వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఔరంగాబాద్, అమరావతి డివిజనల్ కార్యాలయాలు తక్షణమే మొదలవుతాయి: కేంద్రమంత్రి రావ్ సాహెబ్ దన్వే

Posted On: 10 MAY 2021 5:53PM by PIB Hyderabad

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ), మహారాష్ట్రలోని అమరావతి, ఔరంగాబాద్‌లో ఏర్పాటు చేసిన  రెండు డివిజనల్ కార్యాలయాలు వెంటనే కార్యకలాపాలు నిర్వహిస్తాయని కేంద్ర మంత్రి రావుసాహెబ్ దన్వే ప్రకటించారు. “ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎఫ్సీఐకి ఈ చెందిన ఈ కార్యాలయాలు వెంటనే సేవలు అందిస్తాయి.  వీటివల్ల రైతులకు, పిడిఎస్ లబ్ధిదారులు, ఎన్జిఓలు, ప్రభుత్వ సంస్థలు , మరాఠ్వాడా , పశ్చిమ విదర్భ వినియోగదారులకు గణనీయమైన రీతిలో ప్రయోజనం చేకూరుతుంది. ఈ కార్యాలయాలు ప్రారంభించడంతో  పనులను త్వరగా చేయించుకోవడం సాధ్యపడుతుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం ప్రజలకు ఆహార భద్రతను కల్పించడంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాత్ర చాలా ముఖ్యమైనది. మనదేశంలోని రైతుల నుండి ఉత్పత్తులను సేకరించే విషయంలో ఎఫ్‌సిఐ విశ్వసనీయ సంస్థగా పనిచేస్తుంది. దేశంతోపాటు మహారాష్ట్రలోని వివిధ కార్యాలయాల ద్వారా ఎఫ్‌సిఐ సమర్థవంతంగా సేవలు అందిస్తోంది.  కొవిడ్ కాలంలో కార్పొరేషన్ పాత్ర చాలా ముఖ్యమైనది. ఈ దేశ ప్రజల కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్న సంస్థ గురించి నేను గర్విస్తున్నాను”అని మంత్రి వివరించారు. మహారాష్ట్రలో ఎఫ్‌సిఐ తన ఆరు డివిజనల్ కార్యాలయాల ద్వారా పనిచేస్తోంది. ఇందులో గోవా కార్యాలయం కూడా ఉంటుంది.  బోరివలి ఆఫీసు ముంబై , సబర్బన్ ప్రాంతాలకు సేవలు అందిస్తుంది.  పన్వెల్ రాయగఢ్ వాసులకు, పూణే కార్యాలయం.. దక్షిణ మరాఠ్వాడ , పశ్చిమ మహారాష్ట్ర , కొంకణ్ ప్రాంతాలకు సేవలు అందిస్తాయి. నాగ్‌పూర్ కార్యాలయం మొత్తం విదర్భవాసుల కోసం పనిచేస్తుంది. నాసిక్ ప్రాంతం కోసం మన్మాడ్లోనూ ఎఫ్సీఐ కార్యాలయం ఉంది.

కొత్త డివిజనల్ కార్యాలయాలు రెవెన్యూ జిల్లాలను సంబంధిత రెవెన్యూ జిల్లాల కోసం అందుబాటులో ఉంటాయి. రోజు కార్యకలాపాలతోపాటు నిల్వ సామర్థ్యాలను నిర్వహించడం, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కోసం ధాన్యం అందజేయడం , అవసరమైనప్పుడు సేకరణ కార్యాలయం నిర్వహించడం వంటి సేవలు తక్షణమే అందుబాటులోకి వస్తాయి.  మొత్తం కార్యకలాపాలను డివిజనల్ కార్యాలయాల నుంచి పర్యవేక్షిస్తారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార , ప్రజా పంపిణీ, రైల్వే , వాణిజ్య , పరిశ్రమల మంత్రి  పియూష్ గోయల్ మార్గదర్శకత్వంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన" సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ , సబ్ కా విశ్వస్ " ఆదర్శం ప్రకారం ఎఫ్సీఐ పని చేస్తుందని దన్వే అన్నారు. మంత్రి పీయుష్ నిరంతర మార్గదర్శకత్వం చేస్తూ  ప్రోత్సాహిస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. లక్ష్యాలను చేరుకోవడానికి, జోనల్ కార్యాలయాలు, ప్రాంతీయ కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాలు, డిపోల ద్వారా ఎఫ్‌సిఐ పనిచేస్తుంది. దీనికి ఐదు జోనల్ కార్యాలయాలు (తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తర, ఈశాన్య), 26 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. రెవెన్యూ జిల్లాల ఆధారంగా డివిజనల్ కార్యాలయాలు ప్రతి ప్రాంతీయ కార్యాలయం కింద పనిచేస్తాయి. 

 

***(Release ID: 1717586) Visitor Counter : 163