ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఈశాన్య రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ఎండివోఎన్‌ఈఆర్‌ ఏర్పాట్లు: డాక్టర్ జితేంద్ర సింగ్


కొవిడ్ సంబంధిత మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అదనపు ఫండ్ అందుబాటులో ఉంది

Posted On: 03 MAY 2021 6:18PM by PIB Hyderabad

ఈశాన్య ప్రాంత అభివృద్ధి (డోనెర్), ఎంవోఎస్‌ పిఎంఓ, సిబ్బంది, ప్రజా మనోవేదనలు, పెన్షన్లు, అణుశక్తి మరియు అంతరిక్ష అభివృద్ధి  కేంద్ర మంత్రి (స్వతంత్ర ఛార్జ్) డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు మాట్లాడుతూ..డోనర్ మంత్రిత్వ శాఖ అనుబంధ మరియు అభివృద్ధిలో చురుకైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అన్ని ఈశాన్య రాష్ట్రాల్లోని ఆక్సిజన్ ప్లాంట్లతో సహా కొవిడ్ సంబంధిత మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని ఈ రోజు జరిగిన సమీక్షా సమావేశంలో తెలిపారు. మంత్రిత్వ శాఖ అందించిన ఆర్థిక సహాయంతో అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ లో ఒక ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల మారుమూల మరియు సుదూర ప్రాంతాలలో మరెన్నో ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 5 కోట్ల రూపాయల వ్యయంతో ఐదు మొబైల్ ఆక్సిజన్ వ్యాన్ల కోసం అరుణాచల్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కూడా మంత్రిత్వ శాఖ చురుకుగా పరిశీలిస్తోంది.

కోవిడ్ -19 వ్యాప్తికి వ్యతిరేకంగా పోరాడటానికి గ్యాప్ ఫండింగ్ కోసం గత మార్చిలో ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన రూ .25 కోట్ల యునైటెడ్ ఫండ్ సమర్థవంతంగా అనేక ఆసుపత్రులలో కీలకమైన ఆరోగ్య పరికరాల కొనుగోలుకు వరంగా మారిందని డాక్టర్ జితేంద్ర సింగ్ సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఆక్సిజన్ కొరత లేదని, గత ఏడాది సకాలంలో సరఫరా చేయడం వల్ల వాటిలో కొన్ని మిగులు నిల్వలు ఉన్నాయని ఆయన అన్నారు.

లాక్డౌన్ -1 ప్రారంభంలో నార్త్ ఈస్టర్న్ రీజియన్ అభివృద్ధి మంత్రిత్వ శాఖ (డోనెర్) ముందస్తుగా రూ .25 కోట్ల మొత్తాన్ని అందుబాటులో ఉంచినట్టు డోనర్ మంత్రి గుర్తు చేశారు. సమర్ధవంతమైన సన్నాహక చర్యల కారణంగా ఆ సమయంలో ఈశాన్య రాష్ట్రాలు కరోనా రహితంగా ఉన్నాయన్నారు. సిక్కిం మరియు మణిపూర్ వంటి అనేక రాష్ట్రాలు ఆ సమయంలో పూర్తిగా కరోనా రహితంగా ఉన్నాయి. నార్త్ ఈస్టర్న్ రీజియన్ అభివృద్ధి మంత్రిత్వ శాఖ (డోనెర్), మౌలిక సదుపాయాల పనులను చేపట్టడంతో పాటు, ఏదైనా ప్రకృతి లేదా అసహజ విపత్తు సంభవించినప్పుడు ఈశాన్య రాష్ట్రాల సహాయానికి కూడా సహకరిస్తుంది. గత సంవత్సరం అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్లలో సంభవించిన భూకంపాన్ని ఆయన ఉదహరించారు. మంత్రిత్వ శాఖ అధికారులు చాలా మంది కొవిడ్ బారిన పడి ఆస్పత్రిలో చేరారని తెలిపారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి డోనెర్ మంత్రిత్వ శాఖ యొక్క 100 శాతం బడ్జెట్ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ముందుగానే ఖర్చు చేయబడిందని తెలిసి మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

2020 మార్చిలో లాక్‌డౌన్ ప్రకటించిన వెంటనే, అవసరమైన సామాగ్రిని తీసుకెళ్లే ఎయిర్ కార్గో విమానాలు ఈశాన్య ప్రాంతంతో పాటు జమ్మూ & కాశ్మీర్ మరియు లడఖ్ వంటిపాలిత ప్రాంతాలు, ద్వీప భూభాగాలతో సహా సుదూర ప్రాంతాలకు అందించేందుకు ప్రాముఖ్యత ఇచ్చేందుకు ప్రధాని శ్రీ నరేంద్రమోదీ చొరవ తీసుకున్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తు చేసుకున్నారు.  ఈసారి కూడా ఈశాన్య రాష్ట్రాలకు ప్రాధాన్యత ప్రాతిపదికన సహాయం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

ఏ అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని ఈశాన్య రాష్ట్రాలతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నామని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఇటీవల అస్సాంలో భూకంపం సంభవించిన  సందర్భంగా మంత్రిత్వ శాఖ పెద్ద ఎత్తున సమన్వయ కార్యకలాపాలను చేపట్టిందని మంత్రి చెప్పారు.



 

<><><>



(Release ID: 1715829) Visitor Counter : 126