ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆసియా అబివృద్ధి బ్యాంకు వార్షిక సమావేశం 2021 లో భాగంగా గవర్నర్ల సదస్సులో పాల్గొన్న ఆర్థిక మంత్రి శ్రీ మతి నిర్మలా సీతారామన్
Posted On:
03 MAY 2021 8:52PM by PIB Hyderabad
కేంద్ర ఆర్దిక , కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఎడిబి) ఇండియా గవర్నర్ నిర్మలా సీతారామన్ ఈరోజు ఉజ్వల భవిష్యత్‌కు సహకారానికి సంబంధించిన సదస్సులో పాల్గొన్నారు.ఎడిబి వార్షిక సమావేశం 2021లో భాగంగా ఈ సదస్సు జరిగింది. ఈ సదస్సులో జపాన్, జార్జియా, చైనా, ఫిలిప్పీన్స్, నెదర్లాండ్స్ పాల్గొన్నాయి. వర్చువల్ విధానంలో జరిగిన ఈ సమావేశంలో ఎడిబికి చెందిన 68 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
కోవిడ్ -19 మహమ్మారిపై అకుంఠితదీక్షతో పోరాటం చేస్తున్నభారత ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఆమె అభినందనలు , కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత కరోనా మహమ్మారి వల్ల తలెత్తిన సంక్షోభం నుంచి కోలుకోవడానికి గల అవకాశాలకు సంబంధించి ఆమె తన అభిప్రాయాలను తెలియజేస్తూ, ఇండియా సార్క్ కోవిడ్ -19 అత్యవసర నిధిని ఏర్పాటు చేయడంతో పాటు ఈ దిశగా పలు చర్యలు తీసుకోవడంలో ఇండియా ముందు వరుసలో ఉన్నదన్నారు. అలాగే కోవిడ్ -10 టూల్స్ యాక్సిలరేటర్ ( ఎసిటి-ఎ), కోవాక్స్ కు చొరవ చూపిందన్నారు. అంతర్జాతీయ సౌర కూటమి ( ఐఎస్ ఎ), పారిస్ ఒప్పంద లక్ష్యాలు , భాగస్వామ్యం ద్వారా అంతర్జాతీయ సానుకూల వాతావరణ కార్యాచరణను చేపట్టవచ్చో ఒక ఉదాహరణగా నిలిచాయన్నారు.
మొత్తంమీద తిరిగి ఆర్ధిక వ్యవస్థ విజయవంతంగా కోలుకోవడానికి ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా విస్తృత సహకారం అవసరమని అన్నారు. కోవిడ్ -19 పై పోరాటానికి సంబంధించి అన్ని రకాల ఉపకరణాలైన డయాగ్నస్టిక్, చికిత్స, వాక్సిన్‌లు లేదా సాంకేతికత లను అంతర్జాతీయంగా ఇచ్చిపుచ్చుకోవలసి ఉంది. ఇండియా వాక్సిన్ తయారీ సామమర్ధ్యాన్ని మరింత పెంచేందుకు కీలక ముడి పదార్దాలు, అత్యవసరాలను ఇండియాకు అందుబాటులో ఉంచాల్సిన అవసరాన్ని అమె తెలియజేశారు.
ప్రగతి సాధనకు ప్రైవేట్ రంగం , పౌర సమాజం భాగస్వామ్యం కావలసిన అవసరాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. భారతీయ వాక్సిన్ అభివృద్ధి దారులు సహకరించి ప్రభుత్వానికి సహేతుక ధరకు వాక్సిన్ ను అందించారని ఆమె అన్నారు. ప్రైవేటు సంస్తలు కూడా కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద తమ వంతు తోడ్పడుతున్నాయి. భారత ప్రభుత్వ విధానాలు ఎం.ఎస్.ఎం.ఇలకు మద్దతు , ఆర్ధిక వ్యవస్థ తిరిగి కోలుకునేందుకు భారత ప్రభుత్వం తీసుకున్న విధానాలు ఎంతగానో ప్రగతికి దోహదపడనున్నాయి.
దృఢమైన, నిరంతర ప్రగతికి సంబంధించిన సహకారానికి బహుళ పక్ష సంస్థలు డిజిటల్ ఆస్తులు, ప్రకృతి విపత్తులను తట్టుకునే ఆస్థులను రూపోందించడంలో తమవంతు పాత్ర వహించడం అవసరం. ఇందుకు మానవ అభివృద్ధిన ప్రాధాన్యతగా తీసుకోవాల్సి ఉంటుంది.ప్రాంతీయ, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించేందుకు ఇండియా కట్టుబడి ఉందని ఆమె అన్నారు.
కోవిడ్ , నాన్ కోవిడ్ ప్రాజెక్టులకు సకాలంలో ఆర్ధిక సహాయాన్ని అందించినందుకు ఎడిబిని శ్రీమతి సీతారామన్ అభినందించారు. ఆసియా, పసిఫిక్‌లో ఆరోగ్య రంగం ఉద్దీపనపై మరింత దృష్టి పెట్టాల్సి ఉందని, ఇందుకు సంబంధించి ఎడిబి సమగ్ర పరిష్కారాలను రూపొందించాలని అన్నారు.
***
(Release ID: 1715832)