రక్షణ మంత్రిత్వ శాఖ
ఆపరేషన్ సముద్ర సేతు– II కోసం ఏడు భారత నేవీ షిప్స్ మోహరింపు
Posted On:
01 MAY 2021 4:42PM by PIB Hyderabad
కోవిడ్ -19 కు వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటానికి మద్దతుగా చేపట్టిన ఆపరేషన్ 'సముద్ర సేతు–II' లో కోసం భారతీయ నావికాదళం ఏడు ఓడలను మోహరించింది. వివిధ దేశాల నుండి ద్రవ వైద్య ఆక్సిజన్తో నిండిన క్రయోజెనిక్ కంటైనర్లు, అనుబంధ వైద్య పరికరాల రవాణా కోసం కోల్‌కతా, కొచ్చి, తల్వార్, తబార్, త్రిఖండ్, జలశ్వా ఐరావత్ నౌకలను రంగంలోకి దింపింది. పెర్షియన్ గల్ఫ్‌లో మోహరించిన ఐఎన్ఎస్ కోల్‌కతా ఐఎన్ఎస్ తల్వార్ మిషన్ను గత నెల ఏప్రిల్ 30 న బహ్రెయిన్‌లోని మనామా నౌకాశ్రయంలోకి మళ్లించారు. ఐఎన్ఎస్ తల్వార్, 40 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఓ) తో బయలుదేరింది. ఐఎన్ఎస్ కోల్‌కతా నౌక వైద్య సామాగ్రిని తీసుకురావడానికి ఖతార్‌లోని దోహాకు వెళ్లింది. తరువాత లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులను తేవడానికి కువైట్ వెళ్తుంది. తూర్పు సముద్రతీరంలో, ఐఎన్ఎస్ ఐరావత్ ను ఇదే పనుల కోసం మళ్లించారు. గత సంవత్సరం ఆప్ సముద్ర సేతు సందర్భంగా కీలక పాత్ర పోషించిన ఎల్పిడి ఐఎన్ఎస్ జలాశ్వను మెయింటెనెన్స్ నుంచి తొలగించి వైద్యసేవల కోసం సిద్ధంగా ఉంచారు. లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులను తీసుకురావడానికి ఐఎన్ఎస్ ఐరావత్ సింగపూర్‌లోకి ప్రవేశించనుంది. ఐఎన్ఎస్ జలాశ్వను ఈ ప్రాంతంలో వైద్యపరికరాల రవాణా కోసం సిద్ధం చేసి ఉంచారు. కొచ్చి, త్రిఖండ్, తబర్ తో కూడిన సెకండ్ బ్యాచ్ నౌకలను అరేబియా సముద్రంలోకి మళ్లించి ఆపరేషన్ సముద్రసేతు కోసం సిద్ధంగా ఉంచారు. సదరన్ నావల్ కమాండ్ నుంచి లాండింగ్ షిప్ ట్యాంక్ ఐఎన్ఎస్ శార్దూల్ 48 గంటల్లో ఆపరేషన్స్లో పాల్గొంటుంది. కరోనాకు వ్యతిరేకంగా దేశ మరింత పోరాటం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు అదనంగా నౌకలను మోహరించడానికి భారత నావికాదళానికి సామర్ధ్యం ఉంది. ఓడలన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఏదైనా ఆకస్మిక పరిస్థితి ఎదురైతే రంగంలోకి దిగుతాయి. ఆపరేషన్ సముద్ర సేతును గత సంవత్సరం నావికాదళం ప్రారంభించింది. కరోనా వల్ల పొరుగు దేశాలలో చిక్కుకున్న 4000 మంది భారతీయ పౌరులను విజయవంతంగా స్వదేశానికి తీసుకొచ్చింది.
***
(Release ID: 1715495)
Visitor Counter : 199