ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19పై ప్రజారోగ్య ప్రతిస్పందన- 6 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో టీకాల కార్యక్రమ ప్రగతిపై డాక్టర్ హర్షవర్ధన్ సమీక్ష

వైద్య సిబ్బందిసహా పాలన యంత్రాంగంలో నిరంతర మహమ్మారి విధుల అలసట, ఒత్తిడి తీర్చే దీర్ఘకాలిక ప్రణాళికపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచన;

‘‘వైరస్ రకాలతో నిమిత్తం లేకుండా ప్రస్తుత వ్యూహమే కొనసాగుతుంది’’
టీకాల వ్యూహాన్ని ప్రభావితంచేసే ప్రధాన సమస్యలపై

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారం

‘‘రాష్రాల నుంచి మరిన్ని టీకా డోసుల కోసం డిమాండ్‌తో ప్రజల్లో సంకుచిత రాజకీయ ఉద్వేగాలు.. మహమ్మారిపై ‘సంపూర్ణ ప్రభుత్వ’ విధానానికి హానికరం’’

Posted On: 13 MAY 2021 7:37PM by PIB Hyderabad

   కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఇవాళ తమ శాఖ సహాయమంత్రి శ్రీ అశ్వనీకుమార్ చౌబేతో కలసి దేశంలోని 6 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్యశాఖ మంత్రులు, ముఖ్య/అదనపు ప్రధాన కార్యదర్శులతో సంభాషించారు. ఈ ఆరు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో రోజువారీ నమోదయ్యే కేసుల, మరణాల సంఖ్య గణనీయ పెరుగుదలను సూచిస్తుండగా, పట్టణ ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి మెరుగవుతోంది. కాగా, ఈ స‌మావేశంలో ఆయా రాష్ట్రాల ఆరోగ్య‌శాఖ మంత్రులు- శ్రీ రాజేష్ తోపే (మహారాష్ట్ర), డాక్టర్ కె.సుధాకర్ (కర్ణాటక), శ్రీమతి కె.కె.శైల‌జ (కేరళ), శ్రీ ఎం.సుబ్ర‌మ‌ణియ‌న్ (త‌మిళ‌నాడు), శ్రీ ర‌ఘుశ‌ర్మ‌ (రాజస్థాన్), శ్రీ సత్యేంద్ర జైన్ (ఢిల్లీ)లు వాస్త‌విక సాదృశ మాధ్య‌మంద్వారా పాల్గొన్నారు.

   జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ) సంచాలకులు డాక్టర్ సుజీత్ సింగ్ ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో సాంక్రమిక వ్యాధుల అధ్యయన వివరాలతోపాటు కోవిడ్ గమన మార్గంపై కూలంకష విశ్లేషణను నివేదించారు. దేశంలో ప్రస్తుతం గణనీయ స్థాయిలో అధిక వయసుగల వారికి టీకాలు ఇవ్వడం పూర్తయినందున కోవిడ్-19 వ్యాప్తి తక్కువ వయస్సుగల వారివైపు మళ్లిందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం నగర-సమీప, గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధి వ్యాప్తి అధికంగా ఉన్నందువల్ల ఆ ప్రాంతాల్లో రోగ నిర్ధారణ, టీకాల కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని ఆయన సూచించారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక ఆరోగ్య వసతులు తగినంతగా లేని కారణంగా పెరుగుతున్న కేసుల నిర్వహణ కష్టతరం కాగలదని ఆయన పేర్కొన్నారు. అందువల్ల ఆయా ప్రాంతాల్లో వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు సత్వర చర్యలు చేపట్టాల్సిన అవసరం గురించి హెచ్చరించారు. వైరస్ రకాల తీవ్రత, వ్యాప్తి వేగాన్ని గుర్తించడం కోసం జన్యురాశి అనుక్రమణ నిర్మాణానికి వీలుగా నమూనాలను పంపాల్సిందిగా ఆయన రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

   ఈ ఆరు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కోవిడ్ గమన మార్గం గురించి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. మహమ్మారిపై పోరులో ఆయా రాష్ట్రాల పాలన యంత్రాంగాలు చూపుతున్న అంకితభావం, కఠోర దీక్షను ఆయన కొనియాడారు. అదే సమయంలో ఈ యుద్ధంలో ముందు వరుసలోని యోధుల సంక్షేమ పథకాల ప్రయోజనాలను పెంచడం ద్వారా ప్రజల సంక్షేమానికి భరోసా ఇవ్వడం ప్రశంసనీయమని అభినందించారు. ‘‘గత 24 గంటల్లో 3.62 లక్షల కొత్త కేసులు నమోదైనప్పటికీ, చురుకైన కేసుల భారంలో 6,426 కేసుల మేర నికర క్షీణత కనిపించింది. ప్రస్తుతం దేశంలో 37,10,525కుపైగా చురుకైన కేసులు ఉండగా, దురదృష్టవశాత్తూ గత 24 గంటల్లో 4,120 మంది ప్రాణాలు కోల్పోయారు” అని ఆయన వివరించారు.

   రాష్ట్రాల పనితీరు గురించి మంత్రి వివరిస్తూ- మహారాష్ట్రలోని ముంబై, పుణె నగరాల్లో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ 2021 జనవరి నుంచి కోవిడ్-19 రెండోదశ తీవ్రతతో ఆ రాష్ట్రం నిరంతరం సతమతం అవుతున్నదని తెలిపారు. కాగా, జనవరిలో విదర్భ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో మాత్రమే ఆరంభంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే- నేడు  కొల్హాపూర్, సతారా, బీడ్ సహా 30 జిల్లాల్లో వ్యాధి వ్యాప్తి అత్యధికంగా ఉందన్నారు. అలాగే రాజస్థాన్‌లోని అజ్మీర్, జోధ్‌పూర్, భిల్వారా; కేరళలోని ఎర్నాకుళం, త్రిస్సూర్, మల్లపురం, తిరువనంతపురం; కర్ణాటకలోని బెంగళూరు (అర్బన్), మైసూరు, బళ్లారి, తుంకూర్; తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూర్, చెంగల్పట్టు, మదురై, తిరువళ్లూరు జిల్లాల్లోనూ ఆందోళనకర పరిస్థితులున్నాయని తెలిపారు. కాగా, కర్ణాటకలోని చురుకైన కేసులలో దాదాపు 50 శాతం బెంగళూరులో నమోదవుతుండగా- మరణాల రీత్యా తమిళనాడులోని మదురైలో 1.48 శాతం, చెన్నైలో 1.32 శాతం వంతున నమోదవుతూ రాష్ట్ర, జాతీయ స్థాయి శాతాలకన్నా అధిక నిష్పత్తిలో ఉన్నట్లు పేర్కొన్నారు.

   మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటకలలో ‘బి.1.617 రకం కోవిడ్-19 వైరస్ కారణంగానే కేసులు విపరీతంగా పెరిగినట్లు మంత్రి వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొత్తగా పుట్టుకొచ్చే కోవిడ్ రకాలను గుర్తించటానికి వీలుగా ‘‘ఇన్సాకాగ్’’ (INSACOG)కు క్రమం తప్పకుండా నమూనాలను పంపాల్సిందిగా ఆయన అన్ని రాష్ట్రాలకూ సూచించారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు నిపుణులు చేపట్టిన చర్యలను మంత్రి వివరిస్తూ- ‘‘వైరస్ రకాలతో నిమిత్తం లేకుండా ప్రస్తుత వ్యూహమే కొనసాగుతుంది’’ అని స్పష్టం చేశారు. అంతేకాకుండా కోవిడ్ అనుగుణ ప్రవర్తన పద్ధతుల పాటింపును నిరంతరం కొనసాగించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. దీంతోపాటు మహమ్మారి ప్రస్తుత విజృంభణను అరికట్టే దిశగా నియంత్రణ చర్యలపై తిరిగి నిశితంగా దృష్టి సారించాలని కోరారు.

   కోవిడ్-19 కట్టడికి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించుకోవాలని డాక్టర్ హర్షవర్ధన్ రాష్ట్రాలకు సూచించారు. అనేక రాష్ట్రాల్లో మహమ్మారిపై ఏడాదికిపైగా కాలం నుంచీ పోరాటం సాగుతున్న నేపథ్యంలో ప్రజారోగ్య యంత్రాంగం, వైద్య సిబ్బంది క్రమంగా అలసిపోతున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సిబ్బందికి వంతులవారీ విధుల కేటాయింపు పద్ధతిపై రాష్ట్రాలు చురుగ్గా చర్యలు తీసుకోవాలని, దీంతోపాటు విధులకు సంబంధించి వారికి క్రమం తప్పకుండా కౌన్సెలింగ్ ఏర్పాటు చేయాలని ఆయన రాష్ట్రాలను కోరారు. సమావేశంలో పాల్గొన్న ఆరోగ్యశాఖ మంత్రులు తమ రాష్ట్రాలకు టీకాల కోటాను పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దీంతో టీకాల విధానాన్ని ప్రభావితం చేస్తున్న అంశాల గురించి డాక్టర్ హర్షవర్ధన్ వారికి ఎంతో సహనంతో వివరించారు.

   ‘‘దేశంలో 88 శాతం కోవిడ్ మరణాలు 45 ఏళ్లు, అంతకుమించిన వయో సమూహానికి చెందినవే. కాబట్టి ఆ వయో వర్గంలోని వారికి ప్రాధాన్య క్రమంలో టీకాలివ్వాల్సిన అవసరం ఏర్పడింది. అయితే, రాష్ట్రాల్లో స్థానిక పరిస్థితులను బట్టి ఇకపై ప్రత్యక్ష కొనుగోలు ద్వారా ఇతర వయోవర్గాలకూ టీకాలు వేసేందుకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చు. ఇక రెండో మోతాదు తీసుకోవాల్సిన వారికి టీకాల కొరతను పరిగణనలోకి తీసుకుని, ఇకపై 70 శాతం టీకాలను వారికే కేటాయించాలని మార్గదర్శకాల జారీ సందర్భంగా నిర్ణయించాం’’ అని మంత్రి విశదీకరించారు. దేశంలో టీకాల నెలవారీ ఉత్పత్తి సామర్థ్యం గురించి తెలియజేస్తూ- రాష్ట్రాలన్నిటికీ సమాన స్థాయిలో టీకాలను పంపిణీ చేస్తామన్న హామీని పునరుద్ఘాటించారు. ఉత్పాదక సామర్థ్యాన్ని స్థిరంగా పెంచుతున్నామని, 2021 మే నెలాఖరులోగా 8 కోట్ల మోతాదుల స్థాయికి, 2021 జూన్ నాటికి 9 కోట్ల స్థాయికి టీకాల ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు. రాష్రాల నుంచి మరిన్ని టీకాల కోసం డిమాండ్‌తో ప్రజల్లో సంకుచిత రాజకీయ ఉద్వేగాలు రేగుతాయని, మహమ్మారిపై ‘సంపూర్ణ ప్రభుత్వ పోరు’ విధానానికి ఈ పరిణామం హానికరం కాగలదని ఆయన స్పష్టం చేశారు. కాగా, విదేశీ తయారీదారుల నుంచి టీకాల కొనుగోలు కోసం ఉమ్మడి విధానాన్ని రూపొందించాలని రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులు ఈ సందర్భంగా విజ్ఞ‌ప్తి చేశారు.

   రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రజానీకానికి సంపూర్ణంగా టీకాలిచ్చే దిశగా... కేంద్ర ప్రభుత్వ ఉచిత టీకాల పంపిణీ మార్గంతోపాటు ‘సరళీకృత ధర నిర్ణయం- వేగిరపరచిన జాతీయ కోవిడ్-19 టీకాల వ్యూహం కింద కేంద్ర ప్రభుత్వేతర మార్గాన్ని కూడా వినియోగించుకోవచ్చునని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి వివరించారు. దేశంలోని ప్రతి టీకా తయారీదారు ప్రతినెలా ఉత్పత్తి చేసే టీకాలలో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆస్పత్రుల ప్రత్యక్ష కొనుగోలు కోసం అందుబాటులో ఉంటుందన్నారు. మిగిలిన 50 శాతాన్ని కేంద్రం కొనుగోలు చేసి, దీన్ని ఎప్పటిలాగానే రాష్ట్రాలన్నిటికీ పూర్తి ఉచితంగా కేటాయిస్తుందని వెల్లడించారు. దేశంలో టీకా లభ్యత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదని ఆయన గుర్తుచేశారు. కోవిడ్-19 టీకాలు ప్రస్తుతం విదేశాల్లోనూ అభివృద్ధి చేసి, తయారు చేస్తున్నట్లు తెలిపారు. ప‌రిమిత వినియోగం కోసం యూఎస్ఎఫ్‌డీఏ, ఈఎంఏ, యూకే ఎంహెచ్ఆర్ఏ, పీఎండీఏ-జ‌పాన్ ఇచ్చిన అత్య‌వ‌స‌ర ఆమోదం ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (అత్య‌వ‌స‌ర వినియోగ జాబితాలో) న‌మోదైందని, వీటికి భార‌త‌దేశంలోనూ అత్య‌వ‌స‌ర అనుమతి ఇవ్వబడుతుందని ప్ర‌క‌టించారు.

   దేశంలో మూడోదశ టీకాల కార్యక్రమానికి స్థిరమైన సమయ నిర్దేశంతోపాటు సరఫరా క్రమం నిర్వహణను క్రమబద్ధీకరిస్తూ కొత్త వ్యూహం సిద్ధమవుతున్నదని (జాతీయ ఆరోగ్య కార్యక్రమం) అదనపు కార్యదర్శి-మేనేజింగ్ డైరెక్టర్ కుమారి వందనా గుర్నానీ ప్రకటించారు. టీకాల ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తాజా ప్రయత్నాలను కూడా ఆమె వివరించారు. ప్రస్తుతం అందుబాటులోగల టీకాలతోపాటు దేశంలో ఇతర టీకాల లభ్యత గురించి ఈ సందర్భంగా ఆమె తెలిపారు. అలాగే, వీటి పంపిణీకి సంబంధించి నియంత్రణ నిబంధనల అమలుద్వారా పారదర్శకతకు భరోసా ఇచ్చారు. ఆయా రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్యశాఖ ముఖ్య/అదనపు ప్రధాన కార్యదర్శులతోపాటు నిఘా అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

***

(Release ID: 1718513) Visitor Counter : 185