పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
గువాహతి ఎయిర్‌పోర్ట్‌లో కోవిడ్-19 వాక్సినేషన్ శిబిరం
వృద్ధులకు తోడ్పడేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు
Posted On:
05 MAY 2021 4:54PM by PIB Hyderabad
వయోపరిమితి 18 ఆ పైన వయసుగల వారికి కూడా అవకాశమిస్తూ రెండవ కోవిడ్ వాక్సినేషన్ శిబిరాన్ని గువాహతిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బొర్దోలాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (ఎల్‌జిబిఐ)లో నిర్వహించారు. ఈ శిబిరాన్ని 3 మే 2021న ప్రారంభించారు, వాక్సినేషన్ కొనసాగుతోంది.ఇప్పటివరకూ దాదాపు 2000మందికి వాక్సినేషన్ ఇవ్వగా, శుక్రవారంనాడు మరింత మంది ఈ శిబిరంలో వాక్సీన్‌ను తీసుకోనున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్, అస్సాం సహకారంతో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ వాక్సినేషన్ శిబిరాన్ని నిర్వహించింది. ఇది గువాహతి విమానాశ్రయంలో అనేకమంది యువ అధికారులు, సిబ్బందికి తొలి వాక్సిన్. ఈ వాక్సినేషన్ శిబిరం విమానాశ్రయంలో పని చేస్తున్న సిబ్బంది కోసమే అయినా వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు, ఎఎఐ ఉద్యోగులు, ఎయిర్‌లైన్స్, ఏజెన్సీలు, ఫ్రంట్‌లైన్ స్టాఫ్, ఎల్‌జిబిఐ విమానాశ్రయం గువాహతికి సంబంధించిన భాగస్వాములను కూడా అనుమతించారు.
తొలి రోజు వాక్సినేషన్ కోసం దాదాపు 1200 మంది నమోదు చేసుకోగా, తొలిరోజు సాయంత్రానికి సుమారు 600మందికి వాక్సిన్ ఇచ్చారు.
వాక్సినేషన్ శిబిరాన్ని గురించిన సమాచారాన్ని ఇస్తూ, అన్ని శాఖల అధిపతులు, ఎయిర్‌లైన్స్, విమానాల రాకపోకలకు సౌకర్యాలు కల్పించే గ్రౌండ్ హాండ్లింగ్ ఏజెన్సీలు, ఫ్రంట్‌లైన్ కార్మికులు, ఎయిర్‌పోర్ట్‌లో భాగస్వాములు ఈ వాక్సినేషన్ శిబిరం నుంచి గరిష్ఠ లబ్ధిని పొందేలా తమ దిగువన ఉన్న సిబ్బందికి తెలియచేయవలసిందిగా కోరినట్టు ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ రమేష్ కుమార్ తెలిపారు. ఈ శిబిరంలో 18+ ఆ పై వయసు కలిగిన వారందరికీ కూడా వాక్సిన్ ఇచ్చేందుకు ద్వారాలు తెరవడంతో అనుకున్నదానికన్నా ఎక్కువ సంఖ్య నమోదు అయిందన్నారు.
ఈసారి దాదాపు 3000మందికి పైగా వ్యక్తులు నమోదు చేసుకున్నట్టు శిబిరాన్ని సమన్వయం చేస్తున్న అధికారులు తెలిపారు. వీరిలో ఇప్పటికే పదవీవిరమణ చేసిన వృద్ధులు, వారిపై ఆధారపడినవారు కూడా ఉన్నారన్నారు. నమోదు చేసుకున్నవారి సంఖ్య అధికంగా ఉండడంతో, వాక్సినేషన్ చేసే ప్రదేశాన్ని ఎఎఐ రెసిడెన్షియల్ కాలనీలోని కమ్యూనిటీ సెంటర్‌లో పెట్టారు. ఈ ప్రదేశంలో ఆరోగ్య ప్రోటోకాళ్ళను నిర్వహించే అవకాశాన్ని కల్పించే పెద్ద హాల్ ఉంది.
కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ తాము వాక్సినేషన్ వేయించుకునేందుకు ఉన్నత లక్ష్యం, అంకితభావంతో తోడ్పడిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రాష్ట్ర ఆరోగ్య అధికారులు, ఎన్‌హెచ్ఎం సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని రమేష్ కుమార్ చెప్పారు.
ప్రక్రియను క్రమబద్ధం చేయడానికి, వృద్ధులకు సాయం చేయడానికి ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. అనునిత్యం విధులు నిర్వర్తిస్తున్న, షిఫ్టుల్లో పనిచేస్తున్న ఫ్రంట్‌లైన్ వర్కర్లకు, ఎయిర్‌లైన సిబ్బందికి ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది.
ఇంతకుముందు, ఎల్‌జిబిఐ విమానాశ్రయం, గువాహతిలో 45 ఏళ్ళు వయసు పైబడిన పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు, ఎయిర్‌లైన్స్ గ్రౌండ్ హాండ్లింగ్ ఏజెన్సీలు/ అధికారులకు 11 ఏప్రిల్ 2021న వాక్సినేషన్ శిబిరాన్ని నిర్వహించారు.
***
(Release ID: 1716551)
Visitor Counter : 176