గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
కోవిడ్ 19 సెకండ్ వేవ్లో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సహాయంగా ఉండేందుకు రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్ సిబ్బందికి దీన్దయాళ్ అంత్యోదయ యోజన – జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ఆధ్వర్యంలో శిక్షణకోవిడ్ 19 సెకండ్ వేవ్లో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సహాయంగా ఉండేందుకు రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్ సిబ్బందికి దీన్దయాళ్ అంత్యోదయ యోజన – జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ఆధ్వర్యంలో శిక్షణ
రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్ భాగంగా రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయికి చెందిన 14000 మంది సిబ్బందికి రిసోర్స్ పర్సన్స్గా శిక్షణ ఇచ్చారు.
కోవిడ్ 19 లక్షణాలు, వ్యాక్సినేషన్, రోగనిరోధక శక్తి పెంచుకోవడం తదితర అంశాలపై ఈ శిక్షణ దృష్టిసారించింది.
మే 16 నాటికి సుమారు 2.5 కోట్ల మంది స్వయం సహాయక సంఘ సభ్యులు, కమ్యూనిటీ క్యాడర్లు, సీఆర్పీలు, సోషల్ యాక్షన్ కమిటీలు, సిఎల్‌ఎఫ్ ఆఫీస్ బేరర్‌లకు శిక్షణ ఇచ్చారు
Posted On:
20 MAY 2021 6:11PM by PIB Hyderabad
కోవిడ్ 19 కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ, దీన్దయాళ్ అంత్యోదయ యోజన – జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (DAY-NRLM) సంయుక్త ఆధ్వర్యంలో 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్ (SRLM) సిబ్బందికి ఆన్‌లైన్ శిక్షణలను ప్రారంభించింది. DAY-NRLM యొక్క నెట్‌వర్క్ క్రింద 69 లక్షలకు పైగా స్వయం సహాయక బృందాలకు శిక్షణ ఇచ్చేలా ఎస్‌ఆర్‌ఎల్‌ఎమ్ సిబ్బందిని సిద్ధం చేశారు. కోవిడ్ 19 లక్షణాలు, వ్యాక్సినేషన్, ఆరోగ్య సలహాలు, రోగనిరోధక శక్తిని పెంపొందించే అంశాలపైన శిక్షణ ఇచ్చారు. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో 2021 ఏప్రిల్ 9 వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ శిక్షణ కార్యక్రమాలను నిర్వహఙంచారు.. ఎస్‌ఆర్‌ఎల్‌ఎమ్‌లలోని రాష్ట్ర, జిల్లా మరియు బ్లాక్ల నుంచి దాదాపు 14,000 మంది సిబ్బందికి ఆన్‌లైన్లో రిసోర్స్ పర్సన్‌లుగా శిక్షణ ఇచ్చారు. 2021 మే 7వ తేదీ నుంచి 11 వ తేదీ వరకు మరో సెషన్ శిక్షణ కార్యక్రమం కూడా జరిగింది. ఇందులో తేలికపాటి లక్షణాలు, సంబంధిత సమస్యలను ఇంట్లోనే పరిష్కరించుకునే అంశంపై అవగాహన కల్పించారు. అట్టడుగు స్థాయి ప్రజలకు కూడా వ్యాధిపై అవగాహన కల్పించేలా, సమాచారాన్ని పంచుకునేలా రిసోర్స్ పర్సన్స్కు ఎస్ఆర్ఎల్ఎం సిబ్బంది శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కోవిషీల్డ్ మరియు కోవాగ్జిన్ వ్యాక్సిన్లను యాక్సెస్ చేయడం మరియు అవసరమైన ధృవీకరణ పొందడం గురించి ఈ సెషన్లలో ప్రధానంగా అవగాహన కల్పించారు. టీకా తీసుకునేవారిలో భయాలను పోగొట్టేందుకు.. టీకాల వల్ల కలిగే దుష్ప్రభావాలను కూడా శిక్షణ కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించారు. కోవిడ్ 19 నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యాప్తి చెందుతున్న రకరకాల పుకార్ల గురించి వివరించి, వాటిని పరిష్కరించడంపైనా అవగాహన కల్పించారు. స్వయం సహాయక సంఘం స్థాయి వరకు శిక్షణను నిర్వహించడానికి ప్రామాణికంగా అవసరమైన వనరులను రాష్ట్ర జట్లతో పంచుకుంటారు. 1621 మే 16 నాటికి సుమారు 2,47,09,348 స్వయం సహాయక సభ్యులు, 1,39,612 మంది కమ్యూనిటీ కేడర్లు, 1,20,552 సిఆర్‌పిలు, 11,833 సోషల్ యాక్షన్ కమిటీలు, 41,336 సిఎల్‌ఎఫ్ ఆఫీసు బేరర్‌లకు శిక్షణ ఇచ్చారు.
ఈ శిక్షణలో పాల్గొన్నవారు ఎదుర్కొన్న సవాళ్లను పంచుకునే అవకాశంకూడా ఉంది. అంతే కాకుండా ప్రయాణాలు, సమూహ సమావేశాల సందర్భంగా ఎదురైన అనుభవాలను ఒకరితో మరొకరు పంచుకోవచ్చు. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఎయిమ్స్ లో కోవిడ్ రోగుల మధ్య పనిచేసిన అనుభవజ్ఞులు ఝఝ్ఝర్ హరియాణతో ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా డబుల్ మాస్క్ ధరించడం, వ్యాక్సినేషన్, కోవిడ్ అనంతర జాగ్రత్తల గురించి సందేహాలను ఈ శిక్షణలో పాల్గొన్నవారు నివృత్తి చేసుకున్నారు.
పేదరిక నిర్మూలన కోసం దేశంలో అమలు చేస్తున్న ప్రధాన పథకంలాగే DAY-NRLM సిబ్బందికూడా నిరుపేద గృహిణులతో కలిసి పనిచేయడం తప్పనిసరి. ఎందుకంటే అనారోగ్యం వల్ల జీవనోపాధి కోల్పోవడం, ఫలితంగా ఎదురయ్యే ఆర్థిక కష్టాలను ఎదుర్కోవడానికి గ్రామీణ మహిళలు పరపతిని పొందగల సామాజిక రక్షణ పథకాలపై కూడా సిబ్బందికి ఈ శిక్షణ కార్యక్రమంలో అవగాహన కల్పించారు.
***
(Release ID: 1720766)
Visitor Counter : 245