నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

పెద్ద ఎత్తున కోవిడ్ టీకా డ్రైవ్‌ను చేప‌ట్టిన ఎన్‌హెచ్‌పీసీ


- ఎంఓపీ, ఎంఎన్ఆర్ఈ ఉద్యోగుల‌తో పాటు వీటి ఆధ్వ‌ర్యంలోని పీఎస్‌యులు, ఇత‌ర సంస్థ‌ల ఉద్యోగులకు న్యూఢిల్లీలోని ఐఆర్ఈడీఏ వ‌ద్ద కోవిడ్ 19 టీకాలు

Posted On: 08 MAY 2021 9:00AM by PIB Hyderabad

విద్యుత్‌, పున‌రుత్పాద‌క ఇంధ‌నం శాఖ స‌హాయ మంత్రి (స్వ‌తంత్ర హోదా), స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖల‌ స‌హాయ మంత్రి శ్రీ ఆర్.కె. సింగ్ సూచ‌న‌ మేర‌కు ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్ విద్యుత్ మంత్రిత్వశాఖ ఉద్యోగులు, వివిధ పీసీఎస్‌యూలు / ఇత‌ర సంస్థల వారి కోసం కోవిడ్-19 టీకా డ్రైవ్‌ పెద్ద ఎత్తున చేప‌ట్టాయి. ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతంలోని ఉన్న ఉద్యోగుల‌
సౌక‌ర్యార్థం న్యూఢిల్లీలోని ఐఆర్ఈడీఏ వ‌ద్ద కోవిడ్-19 టీకా డ్రైవ్ నిర్వహించారు.
విద్యుత్ రంగ సిబ్బంది భద్రత కోసం టీకా డ్రైవ్ నిర్వహిస్తున్నారు. తద్వారా 24x7 ప్రాతిపదికన నిరంతరాయంగా విద్యుత్ సరఫరా లభించేలా చూడ‌డం ఈ డ్రైవ్ ఉద్దేశం.



https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/PHOTO09VA.jpg



న్యూ ఢిల్లీలోని అపోలో హాస్పిటల్స్ సహకారంతో ఎన్‌హెచ్‌పీసీ 2021 మే 7న న్యూ ఢిల్లీలోని ఐఆర్ఈడీఏ టీకా డ్రైవ్‌ను నిర్వహించింది. డ్రైవ్‌లో భాగంగా ఎంఓపీ,
ఎన్‌హెచ్‌పీసీ, ఐఆర్ఈడీఏ, పీఎఫ్‌సీ, ఎన్ఎస్‌పీసీఎల్‌, ఎన్‌టీపీసీ, సీఈఏతో పాటు ఎంఎన్ఆర్ఈ, ఎన్ఈఈపీసీఓ త‌దిత‌ర సంస్థ‌ల‌కు చెందిన మొత్తం 117 మంది ఉద్యోగులు (18 నుండి 44 సంవత్సరాల మధ్యవారు) డ్రైవ్ సమయంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోస్‌ను పొందారు. ఆయా సంస్థ‌ల‌కు చెందిన మ‌రింత‌ ఎక్కువ మంది ఉద్యోగులు టీకాను పొందేందుకు వీలుగా కోవిడ్ టీకా డ్రైవ్ ఈ రోజు (8 మే 2021) వరకు పొడిగించబడింది.

 

***



(Release ID: 1717120) Visitor Counter : 180