ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కొవిడ్-19 సెకండ్‌ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి ఎండివోఎన్‌ఈఆర్ మొత్తం 8 ఈశాన్య రాష్ట్రాలకు అనుకూలంగా సహాయం చేస్తోందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు


ఈశాన్య రాష్ట్రాల్లోని ఆసుపత్రులకు నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరాను అందించడానికి జపాన్ & యుఎన్‌డిపి 8 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాయి.

Posted On: 11 MAY 2021 5:12PM by PIB Hyderabad

నార్త్ ఈస్టర్న్ రీజియన్ (డోనెర్), ఎంవోఎస్‌ పిఎంఓ, సిబ్బంది, ప్రజా మనోవేదనలు, పెన్షన్లు, అణుశక్తి మరియు అంతరిక్ష అభివృద్ధి శాఖ కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర ఛార్జ్), డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ  కొవిడ్-19 సెకండ్‌ వేవ్‌లో సమర్థవంతంగా పోరాడటానికి మొత్తం 8 ఈశాన్య రాష్ట్రాలకు ఎండివోఎన్‌ఈఆర్  సహకరిస్తున్నట్లు చెప్పారు..

కొవిడ్ సంసిద్ధతపై ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య కార్యదర్శులు, ఈశాన్య రాష్ట్రాల ప్రణాళిక కార్యదర్శులు మరియు కేంద్ర ప్రభుత్వ అధికారులతో జరిపిన సమీక్షా సమావేశానికి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహించారు. ఈశాన్య రాష్ట్రాల్లోని ఆస్పత్రులకు నిరంతరాయంగా ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు జపాన్ మరియు యుఎన్‌డిపి భాగస్వామ్యంతో 8 ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ ప్లాంట్లు ఈ ప్రాంతంలోని 1300 కి పైగా ఆసుపత్రి బెడ్స్‌కు తోడ్పడతాయి. విదేశీ సాయంలో ఈ రాష్ట్రాలు తమ న్యాయమైన వాటాను పొందుతాయని మరియు కరోనాపై పోరాటంలో వారికి అండగా ఉంటామని డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ హామీ ఇచ్చారు.

14 ఆరోగ్య, కోవిడ్ సంబంధిత ప్రాజెక్టులకు గత ఏడాది రూ .369 కోట్ల నిధులు పంపిణీ చేసినట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. కొత్త పరికరాల కొనుగోలుతో పాటు ఆరోగ్య, మౌలిక సదుపాయాలను పెంచడానికి అవి గణనీయంగా సహాయపడ్డాయని, ఇప్పుడు అన్ని రాష్ట్రాలు మహమ్మారిపై పోరాడటానికి బాగా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

మొదటి వేవ్‌కంటే రెండో వేవ్‌లో అన్ని రాష్ట్రాలు అధికంగా మహమ్మారి బారిన పడుతున్నాయనే వాస్తవాన్ని గమనించిన మంత్రి..ఆరోగ్య సంబంధిత ప్రతిపాదనలను త్వరగా పంపమని అన్ని రాష్ట్రాలను కోరారు. వాటిని మంత్రిత్వ శాఖలో ప్రాధాన్యత ప్రాతిపదికన నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాల డిమాండ్లను నెరవేర్చడానికి కేంద్రంలోని ఆరోగ్య, రైల్వే మరియు ఇతర సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని డోనర్ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు.

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ దాదాపు అన్ని రాష్ట్రాలు ఆక్సిజన్ కొరత, టీకాలు మరియు రెమ్డెసివిర్ వంటి ముఖ్యమైన ఔషధాల కొరత వంటి సమస్యలను తెలిపాయని వాటిని  కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి వద్దకు వ్యక్తిగతం తీసుకువెళ్తానని వారికి హామీ ఇచ్చారు. కొవిడ్‌తో పోరాడటానికి ఔషధాలు ప్రధానం  కాబట్టి ఆక్సిజన్ మరియు అవసరమైన ఔషధాలను నిల్వ చేయవద్దని ప్రజలకు మంత్రి  విజ్ఞప్తి చేశారు. సామాన్యులలో అవగాహన కల్పించడంలో యువత, సివిల్ సొసైటీ, మత పెద్దలు మరియు మహిళా స్వయం సహాయక బృందాల అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.

జిల్లా ఆస్పత్రులు, పరీక్షా సదుపాయాలు, మొబైల్ టెస్టింగ్ ల్యాబ్‌లు, కీలక పరికరాలు మరియు ఈ ప్రాంతమంతటా ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు వంటి ఆరోగ్య సంబంధిత మౌలిక సదుపాయాలను పెంచడానికి ఎమ్‌డోనర్ నిధులను సమర్ధవంతంగా ఉపయోగించుకున్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ సంతృప్తి వ్యక్తం చేశారు. మహమ్మారికి సంబంధించిన సమస్యలపై రోజువారీ సమీక్షను చేయడానికి మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయడం ద్వారా అన్ని రాష్ట్రాలతో సమన్వయం చేసుకొని స్థానిక వనరుల ఏజెన్సీగా వ్యవహరించాలని ఆయన ఎన్‌ఇసికి ఆదేశించారు ..

లాక్డౌన్ -1 ప్రారంభ రోజులలో ఈశాన్య రాష్ట్రాల్లో మహమ్మారిని అరికట్టడానికి సన్నాహక చర్యల కోసం నార్త్ ఈస్టర్న్ రీజియన్ అభివృద్ధి మంత్రిత్వ శాఖ (డోనెర్) ముందస్తుగా రూ .25 కోట్ల మొత్తాన్ని అందుబాటులో ఉంచినట్లు మంత్రి గుర్తు చేశారు.

                           

<> <> <> <> <>



(Release ID: 1717900) Visitor Counter : 142