ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్ పాండమిక్ రిలీఫ్ మెటీరియల్ సమర్దవంతమైన కేటాయింపు మరియు పంపిణీలో కేంద్ర ప్రభుత్వం సమయాన్ని వృథా చేయలేదు


విదేశీ కొవిడ్ ఉపశమన మరియు సహాయక సామగ్రిని సమర్థవంతంగా కేటాయించడం మరియు సమన్వయం చేయడం కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని కోఆర్డినేషన్ సెల్ 2021 ఏప్రిల్ 26 నుండి పనిచేయడం ప్రారంభించింది.

प्रविष्टि तिथि: 04 MAY 2021 5:34PM by PIB Hyderabad

కోవిడ్ -19 సాయానికి చెందిన మొదటి సరుకు 2021 ఏప్రిల్ 25 న భారతదేశానికి చేరుకోగా ప్రాణాలను రక్షించే ఈ  వైద్య సామాగ్రిని పంపిణీ చేసే ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపి) ను రూపొందించడానికి కేంద్రానికి ఏడు రోజుల సమయం పట్టిందని ఇండియా టుడే తన వార్తా కథనంలో ఆరోపించింది.

ఆ కథనం వాస్తవిక సమాచారాన్ని తప్పుగా అర్థం చేసుకుంది మరియు పూర్తిగా తప్పుదారి పట్టించింది.

కేటాయింపుల కోసం ప్రామాణిక ఆపరేటింగ్ విధానం 2021 మే 2 న ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేయగా ప్రపంచ మహమ్మారిపై పోరాడటానికి భారతదేశ ప్రయత్నాలకు ప్రపంచ సమాజం మద్దతు ఇవ్వడం ప్రారంభించింది. ఆ వెంటనే కేంద్ర మరియు ఇతర ఆరోగ్య సంస్థల ద్వారా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయింపు మరియు పంపిణీ కోసం పనులు ప్రారంభమయ్యాయి.

అదనపు కార్యదర్శి (హెల్త్) ఆధ్వర్యంలో  2021 ఏప్రిల్ 26 న ఆరోగ్య మంత్రిత్వ శాఖలో కొఆర్డినేషన్ సెల్ ఏర్పాటు చేయబడింది. తక్షణమే తన పనిని ప్రారంభించింది. వివిధ వాటాదారుల మధ్య సత్వర మరియు సమర్థవంతమైన సమన్వయం కోసం ఇంటర్ మినిస్టీరియల్ సెల్, విద్యా మంత్రిత్వ శాఖ నుండి డిప్యూటేషన్పై ఒక జాయింట్ సెక్రటరీ, ఎంఈఎ నుండి ఇద్దరు అదనపు కార్యదర్శి స్థాయి అధికారులు, చీఫ్ కమిషనర్ కస్టమ్స్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుండి ఆర్థిక సలహాదారు, సాంకేతిక సలహాదారు డిటి. జిహెచ్‌ఎస్, హెచ్‌ఎల్‌ఎల్ ప్రతినిధులు, ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఇద్దరు జాయింట్ సెక్రటరీలు, సెక్రటరీ జనరల్‌తో పాటు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (ఐఆర్‌సిఎస్) కు చెందిన మరో ప్రతినిధులు ఉన్నారు.

పై వాస్తవిక సమాచారం దృష్ట్యా, ఇండియా టుడే వారు పబ్లిక్ డొమైన్‌లో తప్పుడు వార్తలను ప్రచురించవద్దని మరియు వారి స్వంత కథనానికి అనుగుణంగా వాస్తవాలను తప్పుగా అర్థం చేసుకోవద్దని సలహా ఇవ్వబడుతోంది.

***


(रिलीज़ आईडी: 1715970) आगंतुक पटल : 229
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Punjabi , Tamil