రక్షణ మంత్రిత్వ శాఖ
కోవిడ్ 19 యాంటీబాడీ గుర్తింపు కిట్‌ను అభివృద్ధి చేసిన డిఆర్‌డిఒ
Posted On:
21 MAY 2021 3:56PM by PIB Hyderabad
సెరో-సర్వియలెన్స్ (వాక్సినేషన్ లేదా వ్యాధి వచ్చిన తర్వాత దానికి వ్యతిరేకంగా ఉన్న యాంటీ బాడీలను కొలిచే పద్ధతి) కోసం డిపాస్ -విడిఎక్స్ కోవిడ్ -19 జిజి యాంటీబాడీ మైక్రోవెల్ ఎలిసా అయిన యాంటీబాడీలను గుర్తించే డిప్కోవాన్ కిట్‌ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఒ)కు చెందిన ప్రయోగశాల అయిన డిఫెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలీడ్ సైన్సెస్ (డిఐపిఎఎస్) అభివృద్ధి చేసింది.
డిప్కోవాన్ కిట్ సార్స్ -సిఒవి-2 వైరస్ లోని న్యూక్లియోకాప్సిడ్ (ఎస్&ఎన్) ప్రోటీన్లను, అలాగే దాని పెరుగుదలను 97శాతం సున్నితత్వం, 99శాతం నిర్ధిష్టతతో గుర్తించగలదు. ఈ కిట్‌ను న్యూఢిల్లీకి చెందిన డయాగ్నాస్టిక్స్ అభివృద్ధి, ఉత్పత్తి చేసే కంపెనీ అయిన వాన్‌గార్డ్ డయాగ్నాస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్సహకారంతో అభివృద్ధి చేశారు.
డిప్కోవాన్ కిట్‌ను శాస్త్రవేత్తలు దేశీయంగా అభివృద్ధి చేశారు. అనంతరం ఢిల్లీలోని పలు కోవిడ్ డెసిగ్నేటెడ్ ఆసుపత్రులలో 1000మంది రోగులకుపైగా శాంపుళ్ళను విస్త్రతంగా ధృవీకరించిన తర్వాత దీనిని ఆవిష్కరించారు. గత ఒక్క సంవత్సరంలోనే ఈఉత్పత్తికి సంబంధించిన మూడు బ్యాచ్‌లను ధృవీకరించారు. యాంటీబాడీలను గుర్తించే ఈ కిట్‌ను ఏప్రిల్ 2021లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ఆమోదించింది.
ఈ ఉత్పత్తిని అమ్మకాల కోసం, పంపిణీ కోసం ఉత్పత్తి చేయడానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండి (డిసిజిఐ),సెంట్రల్ డ్రగ్స్ అండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్‌సిఒ), ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి త్వ శాఖ నియంత్రణా ఆమోదాన్ని మే 2021లో తెలిపింది.
సార్స్ -సిఒవి-2 సంబంధిత యాంటీజెన్లను లక్ష్యం చేసుకొని మానవ సీరం లేదా ప్లాస్మాలోని ఐజిజి (IgG) యాంటీబాడీలను గుణాత్మకంగా గుర్తించేందుకు ఉద్దేశించినదే డిప్కోవాన్. ఇతర వ్యాధులతో క్రాస్ రియాక్టివిటీ లేకుండా ఈ పరీక్షను నిర్వహించేందుకు కేవలం 75 నిమిషాలు అవసరం కనుక మొత్తం పరీక్ష వేగంగా జరిపే అవకాశాన్ని ఇస్తుంది. ఈ కిట్ ప్రభావం 18 నెలలు ఉంటుంది.
పరిశ్రమ భాగస్వామి వాన్‌గార్డ్ డయాగ్నిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఉత్పత్తిని జూన్ 2021 తొలి వారంలో వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించనుంది. ప్రారంభ సమయంలో అందుబాటులో 100 కిట్లు (సుమారు 1,000 పరీక్షలు) అందుబాటులో ఉంటాయి. ప్రారంభబించిన తర్వాత నెలకు 500 కిట్ల ఉత్పత్తి సామర్ధ్యం ఉంది. ఒక్కో పరీక్ష రూ. 75లో అందుబాటులో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
కోవిడ్ -19 ఎపిడెమియాలజీ (సాంక్రమిక్ రోగ విజ్ఞానం)ను అర్థం చేసుకునేందుకు, వ్యక్తి గతంలో సార్స్ -సిఒవి-2 కు ఎంతవరకు గురయ్యారనే విషయాన్ని అంచనా వేయడానికి ఈ కిట్ ఎంతో ఉపయోగపడుతుంది.
అవసరకాలంలో ఈ కిట్‌ను అభివృద్ధి చేసేందుకు డిఆర్‌డిఒ, పరిశ్రమల కృషిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు.
ఈ కిట్‌ను అభివృద్ధి చేయడంలో పాలు పంచుకున్న బృందాలను రక్షణ శాఖ ఆర్&డి కార్యదర్శి, డిఆర్‌డిఒ చైర్మన్ జి.సతీష్ రెడ్డి అభినందిస్తూ, ఈ చొరవ మహమ్మారి కాలంలో ప్రజలకు ఎంతో తోడ్పడుతుందన్నారు.
(Release ID: 1720677)
Visitor Counter : 288