పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
ఆయిల్ అండ్ గ్యాస్ పబ్లిక్ సెక్టార్ కంపెనీలు ఆసుపత్రులలో 100 పిఎస్ఎ మెడికల్ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాయి
Posted On:
06 MAY 2021 5:53PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని చమురు మరియు గ్యాస్ పబ్లిక్ సెక్టార్ కంపెనీలు జాతీయ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ అవసరాలను తీర్చడానికి ఎంతో కృషి చేస్తున్నాయి. పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మార్గదర్శకత్వంలో దేశవ్యాప్తంగా ప్రజారోగ్య సౌకర్యాలలో సుమారు 100 ప్రెజర్ స్వింగ్ యాడ్సర్ప్షన్ (పిఎస్ఎ) మెడికల్ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్, బీహార్, కర్ణాటక, గోవా, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్ మరియు ఢిల్లీల్లో ఆసుపత్రులు ఈ కార్యక్రమంలో ఉన్నాయి. ఈ ప్లాంట్ల మొత్తం ఖర్చును కంపెనీలు వాటి సిఎస్ఆర్ ఫండ్ నుండి భరిస్తాయి.
వివిధ రకాల సామర్థ్యాలలో ఈ పిఎస్ఎ ప్లాంట్లు ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి. 200 నుండి 500 పడకల ఆసుపత్రులకు సేవలు అందిస్తాయి. డిఆర్‌డివో మరియు సిఎస్‌ఐఆర్ అందించిన సాంకేతికతను వీటిలో ఉపయోగిస్తున్నారు. ఈ విధానంలో ఆక్సిజన్‌ను కేంద్రీకరించడానికి పరిసరాల్లోని గాలి నుండి నత్రజనిని గ్రహిస్తారు. ఇలా ఉత్పత్తి చేయబడిన ఆక్సిజన్ ఆసుపత్రిలో చేరిన రోగులకు నేరుగా సరఫరా చేయబడుతుంది. ఈ ప్లాంట్ల కోసం భారతీయ అమ్మకందారులకు ఆర్డర్లు ఇవ్వబడ్డాయి. ఇవి ఈ నెల నుండే పనిచేయడం ప్రారంభిస్తాయి. జూలై నాటికి ఇలాంటి ప్లాంట్లన్నీ అందుబాటులోకి.
****
(Release ID: 1716605)
Visitor Counter : 187