రైల్వే మంత్రిత్వ శాఖ
రైల్వేయేతర రోగులు కోవిడ్ సంబంధిత సమస్యలతో ఆసుపత్రి పాలైనప్పుడు కోవిడ్ పరీక్షలు, ఆహార సరఫరాపై చార్జీలను రద్దు చేసిన రైల్వేలు
Posted On:
30 APR 2021 6:51PM by PIB Hyderabad
కోవిడ్ సంబంధించిన సమస్యలతో ఆసుపత్రి పాలైన రైల్వేయేతర రోగులకు కోవిడ్ పరీక్షలు, ఆసుపత్రిలో ఉన్న సమయంలో సరఫరా చేసే ఆహారంపై చార్జీలను భారతీయ రైల్వేలు రద్దు చేశాయి.
కోవిడ్-19 మహమ్మారి ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా నివారించేందుకు, పోరాటం చేసేందుకు భారత ప్రభుత్వం అన్ని మంత్రిత్వ శాఖలు / డిపార్ట్‌మెంట్లు ఒకటిగా పని చేసే మొత్తం ప్రభుత్వం పద్ధతిని పాటిస్తోందన్న విషయం గమనార్హం.
ఈ క్రమంలో బోర్డు -
1. శిబిరాలలో, సమూహాలలో రైల్వేయేతర సిబ్బందికి చేసిన ఆర్‌టిపిసిఆర్/ ఆర్ఎటి పరీక్షలపై అయిన ఖర్చును రద్దు చేయాలని,
2.కోవిడ్ సంబంధించి ఆసుపత్రి పాలైనప్పుడు ఆహార సరఫరాపై వేయదగ్గ చార్జీలను రద్దు చేసింది.
కోవిడ్‌పై తన మొత్తం శక్తిసామర్ధ్యాలను ఉపయోగించి పోరాటం చేయడంలో భారతీయ రైల్వేలు ముందు వరుసలో ఉంది. సరఫరా లంకెలను నిర్వహించడం నుంచి ఆర్థిక చక్రాలు కదిలేలా చూడటం, ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్సులను నడపడం నుంచి కోవిడ్ కేర్ కోచీలను అందించడం, అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ప్యాసెంజర్ రైళ్ళను నడపడం వంటి పనులను రైల్వేలు చేస్తోంది.
ఈ కీలకమైన వైద్య చార్జీలను రద్దు చేయడమనేది ఆరోగ్య సంరక్షణ అందిరికీ అందుబాటులో చూడటంలో ఒక ముందడుగు.
***
(Release ID: 1715166)
Visitor Counter : 207