జల శక్తి మంత్రిత్వ శాఖ

నీటి నాణ్యత పర్యవేక్షణ, నీటి నిఘా కార్యకలాపాల నిర్వ‌హ‌ణ‌కు గాను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు అడ్వైజ‌రీ జారీ


- నామమాత్రపు రేటుతో ప్రజలు తెచ్చే నీటి నమూనాలను పరీక్షించడానికి అన్ని ప్రయోగశాలలు తెరిచి ఉంచుతారు

Posted On: 15 MAY 2021 4:03PM by PIB Hyderabad

దేశం వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రతి గృహ‌ స‌ముదాయం, ప్రభుత్వ రంగ సంస్థలకు అందించే తాగునీటికి సంబంధించి.. నాణ్యత పర్యవేక్షణ & నిఘా (డబ్ల్యుక్యూఎం&ఎస్) కార్యకలాపాలను చేపట్టాలని జాతీయ జల్ జీవన్ మిషన్ (ఎన్‌జేజేఎం) రాష్ట్రాలు/ కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు సూచించింది. ఇందుకు సంబంధించి ఎన్‌జేజేఎం ఒక అడ్వైజ‌రీని జారీ చేసింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ప‌లు నివారణ చర్యలతో పాటుగా ప్రజారోగ్యానికి సంబంధించి వ‌స్తున్న‌ విమర్శలు బాగా అర్థం చేసుకోబడ్డాయ‌ని తెలిపింది. ఇందులో భాగంగా సురక్షిత తాగునీరు, పారిశుధ్యం, పరిశుభ్రత మెరుగైన ప్రజారోగ్యానికి గాను ముందస్తుగా అవసరమ‌ని గుర్తించ‌డ‌మైందద‌ని పేర్కొంది. నీటి నాణ్యత పరీక్షలు మరియు సకాలంలో స‌మ‌స్య‌ల పరిష్కార చర్యలతో నీటి ద్వారా వచ్చే అనేక వ్యాధులను నివారించవచ్చు. నీటి నాణ్యత పర్యవేక్షణ, నీటి నిఘా ప్రజలను, ముఖ్యంగా పిల్లలను అనారోగ్యానికి గురికాకుండా కాపాడటమే కాకుండా విలువైన ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతుందని అడ్వైజ‌రీ సూచించింది. ఈ దిశ‌గా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఈ అడ్వైజ‌రీ కోరింది. దేశంలో రాష్ట్రాలు/ కేంద్ర‌పాలిత ప్రాంతాల భాగస్వామ్యంతో అమలు చేయబడుతున్న జల్ జీవన్ మిషన్, 2024 నాటికి ప్రతి గ్రామీణ గృహానికి ర‌క్షిత పంపు నీటి సరఫరాను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
2 శాతం నిధులు  నీటి నాణ్యత పర్యవేక్షణకు..
జ‌ల్‌జీవ‌న్ మిష‌న్ కింద మొత్తం నిధుల కేటాయింపులో 2 శాతం మేర నిధుల‌ను తాగు నీటి నాణ్యత పర్యవేక్షణ, నిఘా కార్యకలాపాలపై ఉపయోగించబడుతుంది. ఇది ప్రధానంగా ప్రయోగశాలల్లో పరీక్షల‌ ద్వారా నీటి నాణ్యత పర్యవేక్షణను కలిగి ఉంటుంది. తాగునీరు ఫీల్డ్ టెస్ట్ కిట్లు (ఎఫ్‌టీకే లు) ఉపయోగించి స్థానిక నీటి వనరులను పరీక్షించడం ద్వారా స్థానిక సమాజం ద్వారానే తాగా నీటి నాణ్యత పర్యవేక్షణను కలిగి ఉంటుంది.
కాలానుగుణంగా నీటి ప‌రీక్ష‌లు..
ప్ర‌జ‌లు వాడుతున్న అన్నిర‌కాల తాగునీటి వనరులను సంవత్సరానికి ఒకసారి రసాయన కాలుష్య ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకొనేందుకు, సంవత్సరానికి రెండుసార్లు బాక్టీరియా పారామితులను తెలుసుకోవ‌డం కోసం (రుతుపవనాల రాక‌ ముందు మరియు తరువాత) పరీక్షించాలి. ప్రయోగశాలల ఏర్పాటు, దాని ఆధునికీక‌ర‌ణ‌, మానవ వనరులను నియమించడం, ఎఫ్‌టీకేలు / కుండలు, పరికరాలు / ప‌రీక్ష‌కు కావాల్సిన గాజు సామానుల‌ సేకరించడం, శిక్షణ / సామర్థ్యం పెంపొందించడం, ఐఈసీ కార్యకలాపాలను తక్షణ ప్రాతిపదికన నిర్వహించడం కోసం ఈ నిధిని ఉపయోగించాలని కూడా ఉద్ఘాటించారు.
స్థానిక సమాజం నుండి ఐదుగురికి శిక్షణ..
నీటి నాణ్యతా నిఘాపై స్థానిక సమాజాన్ని మ‌రింత శక్తివంతము చేసే ఉద్దేశ్యంతో, ప్రతి గ్రామంలో 5 మంది వ్యక్తులను, ముఖ్యంగా మహిళలను స్థానిక సమాజం నుండి గుర్తించి శిక్షణ ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించారు. ఆశా కార్మికులు, ఆరోగ్య కార్యకర్తలు, వీడబ్ల్యుఎస్‌సీ / ఉపాధ్యాయులు, ఎస్‌హెచ్‌జీ సభ్యులు, పాని సమితి సభ్యులు మొదలైనవారు గ్రామ స్థాయిలో, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎఫ్‌టీకేలు / బ్యాక్టీరియలాజికల్ కుండలను ఉపయోగించి నీటి నాణ్యతా పరీక్షలు నిర్వహించాలి. ప్రతి పంచాయతీ ఎఫ్‌టీకేలు / కుండలు సేకరించి వాటితో క్రమంగా పరీక్షలు నిర్వహించడానికి వీలు కల్పిస్తారు.
స‌మ‌స్త స‌మాచారానికి ఆన్‌లైన్‌ పోర్ట‌ల్‌..
దీనికి తోడు నీటి నాణ్య‌త నిర్వ‌హ‌ణ కోసం జల్ జీవన్ మిషన్ - వాటర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జేజేఎం-డబ్ల్యుక్యూఎంఐఎస్) ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ (డిహెచ్‌ఆర్) భాగస్వామ్యంతో ఆన్‌లైన్ పోర్టల్‌గా అభివృద్ధి చేశారు. అన్ని నీటి నాణ్యత పరీక్ష స‌మాచారం అనగా నమూనాల‌ సేకరణ, మొబైల్ ల్యాబ్‌లతో సహా ప్రయోగశాలలలో మరియు నీటి నాణ్యత పరీక్ష వస్తు సామగ్రి ద్వారా నిర్వ‌హించే పరీక్షల ఫలితాలు ఈ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయబడతాయి. దీని ద్వారా ఒకే ప్రాంతంలో నీటి నాణ్యతకు సంబంధించిన స‌మాచార లభ్యత, ప్రతి త్రాగునీటి వనరులను సులభంగా ప్రాప్తి చేయడానికి, నీటి వ‌న‌ర‌కుచరిత్రను కనుగొనడంలో సహాయపడుతుంది. తద్వారా ప్రతి ఇంటికి సకాలంలో నీటి స‌మ‌స్య‌ల పరిష్కార చర్యలు నిర్ధారించబడతాయి.
ఈ పోర్టల్ యాక్సెస్ చేయడానికి లింక్ https://jaljeevanmission.gov.in/ లేదా https://neer.icmr.org.in/website/main.php.
The link to access the portal is https://jaljeevanmission.gov.in/ or https://neer.icmr.org.in/website/main.php.

ఎన్ఏబీఎల్ ధ్రువీక‌ర‌ణ‌..
ప్రతి రాష్ట్రం / కేంద్ర‌పాలిత ప్రాంతంలో కనీసం ఒక రాష్ట్ర / యుటీ స్థాయి ప్రయోగశాల మరియు ప్రాంతాల వారీ ప్రయోగశాలలను కలిగి ఉండాలని ఈ అడ్వైజ‌రీ సూచించింది. దీనికి తోడు పెద్ద రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో
ప్రాంతీయ‌ నీటి ప‌రీక్షా కేంద్రాలు ఉండాల‌ని అడ్వైజ‌రీ సూచించింది. తద్వారా సమీపంలోని అన్ని ర‌కాల నీటి వనరులను క్రమం తప్పకుండా పరీక్షించే వీలుప‌డుతుంది. అదేవిధంగా, అన్ని జిల్లాలకు జిల్లాస్థాయి నీటి ప్రయోగశాల ఉండాలి మరియు వీటిని ఏర్పాటు చేయడానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వాల‌ని సూచించింది. అన్ని రాష్ట్ర / ప్రాంతీయ మరియు జిల్లా స్థాయి ప్రయోగశాలలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. ఇవి ఎన్ఏబీఎల్  గుర్తింపు పొందడం తప్పనిసరి.
అన్ని ఉప-డివిజన్ / బ్లాక్ స్థాయి ప్రయోగశాలలను ఎన్ఏబీఎల్‌ ధ్రువీక‌ర‌ణ ఉండాలి. ఎన్ఏబీఎల్‌ గుర్తింపు పొందాలి.

జేజేఎం-డబ్ల్యుక్యూఎంఐఎస్ పోర్టల్ యొక్క స్నాప్‌షాట్

ఇంకా, అన్ని నీటి ప్రయోగశాలలు ప్రజలు తీసుకు వ‌చ్చే నీటి నమూనాలను నామమాత్రపు రేటుతో పరీక్షించాలి.  ఇది సరఫరా చేయబడిన నీటి నాణ్యతపై ప్రజలలో విశ్వాసాన్ని కలిగిస్తుంది మరియు నీటి శుద్దీకరణ పరికరాల డిమాండ్ తగ్గించబడుతుంది. జల్ జీవన్ మిషన్ యొక్క నినాదం సేవ‌ల విత‌ర‌ణ‌తో పాటు మరియు మౌలిక సదుపాయాల కల్పన మాత్రమే కాదు. సాధికారిక‌త‌తో పాటు అధికారాలు అపాదించి పంచాయతీలు ప్ర‌భుత్వం సృష్టించిన ఆయా మౌలిక వ‌స‌తుల‌కు సంర‌క్ష‌కుడిగా వ్య‌వ‌హ‌రించేలా చూడ‌డం. పాటుగా ప్రతి గ్రామంలో సృష్టించబడిన తాగు నీటి సరఫరా వ్యవస్థను దాని మొత్తం రూపకల్పన చక్రం స‌రిగ్గా ప‌ని చేసేలా చూడ‌డం, నిర్వ‌హ‌ణ  కొనసాగించే స్థితిలో ఉండేలా చూస్తుంది.
                               

****


(Release ID: 1718885) Visitor Counter : 458