ఆయుష్

ఢిల్లీలోని ఏడు ప్రాంతాల్లో సోమవారం నుంచి ఆయుష్ ‌‌-64 ఉచిత పంపిణీ

Posted On: 09 MAY 2021 4:06PM by PIB Hyderabad

కోవిడ్బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు సేవచేయాలనే నిబద్ధతతో ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో ఆయుష్ 64 మందు ఉచిత పంపిణీని ప్రారంభించిన కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ సోమవారం నుంచి మరిన్ని ప్రాంతాల్లో ఆయుష్ 64 మందు ఉచిత పంపిణీని ప్రారంభించనుంది. కోవిడ్ 19 వైరస్ సోకి హోం ఐసోలేషన్లో ఉన్న రోగులతోపాటు ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న రోగులు ఆయుష్ మంత్రిత్వశాఖ తీసుకున్న ఈ చొరవ ద్వారా లబ్ధి పొందనున్నారు.

కోవిడ్ బారిన పడిన రోగులు లేదా వారి బంధువులు ఉచితంగానే ఆయుష్ 64 ఉచిత కిట్ ను తీసుకోవచ్చు. ఇందుకోసం ఆర్టీపీసీఆర్ పాజిటివ్ రిపోర్టు, ఆధార్ కార్డు చూపాల్సి ఉంటుంది. రెండోసారి అవసరమైనవారికి కూడా ఉచితంగానే ఈ మందులను పంపిణీ చేస్తారు.

ఆయుష్ 64 అనేది పాలి హెర్బల్ మందు. కోవిడ్ 19 సంక్రమణకు సంబంధించి ఎటువంటి లక్షణాలు లేనివారికి, తేలికపాటి లక్షణాలున్నవారికి చికిత్స చేయడంలో ఉపయోగకరంగా ఉంటుంది. కోవిడ్ను ఎదుర్కొనేందుకు ఐసీఎంఆర్ ఏర్పాటుచేసిన నేషనల్ టాస్క్ ఫోర్స్.. నేషనల్ క్లినికల్ మేనేజ్మెంట్ ప్రొటోకాల్లో ఆయుర్వేదం, యోగా ఆధారంగా ఆయుష్ 64ను సిఫారసు చేసింది. కోవిడ్ 19బారిన పడి హోం ఐసోలేషన్లో ఉన్న రోగులుకు చికిత్స అందించే ఆయుర్వేద వైద్యులకు పలు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. కోవిడ్ 19 రోగుల చికిత్సకు అనుంబంధంగా ఆయుష్ 64 సిఫారసు చేయబడింది. ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ వీఎం కటోచ్ నేతృత్వంలోని ఆయుష్ మంత్రిత్వశాఖ, సీఎస్ఐఆర్ సంయుక్తంగా ఏర్పాటుచేసిన కమిటీ ఆయుష్ 64కు సంబంధించిన మల్టీ సెంటర్ క్లినికల్ ట్రయల్స్ ను పర్యవేక్షించింది.

కోవిడ్19 సంక్రమణకు సంబంధించి ఎటువంటి లక్షణాలు లేని, తేలికపాటి లక్షణాలున్న రోగుల కోసం అందుబాటులో ఉండే ఏడు కేంద్రాల్లో వీటిని పంపిణీ చేస్తారు. ఆ కేంద్రాల వివరాలు..  ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదం (ఏఐఐఏ), సరిత విహార్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పింపిణీ చేస్తారు. ఇక అశోకా రోడ్డులోని మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా కేంద్రంలో మొత్తం ఏడు రోజులపాటు  ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పంపిణీ చేస్తారు. జామియా నగర్ లోని అబుల్ ఫజల్ ఎన్క్లేవ్ పార్ట్‌‌–1, ఓఖ్లాలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయుష్ 64 కిట్ల పంపిణీ జరుగుతుంది. దీంతోపాటు
 యునానీ మెడికల్ సెంటర్, రూం నెం. 111-113, మెయిన్ ఒపిడి బిల్డింగ్, మొదటి అంతస్తు, గేట్ నెం. 7, జామియా మిలియా ఇస్లామియా లోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పంపిణీ చేస్తారు. అంతేకాకుండా  యునాని స్పెషాలిటీ క్లినిక్, డాక్టర్ ఎంఎ అన్సారీ హెల్త్ సెంటర్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు, పంజాబీ బాగ్ లోని సెంట్రల్ ఆయుర్వేద పరిశోధనా సంస్థ, వీధి నం. 66లో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటలు వరకు పంపిణీ చేస్తారు. ఇక జనక్పురిలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ నేచురోపతి, opp. డి-బ్లాక్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు , రోహిణిలోని సెక్టార్ 19 లోని సిసిఆర్‌వైఎన్ యొక్క నేచురోపతి హాస్పిటల్ బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆయుష్ 64 ఉచిత పంపిణీని జరుగుతుంది. ఇవి కాకుండా  ఆయుష్ భవన్, బి-బ్లాక్, జిపిఓ కాంప్లెక్స్ యొక్క రిసెప్షన్ వద్ద సేల్ కౌంటర్ కూడా ఏర్పాటు చేయబడింది, ఇక్కడ ఆయుష్ 64 మరియు ఆయురాక్ష కిట్లు రెండూ అందుబాటులో ఉన్నాయి.

***



(Release ID: 1717326) Visitor Counter : 184