ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
దేశంలో కోవిడ్ పరిస్థితిపై కాబినెట్ కార్యదర్శి సమీక్ష
టీకాలపై నిపుణుల బృందం 2020 ఏప్రిల్ నుంచి, ఆక్సిజెన్ సరఫరాపై 2020 ఆగస్టు నుంచి కార్యరంగంలో ప్రవేశం
వైరస్ మీద సమర్థమైన పోరుకు రెండో విడత టీకాకు ప్రాధాన్యం
రాష్ట్రాల టీకా మందు వృధాను నామమాత్రం చేయాలి
ఆక్సిజెన్ వాడకాన్ని హేతుబద్ధం చేయాలి
గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ పట్ల అవగాహన పెంచటంలో క్షేత్ర స్థాయి సిబ్బంది, సంఘసేవకుల సేవలు వినియోగించుకోవాలి
Posted On:
11 MAY 2021 8:50PM by PIB Hyderabad
దేశంలో నెలకొన్న కోవిడ్ పరిస్థితిని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో జరిగిన 33వ సమావేశంలో కేంద్ర కాబినెట్ కార్యదర్శి సమీక్షించారు. అన్ని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
నిరుటి నుంచి కోవిడ్ ను నియంత్రించటానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నిటినీ కాబినెట్ కార్యదర్శి శ్రీ రాజీవ్ గౌబా ఈ సందర్భంగా సమావేశానికి వివరించారు. టాస్క్ ఫోర్స్ తోబాటు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల బృందం గత ఏడాది కాలంగా తీసుకున్న చర్యలను కూడా తెలియజేశారు. ఆరోగ్య మౌలికసదుపాయాల మెరుగుదల, టీకామందులపై పరిశోధన, తయారీ, పేద ప్రజల సంక్షేమం. టీకాల సరఫరా, ఆక్సిజెన్ సరఫరా లో కేంద్ర ప్రభుత్వం చేసిన్మ కృషిని ప్రస్తావించారు.
రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అత్యంత వేగంగా మౌలిక సదుపాయాలు పెంచుకోవటాన్ని ఆయన అభినందించారు. అదే విధంగా ఇళ్ళలఫోమ్ ఐసొలేషన్, స్వల్ప లక్షణాలతోలున్నప్పుడు వ్యవహరించాల్సిన తీరు తదితర అంశాలమీద ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఎప్పటికప్పుడు జారీచేసిన మార్గదర్శకాలను రాష్ట్రాలు పాటించటాన్ని కూడా ప్రస్తావించారు. స్వదేశీ పరిశ్రమలను ప్రధాని ప్రోత్సహించటం వల్లనే సెప్టెంబర్, 2020 నుంచి ద్రవరూప వైద్య ఆక్సిజెన్ తయారీ, సరఫరా మెరుగు పడిందన్నారు. అదే విధంగా రోడ్డు, జల, వాయు రవాణా కూడా సులభసాధ్యమైందన్నారు.
కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయాల్సి ఉందని కూడా కాబినెట్ కార్యదర్శి ఈ సందర్భంగా సూచించారు. సకాలంలొ ఆక్సిజెన్, ఇతర వైద్య వనరులను ఆస్పత్రులకు అందించటానికి సర్వ శక్తులూ ఒడ్డి కృషి చేస్తామన్నారు.
దేశంలో వాక్సిన్ ఉత్పత్తి, సరఫారా చేయటానికి వీలుగా ప్రధాని 2020 ఏప్రిల్ లోనే ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటృ చేశారని కాబినెట్ కార్యదర్శి శ్రీ రాజీవ్ గౌబా గుర్తు చేశారు. ఆ తరువాత ఆగస్టులో టీకా మందు పంపిణీ మీద మరో నిపుణుల బృందాన్ని నియమించిన సంగతి కూడా ప్రస్తావించారు. నిపుణుల సూచన మేరలు ప్రాధాన్యతా వర్గాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఉచితంగా టీకా డోసులు పంపినట్టు చెప్పారు. ఆ తరువాత క్రమంగా డిమాండ్ కు తగినట్టుగా ఇతర వయోవర్గాలను కూడా జాబితాలో చేర్చారన్నారు. రెండో డోస్ కు అర్హులైనవారికి అత్యధిక ప్రాధాన్యమివ్వాలని ఆయన సూచించారు. అదే సమయంలో వృధాను బాగా తగ్గించాలన్నారు. టీకాల విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారం గురించి ప్రస్తావిస్తూ కేంద్రం కొనుగోలు చేసినా, రాష్ట్రాలు కొనుగోలు చేసినా వాడకం మొత్తం రాష్ట్రాలలొనే జరుగుతుంది తప్ప కేంద్ర స్థాయిలో జరగదన్న విషయాన్ని గుర్తించాలన్నారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కొవిడ్ నిర్థారణ పరీక్షలు, స్థానికంగా కరోన్బా వ్యాప్తిని అరికట్టే పని వేగవంతం చేయటం, మానవ వనరుల వినియోగం, ఆక్సిజెన్ ను హేతుబద్ధంగా వినియోగించుకోవటం తదితర అంశాలలో రాష్టాలు తమకు తామే ప్రాధాన్యతా క్రమాన్ని నిర్ణయించుకోవాలని ఆరోగ్య కార్యదర్శి సూచించారు. వచ్చే మూడు నెలల్లో 1213 పి ఎస్ ఎ ప్లాంట్లు నెలకొల్పాలన్న ఆలోచన ను ఆయన వెల్లడించారు. టీకామందులను సక్రమంగా వాడుకోవాలని సూచిస్తూ మెరుగైన రోగ నిరోధకత కోసం కచ్చితంగా రెండో డోసుల టీకా తీసుకొవాల్సిన అవసరాన్ని ప్రజలలో ప్రచారం చేయాలని కూడా కోరారు. టీకా ఉత్పత్తి దారులతో రాష్ట్రాలు ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగించాలని సూచించారు.
కోవిడ్ నియంత్రణకు అవసరమైన ప్రవర్తనను కొన సాగించేలా చూడాల్సిన అవసరాన్ని సమాచార, ప్రసార కార్యదర్శి నొక్కి చెప్పారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలు, మార్గదర్శకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. వాటిని ప్రభుత్వ వెబ్ సైట్ https://www.mygov.in/covid-19/ లో కూడా చూడవచ్చునన్నారు.
పట్టణ శివార్లు, గ్రామీణ ప్రాంతాల్లో మరింత అవగాహన కల్పించటానికి రాష్టాలు కృషి చేయాలని కూడా కోరారు. ఈ క్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఎ ఎన్ ఎం లు తదితర క్షేత్రస్థాయి సిబ్బందిని, స్థానిక సమాజ సేవకులను వాడుకోవాలని రాష్టాలను కోరారు. స్థానిక నాయకులను, పలుకుబడి గలవారిని భాగస్వాములను చేస్తూ కోవిడ్ నియంత్రణకు పాటించాలని పద్ధతుల మీద అవగాహన పెంచాలన్నారు. అప్పుడే స్వల్ప లక్షణాలకు సైతం బెంబేలెత్తకుండా అర్థం చేసుకోగలుగుతారని, తగిన చికిత్స తీసుకుంటారని అన్నారు.
***
(Release ID: 1717894)
Visitor Counter : 158