ఆర్థిక మంత్రిత్వ శాఖ
తీవ్రమైన మహమ్మారి నేపథ్యంలో, కొన్ని చట్ట ప్రకారం దాఖలు చేయవలసిన పత్రాల గడువు తేదీలను పొడిగించిన - ప్రభుత్వం
Posted On:
01 MAY 2021 1:19PM by PIB Hyderabad
తీవ్రమైన కోవిడ్ -19 మహమ్మారి కారణంగా తలెత్తుతున్న ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా, అదేవిధంగా, చట్ట ప్రకారం దాఖలు చేయవలసిన కొన్ని పత్రాల గడువు తేదీలను సడలించమని కోరుతూ, దేశవ్యాప్తంగా ఉన్న పన్ను చెల్లింపుదారులు, పన్ను కన్సల్టెంట్లతో పాటు, ఇతర భాగస్వాముల నుండి వచ్చిన అనేక అభ్యర్థనల మేరకు, ప్రభుత్వం ఈ రోజు కొన్ని గడువు తేదీలను పొడిగించింది.
అనేక విజ్ఞప్తులు అందుకున్న నేపథ్యంలో, వివిధ భాగస్వాములు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించడం కోసం, ఆదాయ పన్ను చట్టం, 1961 (చట్టం) లోని సెక్షన్ 119 ప్రకారం, పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసే వివిధ పత్రాల దాఖలు విషయంలో, కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సి.బి.డి.టి), ఈ క్రింది సడలింపులను ప్రకటించింది:
ఏ) చట్టం యొక్క XX అధ్యాయం క్రింద కమిషనర్ (అప్పీల్స్) కు అప్పీల్ చేయడం కోసం - ఆ సెక్షన్ కింద దాఖలు చేసే చివరి తేదీ 2021 ఏప్రిల్, 1 లేదా ఆ తరువాత, ఆ సెక్షన్ కింద అందించిన సమయం లోపు లేదా 2021, మే, 31వ తేదీ, ఈ రెండింటిలో ఏది తర్వాత వస్తుందో ఆతేదీ నాటికి దాఖలు చేయవచ్చు;
బి) చట్టం యొక్క సెక్షన్ 144 సి కింద వివాద పరిష్కార ప్యానెల్ (డి.ఆర్.పి) కు అభ్యంతరాలు తెలియజేయడం కోసం - ఆ సెక్షన్ కింద దాఖలు చేసే చివరి తేదీ 2021 ఏప్రిల్, 1 లేదా ఆ తరువాత, ఆ సెక్షన్ కింద అందించిన సమయం లోపు లేదా 2021 మే 31వ తేదీ, ఈ రెండింటిలో ఏది తర్వాత వస్తుందో, ఆ తేదీ నాటికి దాఖలు చేయవచ్చు;
సి) చట్టం యొక్క సెక్షన్ 148 కింద నోటీసు కు ప్రతిస్పందనగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం కోసం - ఆ నోటీసు కింద ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేసే చివరి తేదీ 2021 ఏప్రిల్, 1 లేదా ఆ తరువాత, ఆ నోటీసు క్రింద లేదా అనుమతించిన సమయం లోపు లేదా 2021 మే, 31వ తేదీ, ఈ రెండింటిలో ఏది తర్వాత వస్తుందో, ఆ తేదీ నాటికి దాఖలు చేయవచ్చు;
డి) 2021 మార్చి 31వ తేదీ లేదా అంతకన్నా ముందు దాఖలు చేయాల్సిన మదింపు సంవత్సరం 2020-21 కొరకు, ఉప-సెక్షన్ (4) కింద గడువు దాటిన తర్వాత దక్ఖలు చేసే రిటర్న్ మరియు చట్టం యొక్క సెక్షన్ 139 లోని ఉప-సెక్షన్ (5) కింద సవరించిన రిటర్న్ దాఖలు చేయడానికి - 2021 మే, 31వ తేదీ లేదా అంతకు ముందు దాఖలు చేయవచ్చు;
ఈ) ఆదాయపు పన్ను నిబంధనలు, 1962 లోని నిబంధన 30 ప్రకారం, 2021 ఏప్రిల్ 30వ తేదీ లోపు (వరుసగా) లోపు చెల్లించి, దాఖలు చేయవలసి ఉన్న - చట్టం యొక్క సెక్షన్ 194-Iఏ, సెక్షన్ 194-Iబి మరియు సెక్షన్ 194-I ఎమ్ కింద వసూలు చేసిన పన్ను చెల్లింపు మరియు, ఆ విధంగా వసూలు చేసిన పన్ను చెల్లింపు కోసం చలాన్ తో కూడిన స్టేట్ మెంట్ దాఖలు చేయడం కోసం - 2021 మే, 31 తేదీన లేదా అంతకు ముందు చెల్లించి, దాఖలు చేయవచ్చు;
ఎఫ్) 2021 ఏప్రిల్, 30వ తేదీన లేదా అంతకు ముందు దాఖలు చేయవలసిన - ఫారం నెం. 60 లో వెల్లడించిన వివరాలతో స్వీకరించిన, ఫారం నం. 61 లోని స్టేట్ మెంట్ ను 2021 మే, 31వ తేదీన లేదా అంతకు ముందు దాఖలు చేయవచ్చు.
ఈ మేరకు 30.04.2021 తేదీతో కూడిన ఎఫ్.నెం: 225/49/2021 /ఐ.టి.ఐ-II లోని సి.బి.డి.టి. సర్క్యులర్ నెం: 8/2021 జారీ చేయబడింది. ఈ సర్క్యులర్ www.incometaxindia.gov.in. వెబ్-సైట్ లో అందుబాటులో ఉంది.
ఈ క్లిష్ట సమయాల్లో, ఉపశమనం కలిగించాలనే లక్ష్యంతో పన్ను చెల్లింపుదారులు సమర్పించవలసిన వివిధ సమ్మతులను సులభతరం చేయడానికి ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కార్యక్రమాలలో పైన పేర్కొన్న సడలింపులు తాజావి.
*****
(Release ID: 1715421)
Visitor Counter : 255