రక్షణ మంత్రిత్వ శాఖ
ఐఎఎఫ్ కోవిడ్ ఎయిర్ సపోర్ట్ మేనేజ్‌మెంట్ సెల్ (సిఎఎస్ఎంసి) కార్యకలాపాలు
Posted On:
09 MAY 2021 3:35PM by PIB Hyderabad
భారతీయ వైమానిక దళం పాలెం ఎయిర్ బేస్‌లో 27 ఏప్రిల్ 2021 నుంచి కోవిడ్ ఎయిర్ సపోర్ట్ మేనేజ్‌మెంట్ సెల్ (సిఎఎస్ఎంసి) నిర్వహిస్తోంది. విదేశాల నుంచి వస్తున్న సహాయక ఉపకరణాల పంపిణీని సమర్ధవంతంగా సమన్వయం చేయడం ఈ సెల్ ప్రాథమిక కర్తవ్యం.
ఈ సెల్ ఇరవై నాలుగు గంటలు పని చేస్తుంది.
కార్యకలాపాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు మానవశక్తి, గ్రౌండ్ హ్యాండ్లింగ్ (విమానాల రాకపోకలకు ఆ ప్రాంతాన్ని సిద్ధం చేయడం), పరికరాలను ఎక్కించడం, ఫ్లాట్ టాప్ ట్రైలర్లు, ఫోర్క్ లిఫ్టర్లు వంటి వాహనాలు సహా అన్ని రకాల వనరులను సమన్వయ పరచడం జరిగింది.
ఒక సి-130, రెండు ఎఎన్-32 రవాణా విమానాలు పాలెం నుంచి 28 ఏప్రిల్ 2021 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇవి సల్పకాలంలోనే సూచనలను అందుకుని సరుకును దేశవ్యాప్తంగా చేరవేసేందుకు బయలుదేరుతున్నాయి. ఈ విధమైన అత్యవసర ఎయిర్‌లిఫ్ట్ (విమానం ద్వారా సరుకు తీసుకువెళ్ళడం) కోసం 29 ఏప్రిల్ 2021న మాక్ డ్రిల్‌ను నిర్వహించారు. వివిధ భాగస్వాముల మధ్య సమన్వయాన్ని క్రమబద్ధం చేసేందుకు దీనిని నిర్వహించారు.
ఎంఒహెచ్ఎఫ్‌డబ్ల్యు, కోవిడ్ కార్యదర్శి, హిందుస్తాన్ లాటెక్స్ లిమిటెడ్ (హెచ్ఎల్ఎల్), ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐఆర్‌సిఎస్) వంటి ముఖ్య భాగస్వాములతో సమాచారం ఆటంకాలు లేకుండా చేరవేసేందుకు, కాలయాపనను తగ్గించేందుకు సమాచార లంకెను ఏర్పాటు చేయడం జరిగింది. గిడ్డంగులకు, కస్టమ్స్‌కు సంబంధించిన అంశాలను క్రమబద్ధీకరించేందుకు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ (డిఐఎఎల్), ఎయిర్ ఇండియా ఎస్ఎటిఎస్, ఎయిర్ ఫోర్స్ మూవ్ మెంట్ లైసాన్ యూనిట్‌ల మధ్య సమావేశం నిర్వహించారు.
***
(Release ID: 1717315)
Visitor Counter : 204