వ్యవసాయ మంత్రిత్వ శాఖ
రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయడంలో ఉద్యానవన రంగం ప్రముఖ పాత్ర పోషించగలదు
2021-22లో ఉద్యానవన రంగానికి గల సంభావ్యతను వాస్తవ రూపంలో సాధించేందుకు రూ.2260 కోట్లను కేటాయించిన కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ
Posted On:
10 MAY 2021 5:03PM by PIB Hyderabad
రైతుల ఆదాయాన్ని పెంచడంలో తోటల పెంపకం పాత్ర, భారీ సంభావ్యతను దృష్టిలో పెట్టుకుని, ఉద్యానవన రంగాన్ని 2021-2022 సంవత్సరంలో అభివృద్ధి చేసేందుకు భారత ప్రభుత్వం రూ.2250 కోట్లను కేటాయించింది.
దేశంలో ఉద్యానవన రంగ సంపూర్ణ వృద్ధికి, దానిని మరింత ప్రోత్సహించేందుకు, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకమైన ఉద్యానవన రంగ సమగ్ర అభివృద్ధి మిషన్ (ఎంఐడిహెచ్) కింద 2021-2022 సంవత్సరానికి వ్యవసాయ మంత్రిత్వ, రైతాంగ సంక్షేమ శాఖ కేటాయింపును రూ.2250 కోట్లకు పెంచింది. ఉద్యానవన పెంపకం ద్వారా పండ్లు, కూరగాయలు, గడ్డ దినుసులు, పుట్టగొడుగులు, మసాలా దినుసులు, పూలు, సుగంధ వృక్షాలు, కొబ్బరి, జీడిపప్పు, కొకోవా సహా పంటల సామర్ధ్యాన్ని సాధించేందుకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఎంఐడిహెచ్‌ను 2014-15 నుంచి అమలు చేస్తోంది. గత ఏడాది కంటే ఈ కేటాయింపు చెప్పుకోతగినంతగా ఎక్కువ. వార్షిక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించేందుకు ఈ కేటాయింపు గురించి రాష్ట్రాలకు/ కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారమివ్వడం జరిగింది.
ఉద్యానవన రంగంలో ప్రభుత్వ చొరవ కారణంగా దేశంలో ఉద్యానవన ఉత్పత్తి వ్యవసాయ ఉత్పత్తిని అధిగమించే పరిస్థితి వచ్చింది. ముందెన్నడూ లేని విధంగా 2019-20లో దేశంలో కేవలం 25.66 మిలియన్ హెక్టార్లలో ఉద్యానవన పంటల ఉత్పత్తి 320.77 మిలియన్ టన్నులు ఉత్పత్తి నమోదైంది. ఇక 2020-21కి తొలి ముందస్తు అంచనాల ప్రకారం దేశంలో మొత్తం 27.17 లక్షల హెక్టార్ల నుంచి ఉద్యానవన పంటల ఉత్పత్తి 326.58 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉండనుంది.
ఉద్యానవన పంటల కింద ప్రాంతాన్ని పెంచడంలో ఎంఐడిహెచ్ ప్రముఖ పాత్రను పోషించింది. ఈ క్రమంలో 2014-15 నుంచి 2-10 వరకు పంట ప్రదేశం 9%, ఉత్పత్తి 14% శాతం పెరిగాయి. అదనంగా, తోటలలో అత్యుత్తమ పద్ధతులను మిషన్ ప్రోత్సహించడం వల్ల ఉత్పత్తి నాణ్యత పెరగడమే కాదు, వ్యవసాయ భూమి ఉత్పాదకత కూడా పెరిగింది. ఎంఐడిహెచ్ చొరవ ఉద్యానవ రంగంలో భారత్‌ను స్వయం సమృద్ధి చేయడమే కాదు, ఎవరూ ఆకలితో లేకుండా, మంచి ఆరోగ్యం, క్షేమం, దారిద్ర్యం లేకపోవడం, లింగ సమానత్వం తదితర స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా దోహదం చేసింది.
అయితే, పంట కోతల తర్వాత నష్టాలు, పంట తర్వాత నిర్వహణలో, సరఫరా లంకె మౌలిక సదుపాయాల మధ్య ఉన్న వ్యత్యాసం అనే సవాళ్ళను ఇప్పటికీ ఈ రంగం ఎదుర్కొంటోంది. అంచనా వేసిన దేశవ్యాప్త డిమాండ్‌కు అనుగుణంగా 650 మిలియన్ మెట్రిక్ టన్నుల పండ్లను, కాయగూరలను 2050 నాటికి తీర్చేలా భారతీయ ఉద్యానవన ఉత్పాదకతను పెంచేందుకు ఎంతో అవకాశం ఉంది. నాటే మొక్కల సామాగ్రి ఉత్పాదకత, సామూహిక (క్లస్టర్) అభివృద్ధి కార్యక్రమం, ఆగ్రి ఇన్ర్ఫా నిధి ద్వారా రుణాలు, ఎఫిపిఒల ఏర్పాటు, ప్రోత్సాహం అనేవి ఈ దిశలో సరైన అడుగులు.
*****
(Release ID: 1717531)
Visitor Counter : 347