పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ

స్వమిత్ర పథకం అమలు కోసం శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ కొత్త ముసాయిదా ప్రణాళికను విడుదల చేశారు


7400 కి పైగా గ్రామాల్లో ఆస్తి కార్డులు పంపిణీ చేయబడ్డాయి; ఈ పథకం ద్వారా 7,00,000 మందికి పైగా ప్రయోజనం పొందారు

మహమ్మారి ఉన్నప్పటికీ వివిధ వాటాదారులు మరియు సమాజం అందించిన మద్దతును శ్రీ తోమర్ ప్రశంసించారు

Posted On: 04 MAY 2021 6:47PM by PIB Hyderabad

స్వమిత్ర పథకం దేశవ్యాప్తంగా అమలు చేయడానికి గుర్తుగా కాఫీ టేబుల్ బుక్ (సిటిబి)తో పాటు పథకం  అమలు కోసం కొత్త ముసాయిదాను కేంద్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి  శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి వర్చువల్‌ సమావేశంలో రాష్ట్రాలు మరియు ఇతర వాటాదారులను ఉద్దేశించి ప్రసంగించారు.

 

 
 


పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన స్వమిత్ర ముసాయిదా ఈ పథకం లక్ష్యాలు, విస్తృతి, వివిధ భాగాలు, సంవత్సర వారీగా నిధుల సరళి, సర్వే విధానం మరియు పద్దతి, పాల్గొన్న వాటాదారులు మరియు వారి పాత్రలు, బాధ్యత, పర్యవేక్షణ, మూల్యాంకనం, పంపిణీపై వివిధ రాష్ట్రాలకు వివరణాత్మక రోడ్‌మ్యాప్ మరియు మార్గదర్శకాలను అందిస్తుంది.

స్వమిత్ర పథకంపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ ఈ పథకం అమలులో పాల్గొన్న వివిధ వాటాదారుల యొక్క విస్తారమైన ప్రయత్నాలను, కోర్సులో ఉద్భవించిన అభ్యాసాలు మరియు ఉత్తమ పద్ధతులు, వివిధ సవాళ్లు మరియు విజయ కథల సంగ్రహావలోకనం మరియు ముందుకు సాగడానికి చేసిన  ఒక ప్రయత్నం.

7400 కి పైగా గ్రామాల్లో ఆస్తి కార్డులు పంపిణీ చేశామని, దేశవ్యాప్తంగా ఈ పథకం ద్వారా 7,00,000 మందికి పైగా లబ్ధిదారులు ప్రయోజనం పొందారని మంత్రి చెప్పారు. గ్రామీణ ప్రజలు రుణాలు తీసుకోవటానికి మరియు గ్రామీణ ప్రణాళిక కోసం ఖచ్చితమైన భూ రికార్డులను రూపొందించడానికి ఉపయోగపడే ఆస్తి కార్డులను అందించడం ద్వారా  ఈ పథకం వారికి ప్రయోజనం చేకూరుస్తుంది.

మహమ్మారి ఉన్నప్పటికీ  ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి వివిధ వాటాదారులు మరియు సమాజం అందించిన సహకారాన్ని శ్రీ తోమర్ ప్రశంసించారు. మరోవైపు ఈ పథకం యొక్క ప్రయోజనాలను లబ్ధిదారులు పొందడం ప్రారంభించారు. చాలా మంది ఇళ్ళు నిర్మించడానికి లేదా వ్యాపారాలను విస్తరించడానికి బ్యాంకు రుణాలు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలను పొందారు.

ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా  అన్ని రాష్ట్రాలు / యుటిల - రెవెన్యూ మరియు పంచాయతీ రాజ్ కార్యదర్శులు, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డిఎస్టి), పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (మోకా), సర్వే ఆఫ్ ఇండియా (సోఐ), భూ వనరుల శాఖ (డిఓఎల్ఆర్) , రక్షణ మంత్రిత్వ శాఖ (ఎంవోడి) మరియు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ)నుండి అధికారులు పాల్గొన్నారు.

 

  



నేపథ్యం:

9 రాష్ట్రాల్లో ఈ పథకం పైలట్ దశ విజయవంతంగా పూర్తయిన తరువాత 2021 ఏప్రిల్ 24 న జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ యొక్క కేంద్ర రంగ పథకం అయిన స్వమిత్రను గౌరవనీయ ప్రధానమంత్రి ప్రారంభించారు. 5 సెంటీమీటర్ల మ్యాపింగ్ ఖచ్చితత్వాన్ని అందించే డ్రోన్ సర్వే మరియు సివోఆర్ఎస్ నెట్‌వర్క్‌లను ఉపయోగించడం ద్వారా భారతదేశంలోని గ్రామీణ నివాస ప్రాంతాల నివాసితులకు ఆస్తి హక్కులను అందించాలని స్వమిత్ర పథకం లక్ష్యంగా పెట్టుకుంది.

స్వమిత్ర పథకం అమలులో  నోడల్ మంత్రిత్వ శాఖగా పంచాయతీ రాజ్ (ఎంవోపిఆర్) వ్యవహరిస్తోంది. రాష్ట్రాల్లో రెవెన్యూ విభాగం / ల్యాండ్ రికార్డ్స్ విభాగం నోడల్ విభాగం మరియు రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగాల సహకారంతో ఈ పథకాన్ని నిర్వహిస్తుంది.


 

 

*****



(Release ID: 1716008) Visitor Counter : 188