వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ప్రస్తుత రబీ మార్కెటింగ్ సీజన్ 2021-22లో డిబిటి ద్వారా మొత్తం రూ. 56,059.54 కోట్లు బదిలీ
డిబిటి ద్వారా దతపంజాబ్ రైతుల అకౌంట్లలో చెల్లించవలసిన మొత్తంలో 91% అయిన రూ.23,402 కోట్లు బదిలీ
ప్రస్తుత ఆర్ ఎంఎస్ సేకరణ కార్యకలాపాల ద్వారా 36.19 లక్షల గోధుమ రైతులకు లబ్ధి
Posted On:
13 MAY 2021 7:57PM by PIB Hyderabad
తమ గోధుమ పంట అమ్మకాలకు బదులుగా తొలిసారిగా పంజాబ్ & హర్యానాకు చెందిన రైతులు తమ అకౌంట్లలోకి ప్రత్యక్షంగా చెల్లింపులను అందుకోవడంతో రబీ మార్కెటింగ్ సీజన్ 2021-22 కాలంలో మిషన్ వన్ నేషన్, వన్ ఎంఎస్‌పి, వన్ డిబిటి (ఒకటే దేశం, ఒకటే ఎంఎస్‌పి, ఒకటే డిబిటి - లబ్ది ప్రత్యక్ష బదిలీ) ఒక రూపాన్ని సంతరించుకుంది. ప్రస్తుతం డిబిటి దేశవ్యాప్తంగా అమలవుతోంది.
సేకరిస్తున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాలైన పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా ఇతర రాష్ట్రాలలో 12 మే 2021వరకు దాదాపు 353.99 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుతో గోధుమ సేకరణ సజావుగా సాగుతోంది. గత ఏడాది ఇదే కాలంలో సేకరించిన 268.91 లక్షల మెట్రిక్ టన్నులతో పోలిస్తే ఇది ఎక్కువ.
దేశంలో ఉన్న రైతుల అకౌంట్లలోకి రూ.56,059.54 కోట్ల రూపాయలను ప్రత్యక్షంగా బదిలీ చేశారు. పంజాబ్ రైతులకు ఇందులో 91% అంటే రూ. 23,402 కోట్లను పంజాబ్‌కు చెందిన రైతులకు చెల్లించారు.
మొత్తం కొనుగోలు అయిన 353.98 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలలో పంజాబ్ - 131.14 లక్షల మెట్రిక్ టన్నులు (37.04%), హర్యానా 81.07 లక్షల మెట్రిక్ టన్నులు (22.90%), మధ్యప్రదేశ్ -103.71 లక్షల మెట్రిక్ టన్నులు (29.29%)తో 12 మే 2021 వరకు ప్రధానంగా దోహదం చేశాయి. ఈ సీజన్‌లో పంజాబ్ & హర్యానా సేకరణ గణాంకాలు గత ఏడాదిని దాటిపోవడమే కాక ప్రస్తుత లక్ష్యం/ అంచనా కూడా సాధించి, రికార్డు సేకరణను నమోదు చేశాయి.
ఇప్పటికే 36,19 లక్షల గోధుమ రైతులు కొనసాగుతున్న ఆర్ ఎంఎస్ సేకరణ కార్యకలాపాల నుంచి లబ్ధి పొందారు. దీని ఎంఎస్‌పి విలువ రూ. 69,912.61 కోట్లుగా ఉంది.
***
(Release ID: 1718417)
Visitor Counter : 144