సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

క్వారంటైన్ నుండి పనిచేస్తూ, తమ పార్లమెంటరీ నియోజకవర్గం ఉధంపూర్ లో కోవిడ్ నిర్వహణ పరిస్థితిని సమీక్షించిన - కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


ఉధంపూర్, కథువా, రియాసి, రాంబన్, దోడా, కిష్ట్వార్, ఆరు జిల్లాల్లో కోవిడ్ నిర్వహణ పూర్తి నియంత్రణలో ఉందన్న - కేంద్ర మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 08 MAY 2021 5:46PM by PIB Hyderabad

కోవిడ్-19 వ్యాధి సోకిన అనంతరం, ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తరువాత, క్వారంటైన్ లో పనిచేస్తూ, కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు ఆన్‌-లైన్‌ లో తన ఉధంపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో కోవిడ్ నిర్వహణ పరిస్థితిని, సంబంధిత జిల్లా పరిపాలనా అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షించారు.

ఈ సమావేశాన్ని దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించారు. ఎందుకంటే, శ్రీ సింగ్ ఇటీవల కోవిడ్ వ్యాధి సోకి, చికిత్స అనంతరం, ఆయన ఇంకా కోవిడ్ నెగిటివ్ కోసం పరీక్ష చేయించుకోవాల్సి ఉంది.  ఆయన ఇప్పటికీ భౌతికంగా ఎవరితో కలవడం కానీ సంభాషించడం కానీ చేయడం లేదు. 

ఈ సమావేశంలో భాగంగా, తమ లోక్‌ సభ నియోజకవర్గంలోని ఆరు ప్రధాన జిల్లాలైన, ఉధంపూర్, కథువా, రియాసి, రాంబన్, దోడా మరియు కిష్త్వార్ లలో పరిస్థితిని, ఆయన సమీక్షించారు.  ఈ సమావేశంలో పాల్గొన్న వారిలో సంబంధిత డి.డి.సి. చైర్‌-పర్సన్‌ లు, సంబంధిత డిప్యూటీ కమిషనర్లు, సంబంధిత మున్సిపల్ చైర్‌-పర్సన్‌ లు, సీనియర్ పోలీసు సూపరింటెండెంట్లు, చీఫ్ మెడికల్ ఆఫీసర్లు, సంబంధిత ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపాల్స్ ఉన్నారు.   ఈ సమీక్షా సమావేశంలో, ప్రతి జిల్లా, ఒకటి తర్వాత ఒకటిగా, విడివిడిగా, తమ తమ జిల్లాలకు సంబంధించిన పరిస్థితిని వివరించాయి.  

కోవిడ్ కి వ్యతిరేకంగా సమిష్టిగా పోరాడవలసి ఉందని, డాక్టర్ జితేంద్ర సింగ్, ఈ సమావేశంలో, నొక్కి చెప్పారు.  ఆరోగ్యం మరియు పరిపాలనా నిర్వహణ అత్యవసరం అయితే, సమాజం మరియు ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం లేకుండా వాంఛనీయ ఫలితాలను సాధించలేమని ఆయన పేర్కొన్నారు.  సామాజిక ఆందోళన సమస్యలను వ్యక్తిగత మరియు సున్నితమైన విధానంతో పరిష్కరించాల్సిన అవసరాన్ని కూడా, ఆయన నొక్కి చెప్పారు.

ఉదాహరణకు, చికిత్స అనంతరం, కోలుకుని, ఇంటికి వెళ్ళిన వంద మంది ఇతర రోగులతో పోలిస్తే, ఏదైనా ఒక రోగికి ఆక్సిజన్ పడక అవసరమైనప్పుడు, లభించకపోతే, అది సమాజంలో తీవ్ర నిరాశకు గురిచేస్తుంది.

ప్రతి జిల్లాలో, ఎక్కువ సంఖ్యలో టెలిఫోన్ హెల్ప్‌-లైన్‌ లు ఉండాలని, డాక్టర్ జితేంద్ర సింగ్, సూచించారు, అవి శక్తివంతంగా ఉండాలనీ, అవసరమైనవారికి వెంటనే ప్రతిస్పందించడానికి, మార్గనిర్దేశం చేయడానికీ, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలనీ, ఆయన, కోరారు.   ఈ హెల్ప్‌-లైన్‌ లు అమల్లోకి వచ్చాక, వాటి గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని డిప్యూటీ కమిషనర్లందరినీ, ఆయన ఆదేశించారు.  ఎందుకంటే చాలా మంది పేదలు, గందరగోళం, భయాందోళనలతో, పడకలు, లేదా ఆక్సిజన్, లేదా మందుల కోసం వారి అవసరాన్ని సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయడం ప్రారంభిస్తారు. ఇది వారి సమస్యను ఎల్లప్పుడూ పరిష్కరించక పోగా, దీనికి విరుద్ధంగా, సాధారణంగా, వారి భయాందోళనలను, మరింత వ్యాప్తి చేస్తుందని, ఆయన, పేర్కొన్నారు. 

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఆయన, ఆయన కార్యాలయ సిబ్బంది, రోజువారీగా అన్ని జిల్లా పరిపాలన మరియు ప్రజా ప్రతినిధులతో సంప్రదిస్తున్నట్లు, చెప్పారు.  ప్రస్తుతం, కోవిడ్ చికిత్స అనంతరం, ఐసోలేషన్ లో ఉన్నప్పటికీ, అవసరమైతే, తనను సంప్రదించవచ్చునని కూడా, ఆయన, తెలియజేశారు. 

మొత్తం ఆరు జిల్లాల్లో కోవిడ్ నిర్వహణ చాలా నియంత్రణలో ఉందని, సామాజిక స్థాయిలో కూడా ఈ విషయంలో పెద్దగా ఫిర్యాదు లేదని, ఈ సందర్భంగా, అధికారులు, ప్రజాప్రతినిధులు, డాక్టర్ జితేంద్ర సింగ్ కు తెలియజేశారు.  ఈ ఆరు జిల్లాల్లో, మరణాలు లేదా మరణాల రేటు సుమారు 1 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉందని, వారు,  ఆయనకు, చెప్పారు.  కోవిడ్ పాజిటివ్ కేసుల రేటు కూడా ఒక్క ఉధంపూర్ జిల్లా మినహా, మిగిలిన జిల్లాల్లో సుమారు 2.5 శాతం నుండి 3 శాతం వరకు నమోదు కాగా, ఉధంపూర్ లో మాత్రం, పాజిటివ్ కేసుల రేటు అధికంగా నమోదు అయ్యింది.  రాంబన్‌ లో, ఆక్సిజన్ ప్లాంటు త్వరలోనే పనిచేస్తుందనీ, దోడాలోని ఆక్సిజన్ ప్లాంట్ ఇప్పటికే పూర్తయిందనీ, కిష్త్వార్‌లో ఇది త్వరలో దశలో ఉందనీ, సమావేశంలో తెలియజేశారు. 

ఇక,టీకాలు వేసే ప్రక్రియ గురించి, ప్రస్తావిస్తే,ఈ జిల్లాలన్నిటిలో, ఇప్పటివరకు 45 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి మాత్రమే టీకాలు వేస్తున్నట్లు సమాచారం చెప్పారు. దీనిని బట్టి, ఈ ప్రక్రియ సజావుగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.   ఇప్పటివరకు, రాంబన్ లో 80 నుండి 90 శాతం వరకు; కతువా లో  60 శాతం కంటే ఎక్కువగా; కిష్ట్వార్ లో 50 శాతం కంటే ఎక్కువ టీకాలు వేసినట్లు నమోదయ్యింది.  ఈ జిల్లాలన్నింటిలో వెంటిలేటర్ లభ్యత చాలా సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల, ఇంట్యూబేషన్‌ చేపట్టడానికి శిక్షణ పొందిన మానవశక్తి అందుబాటులో లేరు. 

 

<><><>


(రిలీజ్ ఐడి: 1717282) సందర్శకుల సూచీ సంఖ్య : : 193
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi , Tamil