వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ఖరీఫ్ 2021 ప్రచారానికి సంబంధించి వ్యవసాయంపై జాతీయ సదస్సును ప్రారంభించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.
కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ వ్యవసాయం, అనుబంధ రంగాలు జిడిపి వాటాలో నిరంతర ప్రగతినిసూచించాయి : నరేంద్ర సింగ్ తోమర్
2021-22 సంవత్సరానికి ఆహారధాన్యాల లక్ష్యం 307 మిలియన్ టన్నులు: కేంద్ర వ్యవసాయశాఖమంత్రి
Posted On:
30 APR 2021 4:38PM by PIB Hyderabad
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, 2021 ఏప్రిల్ 30 న ఖరీఫ్‌ప్రచారం 2021 కోసం జాతీయ సదస్సును ప్రారంభించారు. వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ సహీయమంత్రి శ్రీ పురుషోత్తం రూప్ల, శ్రీ కైలాశ్ చౌదరి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. రానున్న ఖరీఫ్ సీజన్‌లో సమర్ధ పంట నిర్వహణ కోసం వ్యూహాలు, ఎదురయ్యే సవాళ్లకు సంబంధించి రాష్ట్రాలతో చర్చించేందుకు వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సదస్సు సందర్భంగా, ఖరీఫ్ పంటల యాజమాన్యానికి సంబంధించిన సన్నద్ధతను అంచనా వేయడానికి పరిస్థితులను సమీక్షించడంపై చర్చించారు. విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు, యంత్రాలు , బ్లాక్ స్థాయిలో వీటిని అందుబాటులో ఉంచడం వంటి అంశాలను ఈ సందర్భంగా చర్చించారు. దీనితోపాటు ఏదైనా జిల్లాలో కరవు వంటి పరిస్థితులుఏర్పడితే అందుకు తీసుకోవలసిన చర్యలు, సమీకృత పోషక విలువల యాజమాన్యం, సమీకృత కీటక నివారణ, పంటల వైవిధ్యం, రైతుల రాబడి పెంచడం, వంటనూనెల ఉత్పత్తి పెంపుపై ప్రత్యేక దృష్టితో వ్యూహం, రబీ పంటల మార్కెటింగ్, కనీస మద్దతు ధరకు పంటల సేకరణ, కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో వ్యవసాయ నిర్వహణకు సంబంధించిన సలహాలు, మార్గదర్శకాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక తదితర అంశౄలపై చర్చ జరిగింది.
ఈ సదస్సును ప్రారంభిస్తూ కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, రైతులు రికార్డు స్థాయిలో ఆహారధాన్యాలను (303.4 మిలియన్ టన్నులు) ఉత్ప్తతి చేసేందుకు చేసిన కృషిని అభినందించారు. ఇది అంతకు ముందు సంవత్సరం ఉ త్పత్తి 297.50 మిలియన్ టన్నుల కంటే 1.96 శాతం ఎక్కువ. పప్పుదినుసులు, నూనె గింజల ఉత్పత్తి వరుసగా 24.42, 37.3 మిలియన్ టన్నులుగాఆ ఉంది. కోవిడ్ మహమ్మారి వంటి వ్యతిరేక పరిస్థితులలోనూ వ్యవసాయరంగం అద్భుత ప్రగతిని సూచించిదని అన్నారు. వ్యవసాయం అనుంబంధ రంగాలు జిడిపి లో తమ వాటా నిరంతర ప్రగతిని సూచిస్తున్నాయి. జిడిపిలో వ్యవసాయరంగం వాటా 2019-20లో 17.8 శాతం ఉండగా 2020-21 లో ఇది 19.9 శాతానికి పెరిగినట్టు 2020-21 ఆర్ధిక సర్వే సూచించింది. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వివిధ సంక్షేమ పథకాలను రాష్ట్రాలు సమర్ధంగా అమలు చేసినందుకుఆయన రాష్ట్రాలను అభినందించారు.
2020-21 తో పోల్చి చూసినపుడు 2021-22 సంవత్సరానికి ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యాలను పెంచుతూ శ్రీ తోమర్ ప్రకటన చేశారు. గతంలో ఇది 301.92 మిలియన్ టన్నులు ఉండగా దానిని 307 మిలియన్ టన్నులకు పెంచారు. రెండవ ముందస్తు అంచనాల ప్రకారం, 2020-21 సంవత్సరానికి ఉత్పత్తి సాధన సుమారు 303.34 మిలియన్ టన్నులుగా ఉండే అవకాశంఉంది. పప్పులు, నూనె గింజలకు సంబంధించి అధిక ఉత్పత్తి లక్ష్యాల వల్లదేశం దిగుమతులపై ఆధారపడేది తగ్గుతుంది. ఇది ఆత్మనిర్భర భారత్ కల సాకారం కావడానికి దోహదపడుతుంది.
నూనె గింజలు, పప్పధాన్యాల కొరతపై ఆందోళన వ్యక్తం చేస్తూ శ్రీ తోమర్, ఈ లోటును అధిగమించేందుకు రాష్ట్రప్రభుత్వాలు అకుంఠితదీక్షతో కృషి చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. సేంద్రియ వ్యవసాయాన్ని పాటిస్తున్నప్రాంతాలను గుర్తించాలని, అలాంటి వారికి సేంద్రీయ ఉత్పత్తుల సర్టిఫికేట్ మంజూరు చేసి మార్కెట్‌తో అనుసంధానం చేయాలని శ్రీ తోమర్ రాష్ట్రప్రభుత్వాలకు పిలుపునిచ్చారు. రాష్ట్రప్రభుత్వాలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం అండా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
ఎసి,ఎఫ్.డబ్ల్యు కార్యదర్శి, సంజయ్ అగర్వాల్ మాట్లాడుతూ, తమ డిపార్టమెంట్, ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి విత్తన మినీ కిట్‌లు సరఫరా చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. రాష్ట్రాల వ్యవవసాయ విభాగాల క్రియాశీల భాగస్వామ్యంతో దీనిని అమలు చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రాల వ్యవవసాయ విభాగాలు వ్యవసాయ ఇన్‌పుట్‌లకు సంబంధించి తమ కు ఏర్పడగల డిమాండ్‌ను కేంద్రం దృష్టికి తెస్తే వాటిని సకాలంలో అందేట్టు చర్యలు తీసుకుంటామన్నారు. విత్తనాలు, ఎరువులు సకాలంలో అందేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. డిఎఆర్ ఇ కార్యదర్శి డాక్టర్ త్రిలోచన్ మొహాపాత్ర మాట్లాడుతూ, మెరుగైన నాణ్యతతో కూడిన బయో ఫోర్టిఫైడ్ రకాలను మంచి పోషకాలు , ప్రొటీన్లతో విడుదల చేసినట్టు తెలిపారు.
ఈ సందర్భంగా వ్యవసయా కమిషనర్ డిఎసి, ఎఫ్‌డబ్ల్యు డాక్టర్ సురేష్ మల్హొత్రా ,ఖరీఫ్ సీజన్‌లో పంట నిర్వహణకు సంబంధించిన వ్యూహాలు, స్థితి గురించి న అంశాలు తెలిపారు. 2020-21లో (303 మిలియన్ టన్నులు) రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలు ఉత్పత్తి గురించి ప్రస్తావిస్తూ ఆయన, వేసవి కాలపు సీజన్ ప్రాంతం పెరిగిందన్నారు. (63.44 నుంచి 75.75 లక్షల హెక్టార్లకు పెరిగింది) ఇది సమ్మర్, జెయిడ్ సీజన్‌లో ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయడం వల్ల సాధ్యమైందని అన్నారు. వర్షాకాలం లో ఈసారి సాధారణ వర్షపాతం ఉంటుందని అంచనా వేశారని ( 98 శాతం సుదీర్ఘ సగటు) దీనిని రాష్ట్రాలు సానుకూలంగా ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. కరు పీడిత ప్రాంతాలలో కంటింజెన్సీ ప్రణాళికను అమలు చేయాలని ఆయన సూచించారు. వ్యవసాయ వాతావరణ జోన్ల వారీగా ప్రణాళిక రూపొందించుకోవలని, క్లస్టర్‌విధానం, పంటల వ్యవస్థ ఆధారిత విధానలను రాష్ట్రాలు అనుసరించాలని సూచించారు. ఇక ఇన్‌పుట్ విషయానికి వస్తే, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, యంత్రాలు పరిస్థితి సంతృప్తి కరంగా ఉందని అన్నారు. సోయాబీన్, మొక్కజొన్న విషయంలో రాష్ట్రాలు విత్తనాలను ఎన్.ఎస్.సి నుంచి ,ప్రైవేటు రంగం నుంచి, రైతులు స్వంతంగా దాచిపెట్టుకున్న విత్తనాల నుంచి సమకూర్చుకోవచ్చని అన్నారు.
అన్ని రాష్ట్రాలూ విడియోకాన్ఫరెన్సు ద్వారా పాల్గొన్నాయి. ఆయా రాష్ట్రాలు సాధించిన ప్రగతి, పురోగతిని కేంద్రానికి వివరించాయి. అలాగే వారు ఎదుర్కొంటున్న సమస్యలు సమావేశం దృష్టికి తెచ్చారు.
ఎసి, ఎఫ్.డబ్ల్యు కార్యదర్శి, ఎరువుల కార్యదర్శి, డిఎఆర్ ఇ కార్యదర్శి, డిఎసి, ఎఫ్‌డబ్ల్యు, డిఎఆర్ఇ ,ఐసిఎఆర్ కు చెందిన సీనియర్ అధికారులు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ ఎపిసిలు, ప్రిన్సిపల్‌కార్యదర్శులు, కార్యదర్శులు, కమిషనర్లు, రాష్ట్ర వ్యవసాయ విభాగాల డైరక్టర్లు, ఐసిఎఆర్ నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తలు, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు (ఎస్ ఎయులు) ఉత్పాదకత, ఉత్పత్తిని నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ద్వారా, పంట వైవిద్యత ద్వారా, పంట మార్పిడి ద్వారా , పంట దిగుబడి అనంతర సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ద్వారా, విలువ జోడింపు ద్వారా పెంచేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించారు.
***
(Release ID: 1715360)
Visitor Counter : 241