రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులు, ఆక్సిజన్ సిలిండర్లు సహా అతి ముఖ్య వైద్య పరికరాలతో సింగపూర్ నుంచి విశాఖ చేరుకున్న ఐఎన్ఎస్ ఐరావత్

Posted On: 10 MAY 2021 5:20PM by PIB Hyderabad

కొవిడ్‌పై దేశం చేస్తున్న పోరాటానికి మద్దతుగా కొనసాగుతున్న "ఆపరేషన్‌ సముద్ర సేతు-2"లో భాగంగా,  క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులు, అతి ముఖ్య వైద్య పరికరాలు, 3898 ఆక్సిజన్‌ సిలిండర్లతో ఐఎన్ఎస్ ఐరావత్ సింగపూర్ నుంచి ఇవాళ విశాఖపట్నం చేరుకుంది. ఈ నౌక సింగపూర్‌లో ఈ నెల 8న బయల్దేరింది. సింగపూర్‌లోని భారత రాయబార కార్యాలయం సమన్వయంతో, వివిధ మార్గాల ద్వారా ఈ ఆక్సిజన్‌ ట్యాంకులు, సిలిండర్లను సేకరించారు.
 
    "ఆపరేషన్‌ సముద్రసేతు-2" కోసం కేటాయించిన తొమ్మిది నౌకల్లో ఐఎన్‌ఎస్‌ ఐరావత్‌ ఒకటి. పర్షియన్ గల్ఫ్,  ఆగ్నేయాసియాలోని మిత్రదేశాల నుంచి ద్రవరూప వైద్య ఆక్సిజన్‌, సంబంధిత వైద్య పరికరాలను తీసుకురావడానికి ఈ నౌకలను నియమించారు.

***


(Release ID: 1717522) Visitor Counter : 216


Read this release in: English , Urdu , Hindi , Punjabi