రైల్వే మంత్రిత్వ శాఖ

దేశంలోని వివిధ రాష్ట్రాలకు 185 ట్యాంకర్ల ద్వారా 2960 మె.ట.పైగా ఎల్‌ఎంవో చేర్చిన ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌లు


కోటా చేరుకున్న రాజస్థాన్‌కు కేటాయించిన మొదటి ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌

నాగ్‌పుర్‌ దారిలో ఉన్న మహారాష్ట్రకు కేటాయించిన రెండో రైలు

గమ్యస్థానాలకు చేరిన 47 ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌లు

ఇప్పటివరకు మహారాష్ట్రకు 174 మె.ట., యూపీకి 729, ఎంపీకి 249, హరియాణాకు 305, తెలంగాణకు 123, దిల్లీకి 1334 మె.ట. చేరిక

Posted On: 07 MAY 2021 4:50PM by PIB Hyderabad

అడ్డంకులు దాటుకుంటూ, కొత్త పరిష్కారాలు కనుగొంటూ, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు ద్రవరూప వైద్య ఆక్సిజన్‌ (ఎల్‌ఎంవో)ను అందిస్తూ, ప్రాణదాన ప్రయాణాన్ని రైల్వే శాఖ కొనసాగిస్తోంది.

    ఇప్పటికే, ప్రాణవాయువును తీసుకుని 47 రైళ్లు గమ్యస్థానాలకు చేరాయి.

    రాష్ట్రాలకు వీలైనంత తక్కువ సమయంలో సాధ్యమైనంత ఎక్కువ ఎల్‌ఎంవోను పంపిణీ చేయడానికి రైల్వే శాఖ చేస్తున్న కృషి ఇది.

    ఇప్పటివరకు, మహారాష్ట్రకు 174 మె.ట., యూపీకి 729, ఎంపీకి 249, హరియాణాకు 305, తెలంగాణకు 123, దిల్లీకి 1334 మె.ట.ను రైల్వే శాఖ చేర్చింది.

    ప్రస్తుతం 260 మె.ట.పైగా ఎల్‌ఎంవోతో కూడిన 18 ట్యాంకర్లను మోసుకెళ్తున్న రైళ్లు మహారాష్ట్ర, హరియాణా, దిల్లీ వెళ్లే మార్గంలో ఉన్నాయి. కొత్తగా ఆక్సిజన్‌ తీసుకెళ్లడం చురుగ్గా సాగుతున్న చర్య కాబట్టి గణాంకాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. మరిన్ని ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు ఈ రాత్రి దాటాక ప్రయాణాలు ప్రారంభిస్తాయని భావిస్తున్నారు.

***


(Release ID: 1716939) Visitor Counter : 194