రైల్వే మంత్రిత్వ శాఖ

కోవిడ్ సవాళ్ల నేప‌థ్యంలోనూ పూర్తి స‌వాళ్ల‌తో కూడిన‌ కోల్‌కతాలోని 800 మీటర్ల టన్నెల్ డ్రైవ్‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన రైల్వే


- నిన్న కోల్‌కతాలోని బౌబజార్‌ మార్గంలోని ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్‌లో ఉర్వి టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం) ద్వారా టన్నెలింగ్ పనులు పూర్తి

- దీంతో ఈస్ట్ వెస్ట్ మెట్రో ప్రాజెక్ట్‌లో మొత్తం టీబీఎం టన్నెలింగ్ ప‌నులు పూర్తి

- శతాబ్దం పైబ‌డిన‌ భవనాలు ఉన్నందున ఈ సొరంగం పనులు చేప‌ట్ట‌డం చాలా కష్టత‌ర‌మైంది

Posted On: 16 MAY 2021 1:59PM by PIB Hyderabad

కోల్‌కతాలోని బౌబజార్‌ మార్గంలోని ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్‌లోని ఉర్వి  టన్నెల్ బోరింగ్ మెషిన్‌తో (టీబీఎం) టన్నెలింగ్ పనులు నిన్న‌టితో (15.05.2021) పూర్త‌య్యాయి. దీంతో కోల్‌క‌తా ఈస్ట్‌-వెస్ట్ మెట్రో ప్రాజెక్ట్‌లోని మొత్తం టీబీఎం ట‌న్నెలింగ్ ప‌నులు పూర్త‌యిన‌ట్ట‌యింది. శతాబ్దం పైబ‌డిన‌ భవనాలు ఉన్నందున ఈ సొరంగం పనులు చేప‌ట్ట‌డం చాలా కష్టత‌రంగా మారింది. కోవిడ్‌-19 ప్రోటోకాల్‌ అనుసరించి కోవిడ్ మహమ్మారి విజృభిస్తున్న ప్ర‌స్తుత పరిస్థితుల‌లో 800 మీటర్ల టన్నెల్ డ్రైవ్ విజయవంతంగా పూర్తి చేయ‌డం విశేషం. స‌వాళ్ల‌తో కూడుకున్న ఈ స‌మ‌యంలో సోరంగం పనుల్ని విజ‌య‌వంతంగా పూర్తి చేయ‌డం విశేషం. ఇంతకుముందు గ‌త ఏడాది 09.10.2020న ఎస్ప్లానేడ్ నుండి సీల్దా వరకు ఈస్ట్ బౌండ్ సొరంగం పూర్తి చేసిన టన్నెల్ బోరింగ్ మెషిన్.. 09.01.2021న అవసరమైన పునర్నిర్మాణ మరియు తనిఖీలు చేప‌ట్టిన‌ తరువాత సీల్దా నుండి వెస్ట్ బౌండ్ టన్నెల్‌లో మిగిలిన 800 మీటర్ల సొరంగ పనుల్ని పూర్తి చేయడానికి  తిరిగి చ‌ర్య‌ల‌ను ప్రారంభించింది. బౌబజార్ వద్ద రిట్రీవల్ షాఫ్ట్ టన్నెల్ బోరింగ్ మెషిన్ నిన్న (15.05.2021) సొరంగ చేధ‌న‌ను సాధించింది. ఈ టీబీఎమ్ [ఉర్వి] సీల్దా ఫ్లైఓవర్ కింద నుంచి  కూడా వెళ్ళింది, దీనికోసం ఫ్లై ఓవర్లో వాహనాల కదలిక భద్రతా కారణాలతో 3 రోజుల పాటు మూసివేయబడింది. ఈ టీబీఎం డ్రైవ్ పూర్తయిన తరువాత టన్నెల్ బోరింగ్ మెషిన్ ‘ఉర్వి’ తో పాటు నిలిచిపోయిన ఇతర టీబీఎం ‘చండి’ బౌబజార్‌లోని రిట్రీవల్ షాఫ్ట్ నుండి తిరిగి తీసుకొనబడుతుంది. షాఫ్ట్ యొక్క నీటి బిగుతు మరియు టీబీఎంల‌ యొక్క ప్రభావిత సొరంగం మరియు మెషిన్‌ను తిరిగి పొందడాన్ని నిర్ధారించిన తరువాత షాఫ్ట్ యొక్క తవ్వకంలో క్లిష్టమైన కార్యకలాపాలు, ఇత‌ర ప‌నుల‌ను చాలా సురక్షితంగా చేయవలసి ఉంటుంది. అందువల్ల దీనికి సమయం పడుతుంది. మొత్తంగా తవ్వకం పూర్తయిన తరువాత రెండు టీబీఎంల‌ను షాఫ్ట్ నుండి ముక్కలుగా వేరు చేయ‌బ‌డుతాయి. షాఫ్ట్ ప్రాంతానికి ఆర్‌సీసీ ఫ్లోరింగ్ మరియు రూఫింగ్  తర్వాత ప‌నులు పూర్తచేయాల్సి ఉంటుంది. భూగర్భ నిర్మాణానికి భూమిని సిద్ధం చేయడానికి షాఫ్ట్ టాప్ బ్యాక్‌ఫిల్ చేయబడుతుంది.  
                               

****



(Release ID: 1719130) Visitor Counter : 125