ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కామన్వెల్త్ దేశాల ఆరోగ్య మంత్రుల 3వ సదస్సుకు డాక్టర్ హర్షవర్ధన్ అధ్యక్షత

’అందరికీ టీకాల అందుబాటు, ఆరోగ్య వ్యవస్థల పునరుద్ధరణ’ ఎజెండాగా సమావేశం

సంపద లేనివారికి ఆరోగ్యం అన్నదే నా లక్ష్యం: హర్షవర్ధన్
సంక్షోభంలో భారత్ సాయం చేయగలిగేతీరు వెల్లడి
ప్రపంచ ఆరోగ్య వ్యవస్థల్లో పారదర్శకతకు పిలుపు

Posted On: 20 MAY 2021 5:22PM by PIB Hyderabad

కామన్వెల్త్ దేశాల ఆరోగ్య మంత్రుల 33వ సదస్సుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అధ్యక్షత వహించారు. “ కోవిడ్-19 కు కామన్వెల్త్ స్పందన: అందరికీ టీకాల అందుబాటు, ఆరోగ్య వ్యవస్థల పునరుద్ధరణ” అంశంగా ఈ రోజు జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001WYZA.jpg https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002B2A8.jpg

కరోనా సంక్షోభం కారణంగా జరిగిన దారుణమైన నష్టం గురిమ్చి ప్రస్తావిస్తూ, ఆర్థికంగా జరిగిన నష్టం వందల బిలియన్ డాలర్లలో ఉండటం వలన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుంచించుకుపొయిందన్నారు. కోలుకోవటం చాలా కష్టమే అయినప్పటికీ, యావత్ ప్రపంచం ఈ మహమ్మారిని పూర్తిగా మటుమాయం చేసిన తరువాత మాత్రమే అది సాధ్యమవుతుందన్నారు. ఏదైనా ఒక ప్రాంతంలొ ముప్పు ఉన్నదంటే కచ్చితంగా అది ప్రపంచమంతటా వ్యాపిస్తుందని గుర్తించాలని కోరారు. అలాంటప్పుడు ఏ ఒక్క దేశమూ సురక్షితంగా ఉండజాలదన్నారు. కోవిడ్ కారణంగా చనిపోయినవారి కుటుంబాలన్నిటికీ ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

 కోవిడ్-19 మీద పోరాటానికి ప్రపంచం అనుసరించే వ్యూహం పట్ల భారత వైఖరిని ఈ సందర్భంగా డాక్టర్ హర్షవర్ధన్ వివరించారు. తొలిదశలోనే పరీక్షలు  జరిపి నిర్థారించటం, ఐసొలేషన్ లో ఉంచటం, చికిత్స అందించటంతోబాటు విస్తృతంగా టీకాలు వేయటం అనేది భారతదేశ వ్యూహమన్నారు.  అయితే, కోవిడ్ మహమ్మారిని సమర్థంగా అణచివేయటానికి టీకాలు ఒక్కటే మార్గం గనుక టీకా మందు తయారీ ప్రపంచవ్యాప్తంగా వేగం పుంజుకోవాలని కోరారు. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన చర్యలు ఆశాజనకంగా ఉన్నాయని, దీనివలన అందరికీ కోవిడ్ పరీక్షలు, చికిత్స, టీకాలు అందుబాటులోకి వస్తాయన్నారు.

అత్యంత ప్రధానమైన కొవాక్స్ ప్రధానంగా 2021 ఆఖరుకల్లా 200 కోట్ల డోసులు అందించటం లక్ష్యంగా పెట్టుకుందని గుర్తు చేస్తూ  దీనివలన 92 దేశాలలోని అల్పాదాయ వర్గాల ప్రజల్లో 20% మందికి టీకాలు అందుతాయన్నారు.   అయితే ఇది మాత్రమే చాలదన్నది భారతదేశ నిశ్చితాభిప్రాయమన్నారు.  దీనికి తోడు అన్ని బహుముఖ, ద్విముఖ వేదికలు కూడా సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని డాక్టర్ హర్ష వర్ధన్ అభిప్రాయపడ్డారు. అప్పుడే టీకాలు అందరికీ అందుబాటులోకి వస్తాయని, ధర కూడా పారదర్శకంగా, అందుబాటులో ఉంటుందని అన్నారు.

భారతదేశం ఎంతో కాలంగా నమ్మే వసుధైవ కుటుంబకమ్ భావన గురించి మంత్రి మాట్లాడారు. యావత్ ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా భావించాలనే ఈ భావనే భారత అభిప్రాయానికి అద్దం పడుతుందన్నారు.  భారతదేశం తన టీకా మైత్రి చొరవలో భాగంగా 90 దేశాలకు పైగా టీకాలు అందించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. భాగస్వాములతో కలిసి మరింత కృషి చేయటానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా వెల్లడించారు.

భారతదేశం ఈ మహమ్మారి అంతానికి ఎలా సాయం చేస్తున్నదో డాక్టర్ హర్షవర్ధన్ ఈ సందర్భంగా చెప్పారు. టీకా మందులకు తోడుగా కోల్డ్ చెయిన్ సదుపాయాలు, నైపుణ్యం గల మానవవనరులు, అత్యాధునిక ఐటి మౌలిక వసతులు కూడా సిద్ధంగా ఉంచటం ద్వారా వేగంగా స్పందించగలిగే ఏర్పాటు చేశామన్నారు. అదే విధంగా సామ్కేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవటం, వనరులు పంచుకొవటం, మరీ ముఖ్యంగా చిన్న, వెనుకబడిన రాష్టాలకు అండగా నిలబడటం లాంటి చర్యలద్వారా ఈ అమ్తర్జాతీయ ముప్పును ఎదుర్కోవటానికి కృషి చేస్తున్నామన్నారు.

అనేక సభ్య దేశాలు కూడా అత్యవసర వైద్యసేవలు అందించటానికి తడుముకుంటున్న సమయంలో  భారత దేశం టెలీమెడిసిన్ మీద ఆధారపడి విజయం సాధించటం ద్వారా మార్గదర్శిగా మారిందన్నారు. టీక్నాలజీ వాడుకోవటం ద్వారా భారతదేసం అలాంటి ఎన్నో అవరోధాలను సులభంగా అధిగమించిందన్నారు. “ మా జాతీయ టెలీమెడిసిన్ వేదిక ఈ-సంజీవని  ఔట్ పేషెంట్ విభాగం ఎంతో అద్భుతమైన ఫలితాలనిచ్చిందనటానికి నిదర్శనం  కేవలం 14 నెలల కాలంలో 50 లక్షల సంప్రదింపులు జరిరగటమే” అన్నారు. . “ ఎయిడ్స్, క్షయ లాంటి వ్యాధుల నియంత్రణకు కూడా ఎన్నో ఆలోచనాత్మకమైన విధానాలు ఆచరణలో పెట్టామని మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈ సందర్భంగా  గుర్తు చేశారు.  దీనివలన గత సంక్షోభ సమయంలో ఆ సమస్యల తాకిడిని తట్టుకోగలిగామన్నారు. 

ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలు మళ్లీ పుంజుకోవటమే కాకుండా పారదర్శకంగా కూడా ఉండాలన్నదే భారతదేశ అభిమతమన్నారు. ప్రపంచం అత్యంత సన్నిహితంగా అల్లుకుపోయి ఉన్న తరుణంలో ఒక ప్రాంతంలో ఏర్పడిన ముప్పు ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా అతి తక్కువ సమయంలో అందరికీ ముప్పుగా మారే ప్రమాదమున్నదని హెచ్చరించారు.  అందువలన ఒక చురుకైన అంతర్జాతీయ స్పందన వ్యవస్థను నిర్మించుకోవటం వలన ఆరోగ్యరంగంలో ముప్పును  ఎదుర్కోగలలిగేలా సిద్ధంగా ఉంటుందని అభిప్రాయ పడ్డారు. అప్పుడే భవిష్యత్ సవాళ్లను సమర్థంగా ఎదుర్కుంటామన్నారు.

కామన్వెల్త్ దేశాల ఆరోగ్య మంత్రులు 2020 లో కూడా మొదటి సారిగా ఇలాగే వర్చువల్ సమావేశంలో   పాల్గొన్న సంగతి ఆయన గుర్తు చేశారు.  అప్పుడే ఇలాంటి సంక్షోభాలకు స్పందించాల్సిన తీరుతెన్నులను నిర్వచించుకోగలిగామన్నారు.  అందులో భాగంగానే ఒక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటైందని  మందులు, టీకాలు తదితర అంశాలమీద వచ్చే రెండు రోజుల సమావేశాలు చర్చించుకోవాలని సూచించారు.  ఆయన తన ప్రసంగాన్ని ముగిస్తూ, కామన్వెల్త్ దేశాలు కేవలం కోవిడ్ నిర్వహణమీదనే దృష్టి సారించకుండా అంతకు ముందు కామన్వెల్త్ చేపట్టిన ప్రాధాన్యాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు.   

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003K00K.jpg

కామన్వెల్త్ సెక్రెటరీ జనరల్ పాట్రీషియా స్కాట్లాండ్,  ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడోస్ అధనమ్  ఘెబ్రియేసస్, సభ్య దేశాల ఆరోగ్య మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. డాక్టర్ హర్ష వర్ధన్ తోబాటు ఆరోగ్య మంత్రిత్వశాఖకు చెందిన పలువురు సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  

 

****



(Release ID: 1720418) Visitor Counter : 135