ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు ఇంతవరకు ఉచితంగా 15 కోట్ల టీకాలను ఉచితంగా సరఫరా చేసిన కేంద్ర ప్రభుత్వం


రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న కోటికి పైగా టీకాలు

రానున్న మూడు రోజుల్లో రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు చేరనున్న 80 లక్షల టీకాలు

Posted On: 27 APR 2021 7:27PM by PIB Hyderabad

కోవిడ్-19 మహమ్మారిపై పోరాడటానికి భారత ప్రభుత్వం అమలు చేస్తున్న అయిదు అంశాల వ్యూహంలో  టీకా అనేది ఒక కీలకమైనఅంశం.  టెస్ట్, ట్రాక్, ట్రీట్ మరియు కోవిడ్ అనుగుణ ప్రవర్తన (కాబ్) ల ఆధారంగా కోవిడ్-19పై ప్రభుత్వం పోరాటాన్ని ప్రారంభించింది. వీటిలో ముఖ్యమైన టీకాల కార్యక్రమాన్ని  2021 జనవరి 16 న భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద టీకా డ్రైవ్‌ను ప్రారంభించింది. సరళీకృత మరియు వేగవంతమైన మూడవ దశ  టీకాల వ్యూహం 2021 మే 1 నుంచి అమలు కానున్నది. మూడవ దశలో జాతీయ టీకాల  వ్యూహం మరింత  సరళీకృతంగా అమలు కానున్నది. టీకాల ధర మరియు ఎక్కువమందికి టీకాలు ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ సరళీకృత వ్యూహానికి రూపకల్పన చేశారు. దీనిలో భాగంగా టీకాల సేకరణ, అర్హత మరియు పరిపాలన సరళీకృతం చేయబడ్డాయి.

ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు 15 కోట్ల టీకాల డోసులను ఉచితంగా అందించింది. వీటిలో వృధాతో పాటు 14,64,78,983 డోసులను వినియోగించడం జరిగింది. 

ప్రజలకు టీకాలను ఇవ్వడానికి రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వద్ద కోటి దోషుల టీకాలు అందుబాటులో ఉన్నాయి. 

ఇవికాకుండా మరో మూడు రోజుల్లో 80 లక్షల ( 86,40,000) టీకాల డోసులు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు చేరనున్నాయి. 

మహారాష్ట్రలో టీకాల నిల్వలు నిండుకున్నాయని దీనివల్ల రాష్ట్రంలో టీకాల కార్యక్రమం సక్రమంగా జరిగే అవకాశాలు లేవంటూ ఆ రాష్ట్రానికి చెందిన అధికారులు చెప్పినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చాయి.  అయితే, మహారాష్ట్రకు 2021 ఏప్రిల్ 27 ( ఉదయం 8 గంటల వరకు)వ తేదీవరకు 1,58,62,470 టీకాల డోసులను కేంద్రం అందించింది. వీటిలో వృధా (0.22%)తో కలసి 9,23,060 డోసులను ప్రభుత్వం వినియోగించింది. దీనితో రాష్ట్రం వద్ద అర్హులైన ప్రజలకు ఇవ్వడానికి 9,23,060 డోసుల టీకాలు ఉన్నాయి. రానున్న మూడు రోజుల్లో మహారాష్ట్రకు 3,00,000 లక్షల డోసుల టీకాలు సరఫరా కానున్నాయి. 

***



(Release ID: 1714471) Visitor Counter : 186