వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
దక్షిణకొరియాకు మామిడి ఎగుమతులును మరింత పెంచేందుకు అమ్మకం దారులు కొనుగోలుదారులతో వర్చువల్ సమావేశం ఏర్పాటు చేసససిన ఎపిఇడిఎ భౌగోళిక గుర్తింపు(జిఐ)సర్టిఫికేట్ పొందిన 2.5 మెట్రిక్ టన్నుల మామిడి కన్‌సైన్‌మెంట్‌ను దక్షిణకొరియాకు పంపిన ఇండియా
Posted On:
21 MAY 2021 11:06AM by PIB Hyderabad
దక్షిణ కొరియాకు మామాడి ఎగుమతులు పెంచే చర్యలలో భాగంగా , ఎపిఇడి సంస్థ సియోల్‌లోని భారత ఎంబసీ , కోరియాలోని ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసిసికె) సహకారంతో వర్చువల్ విధానంలో అమ్మకం దారులు, కొనుగోలు దారుల సమావేశాన్ని (విబిఎస్ఎం) ఏర్పాటు చేసింది.
ఎపిఇడిఎ, భారతీయ ఎంబసీ అధికారులు, ఐసిసికె, భారతదేశ ఎగుమతిదారులు, దక్షిణ కొరియా దిగుమతిదారులు నిన్న జరిగన ఈ విబిఎస్ఎంలో పాల్గొన్నారు.
ప్రస్తుత కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఎగుమతుల ప్రోత్సాహక కార్యక్రమాన్ని భౌతికంగా ఏర్పాటు చేయడం సాధ్యం కాలేదు. దీనితో ఎపిఇడిఎ వర్చువల్ బిఎస్ఎం ను ఏర్పాటు చేయడంలో చోరవ తీసుకునింది. దీని ద్వారా భారత్‌నుంచి మామిడి ఎగుమతిదారులు, దక్షిణ కొరియా దిగుమతిదారులకు ఒక ప్లాట్ ఫాం కల్పించేందుకు ఎపిఇడిఎ చర్యలు తీసుకుంది.
ఇంతకు ముందు నెలలో . తొలిసారిగా ఈ సీజన్‌లో ఇండియా 2.5 మెట్రిక్ టన్నుల (ఎం.టి.ఎస్) జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జిఐ) గుర్తింపు పొందిన బనగానపల్లి, ఇతర రకాలైన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా , చిత్తూరు జిల్లాలనుంచి సేకరించిన సువర్ణ రేఖ మామిడిపండ్లను ఎగుమతి చేసింది.
దక్షిణకొరియాకు పంపిన మామిడిని శుభ్రం చేసి, ఎపిఇడిఎ వద్ద రిజిస్టర్ అయిన తిరుపతిలోని పాక్ హౌస్‌లు, వేపర్ హౌస్ ట్రీట్‌మెంట్ ఫెసిలిటీ నుంచి తరలించి ఐఫ్కో కిసాన్ సెజ్‌నుంచి ఎగుమతి చేయడం జరిగింది.
36 వేల సొసైటీల సభ్యత్వం కలిగిన బహుల రాష్ట్రాల సహకార సంస్థ ఇఫ్కోకు సబ్సిడరీ సంస్థగా ఉన్న ఐకెఎస్ఇజెడ్ ద్వారా ఈ తొలి కన్‌సైన్‌మెంట్ ఎగుమతి అయింది. ఈ సీజన్‌లో దక్షిణ కొరియాకు మరిన్ని ఎగుమతులు జరిగే అవకాశం ఉంది. ఇఫ్కో కిసాన్ ఎస్.ఇ.జెడ్ దక్షిణకొరియాలోన మీజెయిమ్‌తో ఈ సీజన్‌లో 66 మెట్రిక్ టన్నుల మామాడి సరఫరాకు ఒప్పందం కలిగి ఉంది. ఈ కృషిలో ఆంధ్రప్రదేశ్ హార్టీకల్చర్ విభాగం పాలుపంచుకుంది.
దక్షిణకొరియాకు ఎగుమతి చేసే మామిడిపండ్లను తిరుపతిలోని ఎపి ఆగ్రోస్ ఇంటిగ్రేటెడ్ పాక్ హౌస్, విహెచ్‌టి సిస్టమ్ ప్రాసెస్ చేస్తుంది. ఇది ఎపిఇడిఎ చే ఆర్థికంగా సహాయం అందుకున్న సంస్థ.ఈ ప్రాంతం నుంచి తాజా పండ్లు, కూరగాయలను ఎగుమతి చేసేందుకు ఏర్పాటైన ఫెసిలిటీ ఇది.
ఈ ప్యాక్ హౌస్‌నుంచి సుమారు 400 మెట్రిక్ టన్నుల తాజా పండ్లు , కూరగాయలు ఎగుమతి అయ్యాయి. యూరోపియన్ యూనియన్, నాన్ యూరోపియన్ యూనియన్ దేశాలకు హార్టీకల్చర్ ఉత్పత్తులను దక్షిణాదిరాష్ట్రాల నుంచి ఎగుమతికి ఇది ఉపయోగపడుతోంది. ప్రస్తుత సీజన్‌లో 30 మెట్రిక్ టన్నుల మామిడి ని యూరోపియన్ యూనియన్, బ్రిటన్, ఐర్లండ్, మధ్యప్రాచ్చ దేశాలకు ఎగుమతి చేసింది.
మామిడిని ఇండియాలో పండ్లలో రారాజుగా పిలుస్తారు. అలాగే పురాణాలలో మామిడిని కల్పవృక్షంగా అభివర్ణించారు. ఇండియాలో చాలా రాష్ట్రాలలో మామిడిని పండిస్తారు. ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాన, కర్ణాటక రాష్ట్రాలు దేశమామిడి ఉత్పత్తిలో ఎక్కువ భాగం కలిగి ఉన్నాయి.
ఆల్ఫోన్సా, కేసర్, తోతాపురి, బనగానపల్లి మామిడి రకాలు ఇండియా నుంచి ఎగుమతి అయ్యే ముఖ్యమైన మామిడి రకాలు. మామిడి ఎగుమతులు ప్రధానంగా మూడు రూపాలలో జరుగుతాయి. అవి తాజా మామిడి, మామిడి పల్ప్, మామిడి స్లయిస్.
మామిడిపండ్లను ఎపిఇడిఎ వద్ద రిజిస్టర్ అయిన ప్యాక్ హహౌస్ కేంద్రాలలో ప్రాసెస్ చేస్తారు. అనంతరం వీటిని మధ్యప్రాచ్యం, యూరోపియన్ యూనియన్, అమెరికా, జపాన్ , దక్షిణ కొరియా దేశాలకు, వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు.
****
(Release ID: 1720700)
Visitor Counter : 254