస్. యాప్ వీలు కల్పిస్తుంది. పనులపై పౌరుల వీక్షణ సదుపాయాన్ని పెంచేందుకు, ఉపాధి హామీ కార్మికులకు వేగంగా చెల్లింపులు జరిగేలా చూసేందుకు ఈ యాప్ దోహదపడుతుంది.

 తాము కనుగొన్న విషయాలను ఆన్ ద్వారా నమోదు చేసేందుకు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అమలుచేసే అన్ని పథకాలను సమన్వయంతో ట్యాగ్ చేసేందుకు ఏరియా ఆఫీసర్ మానిటరింగ్ యాప్ వీలు కలిగిస్తుంది. అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ (పి.ఎం.ఎ.వై.జి.), ప్రధానమంత్రి గ్రామీణ షడక్ యోజన (పి.ఎం.జి.ఎస్.వై.) వంటి పథకాలను ఆన్ లైన్ ద్వారా సమన్వయం చేసేందుకు ఇది ఉపకరిస్తుంది. పనులపై క్షేత్రస్థాయి సిబ్బంది, పర్యవేక్షణా అధికారుల తనిఖీలను మరింత మెరుగైన స్థాయిలో రికార్డు చేసేందుకు వీలు కలిగిస్తుంది. దీనితో యాప్ ద్వారా కనుగొన్న వివరాలను వినియోగించుకుని కార్యక్రమాల అమలును మరింత మెరుగుపరిచేందుకు వీలుంటుంది.

WhatsApp Image 2021-05-21 at 5.46.14 PM.jpeg

  కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలులో పారదర్శకతను తెచ్చేందుకు మంత్రిత్వ శాఖ చేసిన కృషి అభినందనీయమని అన్నారు. ఈ రోజు ఆవిష్కరించిన రెండు యాప్.లు పారదర్శకతను తేవడంలో, పథకాల పనులను పర్యవేక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. యాప్.లను బహుళ భాషలతో రూపొందించాలని అందుకు తగినంత శిక్షణను, ఉపకరణాలను అందించాలని మంత్రి సూచించారు.

  గ్రామీణ ప్రజలకు ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించడంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించిందని, ప్రత్యేకించి కోవిడ్ వైరస్ వ్యాప్తి కష్టసమయంలో ఇది ఎంతో కీలకపాత్ర పోషించిందని అన్నారు. అవసరార్థులకు సాధ్యమైనంత అండగా నిలవడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. ఉపాధి హామీ పథకానికి తమ ప్రభుత్వం 2020-21వ సంవత్సరంలో పెట్టుబడిని రూ. 61,500కోట్ల నుంచి లక్షా 11వేల కోట్ల రూపాయలకు పెంచిందన్నారు. అసరమైన ప్రజలందరికీ గృహవసతి కల్పించేందుకు, వారి అవసరాలకు తగినట్టుగా పనులను నిర్వహించేందుకు ఈ కేటాయింపును పెంచినట్టు మంత్రి చెప్పారు.

  ఉపాధి హామీ పనులు చేసే కార్మికుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా 99శాతం చెల్లింపులను జరిపేందుకు మంత్రిత్వ శాఖ చేసిన కృషి అభినందనీయమని అన్నారు. ఈ చెల్లింపులను ప్రత్యక్ష నగదు బదిలీ ప్రక్రియ ద్వారా చేపట్టినట్టు చెప్పారు. పారదర్శకత, జవాబ్దారీ తనం దిశగా ఇది ప్రయత్నమని ఆయన అన్నారు. ప్రభుత్వం పూర్తి సమన్వయ కృషితో పనులు జరిగే స్థలాల జియోట్యాగింగ్ ప్రక్రియకోసం చేపట్టిన జియో-ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎ. వ్యవస్థ ఎంతో ప్రయోజనకరం ఉంటుందని మంత్రి అన్నారు. అనామక ఆస్తులకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుతోందన్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు ఇది ఉపకరిస్తుందని అన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలపై పౌరుల విశ్వాసాన్ని పొందేందుకు కూడా ఇది దోహదపడుతుందని అన్నారు.

   కరోనా కష్ట  సమయంలో మహాత్మా గాంధీ జాతియ ఉపాధి హామీ పథకం పనులు నిరాటంకంగా కొనసాగేలా చూడటంలో కీలకపాత్ర పోషించిన పథకం క్షేత్రస్థాయి అధికారులకు, గ్రామ రోజ్.గార్ సేవక్.ల వంటి వలంటీర్లకు, పంచాయతీ కార్యదర్శలకు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బందికి, స్వయం సహాయక బృందాలకు మంత్రి అభినందనలు తెలిపారు. పనుల నిర్వహణలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కోవిడ్19 నిబంధనలకు కచ్చితంగా అమలు జరిగేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కోవిడ్ పై పోరాటంలో విజయం సాధించేందుకు ప్రభుత్వానికి సంబంధించిన ఇతర విభాగాలతో కలసి కలసికట్టుగా కృషి చేయాలన్నారు.

   ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి మాట్లాడుతూ, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద జరిగిన పనులను ప్రధానంగా ప్రస్తావించారు. కోవిడ్ వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుత కష్ట సమయంలో ఈ పనుల ద్వారా గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించగలిగినట్టు మంత్రి చెప్పారు. మహమ్మారి వైరస్ నుంచి ప్రజలను రక్షించేందుకు వ్యాక్సినేషన్ కు ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత కాలంలో ప్రజల అవసరాలను తీర్చేందుకు క్రియాశీలంగా వ్యవహరించాలని, తద్వారా ప్రజల మనోస్థైర్యాన్ని పెంపొందించాలని మంత్రి సూచించారు.

   గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి నాగేంద్ర నాథ్ మాట్లాడుతూ, సామాజిక ఆడిట్ ప్రక్రియను, న్యాయ సంస్థల నియామకాన్ని, ఆస్తుల జియోట్యాగింగ్ ప్రక్రియను, పనుల పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాల్సిన అవరసం ఉందన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి అల్కా ఉపాధ్యాయ్, గ్రామీణ ఉపాధి శాఖ సంయుక్త కార్యదర్శి రోహిత్ కుమార్, నైపుణ్య వ్యవహారాల సంయుక్త కార్యదర్శి చరణ్ జిత్ సింగ్, సంయుక్త కార్యదర్శి, ఆర్థిక సలహాదారు డాక్టర్ సుపర్ణ ఎస్. పచౌరీవెరే కూడా యాప్.ల ఆవిష్కరణ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

 

***(Release ID: 1720834) Visitor Counter : 63


Read this release in: English , Urdu , Hindi , Punjabi