శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ల్యాబ్ వసతులు లేని ప్రాంతాల్లో కోవిడ్–-19 ముందస్తు నిర్ధారణ కోసం డీఎస్టీ మద్దతు ఉన్న ఒక స్టార్టప్ చౌకధర టెస్ట్ కిట్లను తయారు చేసింది.
Posted On:
15 MAY 2021 4:48PM by PIB Hyderabad
ముంబైకి చెందిన స్టార్టప్ రాపిడ్ యాంటిజెన్ టెస్టులను అత్యంత చవకగా చేస్తోంది. ప్రతి పరీక్షకు కేవలం 100 రూపాయల చొప్పున తీసుకొని, టెస్టు రిపోర్టు ఇస్తోంది. పతంజలి ఫార్మా అభివృద్ధి చేసిన ఈ పరీక్ష గోల్డ్ స్టాండర్డ్ ఆర్టిపిసిఆర్ & రాపిడ్ యాంటిజెన్ పరీక్షలకు సమానం. ఇప్పుడు మార్కెట్లో లభించే అత్యంత చవకైన టెస్ట్ కిట్లలో ఇదీ ఒకటి. డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ) ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ ఆగుమెంటింగ్ వార్ విత్ కోవిడ్ హెల్త్ క్రైసిస్ (కవచ్) మద్దతు ద్వారా ఈ స్టార్టప్ ర్యాపిడ్ కోవిడ్–19 డయాగ్నిస్టిక్సును (కోవిడ్ -19 ముందస్తు రోగ నిర్ధారణ కోసం రాపిడ్ యాంటీబాడీ ,యాంటిజెన్ పరీక్షలు) కనిపెట్టింది. పతంజలి ఫార్మా డైరెక్టర్ డాక్టర్ వినయ్ సైనీ, బొంబాయి ఐఐటి లోని సైనేలో స్టార్టప్‌ను ఇంక్యుబేట్ చేశారు. 8-9 నెలల్లో ఆర్ అండ్ డి ల్యాబ్‌తో పాటు ఉత్పత్తులను అభివృద్ధి చేశారు. అవసరమైన లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వివిధ కోవిడ్ సెంటర్లలోని ఉత్పత్తుల సామర్థ్యాన్ని పరీక్షించి మరింత మెరుగుపరిచారు.
"కోవిడ్–19 రోగులపై మా ఉత్పత్తులను పరీక్షించడం అద్భుతంగా ఉంది. వారి నాసోఫారింజియల్ స్వాబ్స్ కలిగిన వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియం (విటిఎం) నమూనాలనూ తనిఖీ చేశాం. ముంబైలోని వివిధ కోవిడ్ సైట్లలో అభివృద్ధి చెందిన ఉత్పత్తులపై బహుళ మూల్యాంకనాల ద్వారా మేం వారి నమ్మకాన్ని సంపాదించాం ”అని డాక్టర్ వినయ్ సైనీ చెప్పారు. ఈ స్టార్టప్ 2021 జూన్ ప్రారంభంలో ర్యాపిడ్ కోవిడ్ -19 యాంటిజెన్ పరీక్షలను ప్రారంభించాలని యోచిస్తోంది. ల్యాబులు ఎక్కువగాఉండని గ్రామీణ ప్రాంతాల్లో, క్లినిక్‌లలో కోవిడ్ -19 ముందస్తు రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తారు. 15 నిమిషాల్లోపే పరీక్ష పూర్తవుతుంది. మహమ్మారిని నియంత్రించడానికి ఈ పరీక్షలు ఎంతో సహాయపడుతాయి. ప్రస్తుతం, ఈ స్టార్టప్ రాపిడ్ కోవిడ్ -19 యాంటీబాడీ పరీక్షలపై పనిచేస్తోంది. ఇందుకోసం డిఎస్టీ సీడ్ గ్రాంట్ & బ్రిక్స్ దేశాల కోవిడ్ 19 ఇగ్నిషన్ గ్రాంట్ నిధులను ఉపయోగించుకుంటోంది. ఇగ్నిషన్ గ్రాంటును- ఇండో యుఎస్ ప్రాజెక్ట్ ద్వారా ఐయుఎస్టిఎఫ్ కింద యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడా అందజేసింది.
మరిన్ని వివరాలకు పతంజలి ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ (www.patanjalipharma.com, 91- 9987253095) డైరెక్టర్ డాక్టర్ వినయ్ సైనిని సంప్రదించవచ్చు.
(Release ID: 1718924)
Visitor Counter : 236