ప్రధాన మంత్రి కార్యాలయం
భారత-యూకే వర్చువల్ శిఖర సమ్మేళనం
Posted On:
04 MAY 2021 6:39PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, యునైటెడ్ కింగ్ డమ్ ప్రధాని మాన్య శ్రీ బోరిస్ జాన్ సన్ లు మంగళవారం ఒక వర్చువల్ శిఖర సమ్మేళనం లో పాల్గొన్నారు.
భారతదేశానికి, యునైటెడ్ కింగ్‌డమ్ కు మధ్య దీర్ఘ కాలం నుంచి మైత్రిపూర్ణ సంబంధాలు ఉన్నాయి. ఈ రెండు దేశాలు ప్రజాస్వామ్యం, మౌలిక స్వతంత్రత, చట్టబద్ధ పాలన, బలమైన పరస్పర పూరకాలు, నిరంతరం పెరుగుతున్న సామంజస్యం ల పట్ల వాటి నిబద్ధత పై ఆధారపడినటువంటి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఇచ్చి పుచ్చుకొంటున్నాయి.
‘ద్వైపాక్షిక సంబంధాల’ స్థాయి ని పెంచుకొని దానిని ‘విస్తృత వ్యూహాత్మక భాగస్వామ్య’ రూపాన్ని ఇవ్వాలనే ఉద్దేశ్యం తో శిఖర సమ్మేళనం లో ఓ మహత్వాకాంక్షయుతమైనటువంటి ‘రోడ్ మేప్ 2030’ని ఆమోదించడం జరిగింది. ఈ మార్గ సూచీ రానున్న పది సంవత్సరాల లో రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు, వ్యాపారం- ఆర్థిక వ్యవస్థ, రక్షణ- భద్రత, జలవాయు సంబంధి కార్యాచరణ, ఆరోగ్యం వంటి ముఖ్య రంగాల లో లోతైన, బలమైన బంధానికి బాట ను పరుస్తుంది.
కోవిడ్-19 ప్రస్తుత స్థితి తో పాటు టీకా మందు కు సంబంధించి విజయవంతంగా సాగుతున్న భాగస్వామ్యం సహా మహమ్మారి కి వ్యతిరేకం గా జరుగుతున్న యుద్ధం లో రెండు దేశాల మధ్య సహకారాన్ని గురించి నేత లు ఇద్దరూ చర్చించారు. భారతదేశం లో కోవిడ్-19 తాలూకు అత్యంత తీవ్ర సంక్రమణ గల రెండో దశ ను దృష్టి లో పెట్టుకొని యునైటెడ్ కింగ్ డమ్ త్వరిత చికిత్స సంబంధి సహాయాన్ని అందించినందుకు ప్రధాని శ్రీ బోరిస్ జాన్ సన్ కు ప్రధాన మంత్రి మోదీ ధన్యవాదాలు పలికారు. కిందటి సంవత్సరం లో యునైటెడ్ కింగ్ డమ్ కు, ఇతర దేశాలకు సమకూర్చిన సహాయం లో భారతదేశం కీలక పాత్ర ను పోషించడాన్ని ప్రధాని శ్రీ జాన్ సన్ ప్రశంసించారు. ఈ సహాయం లో భాగం గా ఫార్మాస్యూటికల్స్ ను, టీకా మందు ను కూడా సరఫరా చేయడం జరిగింది.
ప్రపంచం లో 5వ, 6వ స్థానాల లో ఉన్నటువంటి అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వ్యాపార అవకాశాల పెంపుదలే ధ్యేయం గా ‘‘ఉన్నత వ్యాపార భాగస్వామ్యం’’ (ఇటిపి) కి ఇద్దరు ప్రధానమంత్రులూ శ్రీకారం చుట్టారు. ఈ మేరకు 2030 కల్లా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపునకు మించి పెంచుకోవాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని పెట్టుకొన్నారు. ఇటిపి లో భాగం గా సమగ్రమైనటువంటి, సమతుల్యమైనటువంటి స్వేచ్ఛా వ్యాపార ఒప్పందం (ఎఫ్ టిఎ) కుదుర్చుకోవడం పై చర్చల కు సంబంధించిన మార్గ సూచీ పైన భారతదేశం, యూకే లు అంగీకారానికి వచ్చాయి. ఇందులో భాగం గా ఆరంభ ప్రయోజనాల ను ఇవ్వగల మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడాన్ని పరిగణన లోకి తీసుకోవాలని నిర్ణయించడమైంది. భారతదేశం, యుకె ల మధ్య ఇటిపి భాగస్వామ్యం ద్వారా రెండు దేశాల లో వేల కొద్దీ ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు, పరోక్ష ఉపాధి అవకాశాల కల్పన సాధ్యపడనుంది.
పరిశోధన లు- నూతన ఆవిష్కరణ ల సంబంధిత సహకారం లో భారతదేశానికి యునైటెడ్ కింగ్ డమ్ రెండో అతి పెద్ద భాగస్వామి గా ఉంది. ఈ నేపథ్యం లో ఇండియా-యుకె వర్చువల్ సమిట్ లో సరికొత్త ‘‘అంతర్జాతీయ నూతన ఆవిష్కరణ ల భాగస్వామ్యం’’పై సంయుక్త ప్రకటన వెలువడింది. ఆఫ్రికా సహా ఎంపిక చేసిన వర్ధమాన దేశాల కు భారత సార్వజనీన ఆవిష్కరణ ల బదిలీ కి మద్దతునివ్వడం ఈ భాగస్వామ్యం లక్ష్యం గా ఉంది. ఈ మేరకు నవ్య, ప్రగతిశీల సాంకేతిక పరిజ్ఞానాలు, డిజిటల్, ఐసిటి ఉత్పత్తులు తదితరాలలో సహకారాన్ని పెంపొందింపచేసుకొనేందుకు, సరఫరా కార్యకలాపాల ప్రతిరోధకత వృద్ధి కి కృషి చేసేందుకు ఉభయపక్షాలు సమ్మతించాయి. సముద్ర భ్రదత, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, సైబర్ స్పేస్ రంగం సహా రక్షణ- భద్రత రంగాల లో సంబంధాల ను పటిష్టపరచుకోవడం పైన సైతం ఉభయ పక్షాలు అంగీకారానికి వచ్చాయి.
ఇండో-పసిఫిక్, జి-7 కూటముల మధ్య సహకారం సహా పరస్పర ప్రయోజనాల తో ముడిపడ్డ ప్రాంతీయ అంశాలపై, అంతర్జాతీయ అంశాలపై ప్రధానమంత్రులు ఇద్దరూ వారి వారి అభిప్రాయాలను ఒకరి కి మరొకరు వెల్లడించుకొన్నారు. పారిస్ ఒప్పందం లక్ష్యాల ను సాధించడానికి గాను జలవాయు కార్యాచరణ పట్ల తమ తమ నిబద్ధత ను పునరుద్ఘాటించారు. అలాగే ఈ సంవత్సరం ఉత్తరార్థం లో యుకె నిర్వహించనున్న ‘సిఒపి-26’ కంటే ముందుగా పరస్పరం సన్నిహితం గా వ్యవహరించాలనే అంశం పై కూడా వారు అంగీకారానికి వచ్చారు.
భారతదేశం- యుకె లు ‘ప్రవాసం- రాకపోకల కు సంబంధించి ఒక విస్తృత భాగస్వామ్యాని’కి శుభారంభం చేశాయి. దీనివల్ల ఇరు దేశాల మధ్య విద్యార్థులు, వృత్తినిపుణుల రాక పోకల కోసం మరిన్ని అధిక అవకాశాలు అందుబాటు లోకి రాగలవు.
పరిస్థితులు కుదుటపడిన తరువాత ప్రధాని శ్రీ జాన్ సన్ కు వీలయినప్పుడు భారతదేశానికి ఆయన తరలి వస్తే, ఆయన కు స్వాగతం పలకాలని ఉందంటూ ప్రధాన మంత్రి శ్రీ మోదీ తన అభిలాష ను వెల్లడించారు. ప్రధాని శ్రీ జాన్ సన్ కూడా జి-7 శిఖర సమ్మేళనానికి హాజరు అయ్యేందుకు యునైటెడ్ కింగ్ డమ్ కు రావలసింది గా ప్రధాన మంత్రి శ్రీ మోదీ ని తాను ఇదివరకు ఆహ్వానం సంగతి ని మరో మారు ప్రస్తావించారు.
***
(Release ID: 1716044)
Visitor Counter : 288
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam