ప్రధాన మంత్రి కార్యాలయం
సాధికార సమూహాల తో నిర్వహించిన ఒక సమావేశం లో కోవిడ్ సంబంధిత స్థితి పై సమీక్షించిన ప్రధాన మంత్రి
Posted On:
30 APR 2021 8:45PM by PIB Hyderabad
వివిధ సాధికార సమూహాల పనితీరు ను సమీక్షించడానికి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా జరిగిన ఒక సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
ఆర్థిక కార్యకలాపాల పైన, సంక్షేమ కార్యకలాపాల పైన ఏర్పాటు చేసిన సాధికార సమూహం ‘పిఎమ్ గరీబ్ కల్యాణ్ అన్న్ యోజన’ ను విస్తరించడం వంటి చర్యల ను గురించి ఒక ప్రెజెంటేశన్ ద్వారా ప్రధాన మంత్రి కి వివరించింది. ‘ఒక దేశం- ఒకే రేశన్ కార్డు’ కార్యక్రమం కారణం గా పోర్టబులిటీ కి వీలు చిక్కి, మరింత ఎక్కువ మంది కి ప్రయోజనాన్ని అందించడం లో తోడ్పాటు లభించిన సంగతి కూడా చర్చ కు వచ్చింది. ముందు వరుస లో నిలబడి పాటుపడుతున్న ఆరోగ్య కార్యకర్తల కు బీమా పథకాన్ని మరో 6 నెలల పాటు పొడిగించడం జరిగింది. ఉచిత ఆహార ధాన్యాల తాలూకు లాభాల ను పేద లు ఎలాంటి జాప్యానికి తావు లేకుండా అందుకొనేటట్టు చూడడానికి రాష్ట్రాల తో సన్నిహిత సమన్వయాన్ని నెలకొల్పుకొని పనిచేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధాన మంత్రి ఆదేశించారు.
పెండింగు పడ్డ బీమా క్లెయిముల ను త్వరిత గతి న పరిష్కరించే దిశ లో చర్య లు తీసుకోవాలని, అలా చేసినప్పుడు మృతుల తాలూకు ఆశ్రితులు సరైన కాలం లో ఈ పథకం ప్రయోజనాల ను అందుకోగలుగుతారని కూడా ప్రధాన మంత్రి అన్నారు.
సప్లయ్ చైన్, లాజిస్టిక్స్ మేనిజ్ మెంట్ అంశాల ఏర్పాటు చేసిన సాధికార సమూహం మహమ్మారి ని అదుపు చేయడానికి తీసుకోవలసిన చర్యల కు సంబంధించిన వివిధ సలహాలను గురించి ఒక ప్రెజెంటేశన్ ను ఇచ్చింది.
వస్తువుల చేరవేత అంతరాయం లేకుండా కొనసాగేటట్టు చూసేందుకు సమగ్ర ప్రణాళిక ను సిద్ధం చేసి అమలుపరచాలని, ఇలా ముందుకు వెళ్లినప్పుడు సప్లయ్ చైన్ లో అవాంతరాల ను నివారించడం సాధ్యపడుతుందంటూ ప్రధాన మంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ప్రయివేటు రంగం, ఎన్ జిఒ లు, అంతర్జాతీయ సంస్థల తో సమన్వయం అంశం పై ఏర్పాటైన సాధికార సమూహం ప్రయివేటు రంగం, ఎన్ జిఒ లు, అంతర్జాతీయ సంస్థల తో ప్రభుత్వం ఎలాగ సక్రియాత్మకమైనటువంటి భాగస్వామ్యం తో పనిచేస్తున్నదీ ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకు వచ్చింది. విశిష్టేతర కార్యాల లో పౌర సమాజ స్వయంసేవకుల సేవల ను ఏ విధం గా ఉపయోగించుకొంటే దీని ద్వారా ఆరోగ్య సంరక్షణ రంగం పై ప్రస్తుతం పడడుతున్న ఒత్తిడి ని తగ్గించడానికి వీలు ఉంటుందో ఆలోచించండంటూ అధికారులకు ప్రధాన మంత్రి సూచన చేశారు. రోగుల కు, వారి ఆశ్రితులకు, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది కి మధ్య సంప్రదింపుల కు మార్గాన్ని ఏర్పరచడం లో ఎన్ జిఒ లు సాయపడగలుగుతాయా అనే విషయం కూడా చర్చ కు వచ్చింది. ఇంటి లో ఏకాంత వాసం లో ఉంటున్న వారి తో సంప్రదింపులు జరపడం కోసం ఏర్పాటు చేసే కాల్ సెంటర్ లను సంబాళించేటట్లు గా మాజీ సైనికోద్యోగుల ను ప్రోత్సహించేందుకు వెసులుబాటు లు ఉన్నాయేమో పరిశీలించాలి అనే ప్రసక్తి కూడా చర్చల లో చోటు చేసుకొంది.
***
(Release ID: 1715358)
Visitor Counter : 184
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam