భారత పోటీ ప్రోత్సాహక సంఘం

వర్చువల్ మోడ్ ద్వారా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా 12 వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్

Posted On: 20 MAY 2021 6:07PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు ఇక్కడ  కాంపిటీషన్ కమిషన్ (సిసిఐ) 12 వ వార్షిక దినోత్సవంలో పాల్గొన్నారు. కాంపిటీషన్ చట్టం, 2002 కింద సీసీఐని మే 20, 2009 న స్థాపించారు. పోటీ వ్యతిరేక ప్రవర్తనకు సంబంధించిన ముఖ్యమైన నిబంధనలు అమల్లోకి వచ్చిన రోజు ఇది. 

 

ముఖ్య అతిథిగా ఆహ్వానితులను ఉద్దేశించి ఆర్థిక మంత్రి శ్రీమతి సీతారామన్ ప్రసంగించారు. వేగంగా మారుతున్న భారతీయ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మార్కెట్-స్నేహపూర్వక,ముందస్తు విధానాన్ని కలిగి ఉండటానికి పోటీ వ్యవస్థ నిరంతరం పరిశీలన చేయాల్సిన ఆవశ్యకతను  వివరించారు. శ్రీమతి సీతారామన్ విశ్వసనీయ-ఆధారిత వ్యవస్థ ఉండడానికి సీసీఐ ప్రాధాన్యతను గుర్తిస్తూ అభినందించారు. భారతదేశం వంటి ఆర్థిక వ్యవస్థలలో ఇది చాలా ముఖ్యమైనది, ఇవి ఇప్పటికీ స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక వ్యవస్థకు మారుతున్నాయి అని ఆమె అన్నారు. 

మహమ్మారి తరువాతి పునరుజ్జీవన సవాళ్లను ప్రస్తావిస్తూ, ఆర్థిక మంత్రి సిసిఐ పరిశ్రమతో చురుకుగా పాల్గొనవలసిన అవసరాన్ని నొక్కిచెప్పారు, తద్వారా వారి చట్టబద్ధమైన వాదనలు ఓపికగా వినిపించేలా చూసుకోవాలి, తెలిసి లేదా తెలియకుండా, విస్మరించడం ద్వారా లేదా కమిషన్ ద్వారా మార్కెట్ ప్రక్రియలు వేగాన్ని నిరోధించలేము. నిజమైన మార్కెట్ పద్ధతులు వృద్ధి చెందడానికి అవసరమైన వేగం, స్థాయి మరియు దూరదృష్టితో అభివృద్ధి చెందాలని ఆర్థిక మంత్రి కమిషన్‌ను కోరారు.

ఈ కార్యక్రమ ప్రారంభ సమావేశంలో న్యాయవ్యవస్థ, బ్యూరోక్రసీ, రెగ్యులేటరీ అధికారులు, ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, పరిశ్రమల నాయకులు, విద్యావేత్తలు, నిపుణులు ఆహ్వానితులను ఉద్దేశించి ఆర్థిక మంత్రి ఈ ప్రసంగం చేశారు. 

ఈ సందర్భంగా శ్రీమతి సీతారామన్ ‘సిసిఐ జర్నల్ ఆన్ కాంపిటీషన్ లా అండ్ పాలసీ’ మరియు సిసిఐ కాంపిటీషన్ అడ్వకేసీ పుస్తకాలను ఆవిష్కరించారు. వీటిని బెంగాలీ, మరాఠీ మరియు తమిళ భాషల్లోకి కూడా అనువదించారు. 

గౌరవ అతిథిగా పాల్గొన్న ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ మారుతున్న మార్కెట్ డైనమిక్స్‌కు ప్రతిస్పందనగా కమిషన్ అతి చురుకైనదిగా అభివృద్ధి చెందాలని కోరారు. సిసిఐ ముందుకు వెళుతున్నప్పుడు, మార్కెట్ లోపాలను ముందుగానే కనుగొనడంలో ఎక్కువ సమయం, వనరులను కేటాయించాలని  ఆయన అన్నారు. .

 కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ వర్మ మాట్లాడుతూ, మార్కెట్లలో పోటీ సంస్కృతిని నిర్మించడానికి సిసిఐ ఎంతో కృషి చేసిందని, ప్రజా సేకరణ విషయంలో సిసిఐ  కార్యక్రమాలను అభినందించారు. 

సీసీఐ ఛైర్పర్సన్ శ్రీ అశోక్ కుమార్ గుప్త కూడా ఈ సందర్బంగా ప్రసంగించారు. 

సీసీఐ కార్యదర్శి శ్రీ ఎస్. ఘోష్ దస్తీదార్ వందన సమర్పణ చేశారు. 

 

****



(Release ID: 1720412) Visitor Counter : 230