ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
చండీఘడ్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లలో ని 13 ప్రాంతాలలో రక్తదాన శిబిరాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్
2020 నాటికంటే ఇప్పుడు దేశం కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మరింత అనుభవంతో మానసికంగా, భౌతికంగా మంచి సన్నద్ధతతో ఉంది : డాక్టర్ హర్షవర్ధన్
Posted On:
27 APR 2021 4:37PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమం, సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టరకేంద్రమంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈరోజు చండీఘడ్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లలో ని వివిధ ప్రాంతాలలో 13 రక్తదాన శిబిరాలను వెబినార్ ద్వారా ప్రారంభించారు. కేంద్ర ఆర్ధిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ సమక్షంలో ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరాలను వివిధ అసోసియేషన్లు, ఎన్‌జిఓలు రక్తనిధి సంస్థలతో కలసి కాంపిటెంట్ ఫౌండేషన్ నిర్వహించింది. ప్రస్తుత కరోనా మహమ్మారి సమయంలో రక్తఅవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రక్తదాన శిబిరాలను నిర్వహించారు.
ఈ రక్తదాన శిబిరాల ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వెబినార్‌లో మాట్లాడుతూ డాక్టర్ హర్షవర్ధన్, రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేయడంలో కాంపిటెంట్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని అభినందించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో రక్తం అవసరాలను తీర్చేందుకు ఇలాంటి శిబిరాలు నిర్వహించడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు. రక్తాన్నిదానం చేయడంవల్ల రక్తం ఇచ్చిన వారికి వ్యక్తిగతంగా ఎన్నోప్రయోజనాలు ఉన్నాయని , అలాగే వారు మొత్తం మానవాళికి సేవ చేసినవారుఅవుతారని ఆయన అన్నారు. మరింత మంది ప్రజలు రక్తదానానికి ముందుకు రావాలని డాక్టర్ హర్షవర్ధన్ పిలుపునిచ్చారు. కనీసం సంవత్సరానికి ఒకసారైనా వారి పుట్టిన రోజువంటి రోజులను పురస్కరించుకుని రక్త దానం చేయాలని అన్నారు. ఇది మానవాళికి ఎంతో ప్రయోజనకరమని అన్నారు. పవిత్ర ప్రదేశాలను సందర్శించడానికి మించిన మరింత పవిత్ర కార్యం రక్తదానమని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ , 2021 జనవరిలో ప్రపంచంలోనే అతిపెద్ద వాక్సినేషన్ కార్యక్రమానికి మనదేశంలో శ్రీకారం చుట్టారని, దీనిని ఇప్పుడు మరింత వేగవంతం చేశామని మే1 నుంచి యువజనులకు వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానున్నదని డాక్టర్ హర్ష వర్ధన్ అన్నారు. 2021 సంవత్సరంలో దేశం మానశికంగా శారీరకంగా కోవిడ్‌ను ఎదుర్కోవడానికి 2020 నాటితో పోల్చి చూసినపుడు మరింత సన్నద్ధతతో ఉందని మంత్రి అన్నారు. రక్తదాన శిబిరాన్ని అన్ని కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ ప్రభుత్వ మార్గదర్శకాలు, ఎస్ఒపిలను పాటిస్తూ నిర్వహించడం పట్ల ఆయన నిర్వహాకులను అభినందించారు. యువకులకు వాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందు ఈ రక్తదాన శిబిరాన్నిఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వాక్సిన్‌వేయించుకున్న తర్వాత రెండునెలలు రక్తదానం చేయకపోవడం మంచిదని అందువల్ల వాక్సిన్ కార్యక్రమానికి ముందే రక్తదాన శిబిరం ఏర్పాటుచేయడాన్ని అభినందించారు.
కాంపిటెంట్ ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీసంజయ్ టాండన్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం తమ సంస్థ చండీఘడ్ ట్రైసిటీని దాటి 13 ప్రాంతాలలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రస్తుత కోవిడ్ మహమ్మారి సమయంలో రక్తం అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈచర్యలు తీసుకున్నట్టు చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలో రక్తదానం ఎంతో ప్రాధాన్యత కలిగినదని, ప్రస్తుత సంక్షోభ సమయంలో రక్తం సరఫరా మరింత కష్టమైపోయిందన్నారు. అందువల్ల ప్రజలు ప్రత్యేకించి యువత ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
*****
(Release ID: 1714644)
Visitor Counter : 186