నౌకారవాణా మంత్రిత్వ శాఖ

అధిక ప్రాధాన్యత కింద, 120 మె.ట. ఆక్సిజన్‌ను నిర్వహించిన జేఎన్‌పీటీ, కొత్త మంగళూరు నౌకాశ్రయం

Posted On: 10 MAY 2021 5:45PM by PIB Hyderabad

అధిక ప్రాధాన్యత కింద, 120 మె.ట. వైద్య ఆక్సిజన్‌ను జేఎన్‌పీటీ, కొత్త మంగళూరు నౌకాశ్రయం ఇవాళ నిర్వహించాయి.

    దేశంలో అతి పెద్ద రవాణా నౌకాశ్రయం, జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్టు ట్రస్టు వైద్య ఆక్సిజన్‌తో కూడిన 4 క్రయోజెనిక్‌ కంటైనర్లను నిర్వహించాయి. ప్రతి కంటైనర్‌లో 20 మె.ట. చొప్పున మొత్తం 80 మె.ట. ఆక్సిజన్‌ ఉంది. ఇవి యూఏఈలోని జెబెల్‌ అలీ పోర్టు నుంచి మన దేశానికి వచ్చాయి. 

    కువైట్‌ నుంచి 40 మె.ట. ఆక్సిజన్‌తో, ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా కొత్త మంగళూరు పోర్టుకు చేరుకుంది. 5 టన్నుల ఆక్సిజన్ సిలిండర్లు, 4 హై ఫ్లో ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్లను కూడా ఆక్సిజన్‌తోపాటు నౌక తీసుకొచ్చింది.
 
    ఆక్సిజన్‌ సంబంధిత సామగ్రిని తీసుకొచ్చే నౌకలపై అన్ని సుంకాలు (నౌక సంబంధ రుసుములు, నిల్వ సుంకాలు సహా) రద్దు చేయాలని, బెర్తుల కేటాయింపులో అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర నౌకాశ్రయాలు, జల రవాణా, జల మార్గాల మంత్రిత్వ శాఖ ఇప్పటికే కామరాజ పోర్టు లిమిటెడ్‌ సహా అన్ని ప్రధాన పోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని వివరాల కోసం https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1713914ను చూడవచ్చు.

***



(Release ID: 1717521) Visitor Counter : 144