ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ నియంత్రణకు స్థానికంగాగట్టి చర్యలు!


పటిష్టంగా కంటెయిన్మెంట్ ప్రాంతాల అమలుకోసం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచనలు

10శాతంపైగా పాజిటివిటీ లేదా రోగులతో నిండిన 60శాతం పడకల ప్రాతిపదికన నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాల ప్రాతిపదికన చర్యలకు సలహా

వైరస్ సంక్రణ వ్యవస్థ విచ్ఛిన్నానికి 14 రోజుల వ్యవధితోకట్టడి నిబంధనలు

Posted On: 25 APR 2021 9:53PM by PIB Hyderabad

   ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కోవిడ్ వైరస్ మహమ్మారి వ్యాప్తి కట్టడికోసం తగిన సహాయ సహకారాలు అందించేందుకు భారత ప్రభుత్వం రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా మార్గదర్శక సూత్రాలను, సూచనలను జూరీ చేస్తూవస్తోంది. ఇటీవల పెరిగిన కోవిడ్ కేసుల కట్టడికోసం చర్యలు తీసుకునేందుకు వీలుగా 'కచ్చితమైన నిఘా'తో వ్యవహరించవలసిందిగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గత జనవరి 5వ తేదీన రాష్ట్రాలకు సూచించింది. కోవిడ్ కేసుల్లో పెరుగుదల నమోదైన రాష్ట్రాలన్నీ సత్వరం తగినన్ని ప్రజారోగ్య చర్యలు తీసుకోవాలంటూ గత ఫిబ్రవరి 21న వివిధ రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. కోవిడ్ నియంత్రణ చర్యల్లో సడలింపు ఏ మాత్రం తగదని, వైరస్ వ్యాప్తికి ఆస్కారం ఉన్న చోట్ల పటిష్టమైన నిఘాతోపాటుగా, కేసులను పసిగట్టే చర్యలపై అవసరమైన మార్గదర్శక సూత్రాలను గట్టిగా అమలు చేయాలని కేంద్రం గత ఫిబ్రవరి 27వ తేదీన రాష్ట్రాలకు సూచించింది. కోవిడ్ కేసుల తీరు తెన్నులపై 2021, ఏప్రిల్ 20వ తేదీన కూడా కేంద్రం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తగిన హెచ్చరికలు జారీ చేసింది. కేసుల నియంత్రణకోసం తగిన స్థాయిలో మౌలిక సదుపాయాలను, ఇతర ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాల్సిందిగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది. కోవిడ్ కేసుల పరిస్థితిని సమీక్షించి, వ్యాప్తిని నియంత్రించేందుకు తీసుకోవలసిన చర్యలపై పలు వీడియో కాన్ఫరెన్స్.లలో కూడా కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి, కేబినెట్ కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఆయా రాష్ట్రాలు, జిల్లాల అధికారుల స్థాయిల్లో ఈ వీడియో కాన్ఫరెన్సులు జరిగాయి.

   గత కొన్ని రోజులుగా రోజువారీగా కొత్త కోవిడ్ కేసుల సంఖ్య చాలా భారీ స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో, కోవిడ్ వైరస్ వ్యాప్తిని కచ్చితంగా నియంత్రించడం చాలా అత్యవసరమని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేసుల వ్యాప్తిని కట్టడి చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. కోవిడ్ కేసులు ఇదే తీరున పెరుగుతూ ఉంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య మౌలిక సదుపాయాలు ఏ మాత్రం సరిపోవని, ఉన్న వాటితో పరిస్థితిని ఎదుర్కొనడం సాధ్యంకాకపోవచ్చని కూడా కేంద్రం స్పష్టం చేసింది.

కేసుల ఉధృతి  కొనసాగుతున్న దేశంలోని కొన్ని జిల్లాల్లో, నగరాల్లో, ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి కచ్చితమైన, నిర్దిష్ట లక్ష్యంతో కూడిన చర్యలు అవసరమని కేంద్రం పేర్కొంది. కోవిడ్ కేసులపై నియంత్రణ చర్యలు తీసుకోవడానికి, కేసుల గ్రాఫ్.కు కళ్లెం వేయడానికి ఈ కింది ప్రమాణాలను రాష్ట్రాలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. :

 

క్రమసంఖ్య

ప్రమాణం

ప్రభావ పరిధి

1

టెస్ట్ పాజిటివిటీ

గత వారంలో పది శాతం అంతకంటే ఎక్కువగా నమోదైన టెస్ట్ పాజిటివిటీ

లేదా

2

నిండిన పడకలు

ఆక్సిజన్ పడకలు, లేదా ఐ.సి.యు. పడకలు 60శాతంపైగా నిండిన తీరు

 

ఈ రెండు అంశాల్లో ఏ ఒక్కటైనా ఏ జిల్లాకు వర్తించినా, సదరు జిల్లాల్లో వైరస్ వ్యాప్తి కట్టడికి చర్యలు తీసుకోవడానికి కంటెయిన్మెంట్ నిబంధనలను అమలు చేయడానికి తగిన పరిస్థితులు ఉన్నట్టుగా పరిగణించాల్సి ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో అంటువ్యాధుల నిరోధక నిబంధనలను పాటించడం ద్వారా వైరస్ సంక్రమణ వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి 14రోజులపాటు ప్రజల కదలికలపై స్థానికంగా అక్కడికక్కడ ఆంక్షలు విధించాల్సి ఉంటుంది. వైరస్ కట్టడికి కఠిన చర్యలు అవసరమైన జిల్లాల వర్గీకరణను, స్థానిక కంటెయిన్మెంట్ చర్యలను సంబంధిత రాష్ట్రం ప్రతి వారం చేపట్టవలసి ఉంటుంది. ఇందుకు సంబంధించి సమాచార సాధనాల్లో అవసరమైన ప్రచారం, అవగాహన కల్పించడంతోపాటుగా, ఇదే సమాచారాన్ని ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. వైరస్ వ్యాప్తి కట్టడి చర్యలు, స్థానిక కంటెయిన్మెంట్ చర్యలు ఏ ఏ ప్రాంతాల్లో తీసుకుంటున్నారన్నది సూచించేలా ఉండాలి. అంటే  కట్టడి చర్యలు తీసుకునే నగరాలు, పట్టణాలు, పట్టణ ప్రాంతాలు, జిల్లా కేంద్రాలు, సెమీ అర్బన్ ప్రాంతాలు, మున్సిపల్ వార్డులు, పంచాయతీ ప్రాంతాలు వంటి వివరాలను సూచించేలా కంటెయిన్మెంట్ చర్యలు ఉండాలి.

స్థానిక కంటెయిన్మెంట్ చర్యల అమలులో తప్పనిసరిగా మూడు వ్యూహాత్మక అంశాలపై దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుంది. కంటెయిన్మెంట్, చికిత్సా నిర్వహణ, ప్రజా సంఘాలకు ప్రమేయం వంటి వ్యూహాత్మక అంశాలపై దృష్టీని కేంద్రీకరిస్తూ ఈ చర్యలు తీసుకోవాలి.

  స్థానికంగా తీసుకునే కంటెయిన్మెంట్ చర్యలు పూర్తి క్రియాశీలకంగా, కోవిడ్ వైరస్ సంక్రమణ వ్యవస్థను విచ్ఛిన్నం చేసేలా ఉండాలి. ఎక్కువ కేసులు, మరణాలు నమోదయ్యే ఆయా ప్రాంతాల్లోని ప్రజల విలువైన ప్రాణాలను రక్షించేలా, ఆరోగ్య రక్షణ సదుపాయాలను విస్తృత పరిచేలా కంటెయిన్మెంట్ చర్యలుచేపట్టాల్సి ఉంటుంది. కంటెయిన్మంట్ చర్యలకు సంబంధించి ఒక పర్యవేక్షక యంత్రాగాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సూచించింది. కంటెయిన్మెంట్ నిబంధనలను అమలు జరిగే ప్రాంతాలపై సంబంధిత రాష్ట్రం ప్రతిరోజూ అత్యున్నత స్థాయిలో సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. స్థానికంగా కంటెయిన్మెంట్ నిబంధనలు అమలు జరపాల్సిన జిల్లాలు, జిల్లాల్లోని వివిధ ప్రాంతాలు, పట్టణాలు, సదరు పట్టణాల్లోని ప్రాంతాలను గుర్తించిన తర్వాత, సంబంధిత జిల్లాల్లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు పటిష్ట పర్యవేక్షణకు, తక్షణ చర్యలకుగాను సీనియర్ అధికారులను నోడల్ అదికారులుగా ఆయా రాష్ట్రాలు నియమించవలసి ఉంటుంది.

  కంటెయిన్మెంట్ నిబంధనలను అమలు జరపాల్సిన ప్రాంతాన్ని గుర్తించే ప్రక్రియను రాష్ట్ర నోడల్ అధికారి చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం జిల్లా కలెక్టర్.ను, మున్సిపల్ కమిషనర్లను సదరు నోడల్ అధికారి ముందస్తుగా సంప్రదింపులు జరపవలసి ఉంటుంది. ఆ ప్రాంతంలో నమోదయ్యే కేసుల ఉధృతి ప్రాతిపదికగా ఈ చర్యలు తీసుకోవలసి ఉంటుంది. కంటెయిన్మెంట్ నిబంధనలు అమలు జరిపే ప్రాంతాలపై వివరాలతో కూడిన నివేదికనునోడల్ అధికారి సంబంధిత రాష్ట్రప్రభుత్వానికి సమర్పించి, ఆ ప్రభుత్వ ఆమోదం పొందవలసి ఉంటుంది.

  కోవిడ్ వ్యాప్తిపై రోజువారీ పరిస్థితిని జిల్లా కలెక్టర్ లేదా మున్సిపల్ కమిషనర్ ఎప్పటికప్పుడు సమీక్షించాల్సి ఉంటుంది. కేసుల వ్యాపించిన తీరు, రోజువారీ నిర్వహణా ప్రణాళిక, క్షేత్రస్థాయి ప్రతిస్పందన ఆధారంగా వివిధ కార్యకలాపాల అమలు వంటి అంశాలపై కూడా వారు విశ్లేషించుకోవలసి ఉంటుంది.

   ఈ మొత్తం అంశాలపై సంబంధిత జిల్లా పరిపాలనా యంత్రాంగం రాష్ట్రప్రభుత్వానికి రోజూ నివేదిక సమర్పించాలని, అదే అంశాలపై సంక్షిప్త నివేదికను సమాచార నిమిత్తం, ఆయా రాష్ట్రాలు భారత ప్రభుత్వానికి పంపించాలని కేంద్రం సూచించింది. అవసరమైతే, స్థానిక పరిస్థితులకు, అవసరాలకు, వనరులకు తగినట్టుగా  ఆయా రాష్ట్రాలు తమకు అందిన అనదపు ప్రతిస్పందనను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని కేంద్రం పేర్కొంది. 

కమ్యూనిటీ కంటెయిన్మెంట్/ విస్తృత కంటెయిన్మెంట్ ప్రాంతాల వ్యవస్థ అమలు:

వైరస్ సంక్రమణ (వ్యాప్తి) అంశాలను అవగాహన చేసుకోవడం:

ఈ వైరస్ మానవ శరీరాన్ని అతిథేయ ఆశ్రయంగా వినియోగించుకుంటుంది. అంటే, వైరస్ వ్యాప్తిని నియంత్రించాలంటే, కేవలం వైరస్ సంక్రమణను మాత్రమే కాకుండా, వాటి మనుషుల కదలికలను, వ్య వహార శైలిని కూడా కట్టడి చేయగలిగేలా తగిన వ్యూహాలను అమలు చేయడం తప్పనిసరి.

స్థూలంగా చెప్పాలంటే నియంత్రణ వ్యూహాలు ఇలా ఉండాలి.:

  1. మాస్కులను ధరించడం, ఇతరులతో భౌతిక దూరం పాటించడం, సాధ్యమైనంత తరచుగా చేతులను శుభ్రపరుచుకోవడం, జన సమూహాలతో కూడిన సమావేశాలకు హాజరు కాకపోవడం.
  2. వైరస్ కట్టడికి చేపట్టవలసిన ప్రజారోగ్య చర్యలు:

   వైరస్ పాజిటివ్ అనుమానితులను, వారితో సంబంధాలు ఉన్నవారిని, శ్వాసపరంగా తీవ్ర అస్వస్థులైన వారిని, ఫ్లూ వ్యాధి లక్షణాలున్న వారిని క్వారంటైన్ లో ఉంచి, పరీక్షలు నిర్వహించడం. వారు ఎక్కడికైనా కదలి వైరస్ వ్యాప్తికి కారకులు కాకుండా చూడటం, పాజిటివ్.లుగా నిర్ధారణ అయిన వారిని ఏకాంతంగా ఉంచడం, వారితో సంబందం ఉన్న వారిని గుర్తించి, క్వారంటైన్ లో ఉంచి వారికి పరీక్షలు చేయడం వంటి చర్యలు తీసుకోవాలి, ఎక్కడైనా కేసుల సమూహంగా ఉన్నపుడు కేవలం సదరు వ్యక్తులను, కుటుంబాలను క్వారంటైన్ చేసినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. ఇలాంటి సందర్బాల్లో,  వ్యాధి బయటి ప్రాంతాలకు వ్యాపించకుండా నిరోధించడానికి స్పష్టమైన హద్దులతో కూడిన కంటెయిన్మెంట్ జోన్లు, కఠినమైన నియంత్రణలు అమలు జరపాల్సి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్న కంటెయిన్మెంట్ వ్యూహం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పొందుపరిచిన కోవిడ్ నియమావళికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకోవలసి ఉంటుంది. అంటే, నగరం, జిల్లా వంటి విస్తృతమైన భౌగోళిక ప్రాంతంలో విపరీతంగా పెరుగుతున్న కేసులను ఇలా భౌతికంగానే కట్టడి చేయాలన్నమాట. అయితే,.కంటెయిన్మెంట్ జోన్ల విషయంలో. నియంత్రణలతో, ఆంక్షలతో కూడిన ప్రజారవాణాను మాత్రమే అనుమతిస్తారు.

  1. ఆధారాల ప్రాతిపదికన నిర్ణయం: విస్తృత స్థాయిలో కంటెయిన్మెంట్ జోన్ అమలుపై తీసుకునే నిర్ణయం తగిన ఆధారాల ప్రాతిపదికన జరగాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల, లేదా కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనా యంత్రాంగాల స్థాయిలో పరిస్థితిపై సరైన విశ్లేషణ, అంచనా అనంతరం ఈ అంశంపై నిర్ణయం జరగాల్సి ఉంటుంది. వైరస్ తో ప్రభావితమైన జనాభా, భౌగోళిక వ్యాప్తి, ఆసుపత్రి తదితర మౌలిక సదుపాయాలు, మానవ వనరుల లభ్యత, సరిహద్దుల నిర్ధారణలో వెసులుపాటు తదితర అంశాలను పరిశీలించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
  2. అయితే, సరైన లక్ష్యసాధన, పారదర్శకమైన నిర్ణయం, అంటువ్యాధుల నిరోధకపరంగా పటిష్ట నిర్ణయం తీసుకోవాలంటే, కంటెయిన్మెంట్ నిబంధనల అమలు చేయాల్సిన జిల్లాలు, ప్రాంతాల ఎంపికలో రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాల సహాయార్థం ఈ కింది స్థూల వ్యవస్థను  ఏర్పాటు చేశారు. :

 

క్రమ

సంఖ్య

ప్రమాణం

ప్రభావ పరిధి

1

టెస్టు పాజిటివిటీ

గత వారంలో పది శాతం, అంతకంటే ఎక్కువగా నమోదైన టెస్టు పాజిటివిటీ

లేదా

2

నిండిన పడకలు

ఆక్సిజన్ పడకలు, లేదా ఐ.సి.యు. పడకలు 60శాతంపైగా నిండిన తీరు

 

  1. వైరస్ కట్టడికి సంబంధించి వివిధ నగరాలు, పట్టణాలు, పట్టణ ప్రాంతాలు, జిల్లా కేంద్రాలు, సెమీ అర్బన్ ప్రాంతాలు, మున్సిపల్ వార్డులు, పంచాయతీ ప్రాంతాలు వంటి వివరాలను సూచించేలా కంటెయిన్మెంట్ చర్యలు ఉండాలి.
  2. పటిష్టమైన నియంత్రణ చర్యలు తీసుకునేందుకు గుర్తించిన ప్రాంతాలు, స్థానిక కంటెయిన్మెంటు నిబంధనల అమలుపై దృష్టిని ప్రధానంగా కేంద్రీకరిస్తూ, ఈ కింది కీలక ప్రాంతాలపై దృష్ఠిని నిలపాలి. :

 

. కంటెయిన్మెంట్

I.ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వైరస్ ను అణచివేసేందుకు వీలుగా కంటెయిన్మెంట్ (కట్టడి)పైనే ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తారు.

II.రాత్రి కర్ళ్యూ: రాత్రి వేళల్లో వ్యక్తుల కదలికలను కఠినంగా నిషేధిస్తారు. నిత్యావసర కార్యకలాపాలకు ఈ నిషేధంనుంచి మినహాయింపు ఇస్తారు. రాత్రి కర్ఫ్యూ ఎన్ని గంటలు అమలుచేయాలన్న అంశంపై స్థానిక పరిపాలనా యంత్రాంగం నిర్ణయం తీసుకుని, ఉత్తర్వులు జారీ చేస్తుంది. కంటెయిన్మెంట్ జోన్ పరిధిలోని మొత్తం ప్రాంతంలో, చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటారు. క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ (సి.పి.సి.)లోని 144వ సెక్షన్ కింద, కచ్చితంగా అమలయ్యేలా ఈ నిషేధాజ్ఞలు ప్రయోగిస్తారు.

III. ప్రజల మధ్య సాంగత్యంపై ఆంక్షలను విధించడం ద్వారా కోవిడ్ వైరస్ వ్యాప్తిని నియంత్రించాల్సి ఉంటుంది.

IV.సామాజిక/ రాజకీయ/క్రీడా/ వినోద/విద్యా/ సాంస్కృతిక/మతపరమైన/పండుగల సంబంధమైన సమావేశాలు, ఇతర రకాల సమావేశాలను నిషేధిస్తారు.

V. గరిష్టంగా 50మంది వ్యక్తులవరకూ హాజరయ్యేలావివాహాలకు, 20మంది వరకూ హాజరయ్యేలా అంత్యక్రియల నిర్వహణకు అనుమతించవచ్చు.

VI.అన్ని దుకాణ సముదాపాయాలు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, బార్లు, క్రీడా సముదాయాలు, వ్యాయామ శాలలు, స్పాలు, ఈత కొలనులు, మతపరమైన ప్రార్థనా స్థలాలను మూసివేయలసి ఉంటుంది.

VII.ఆరోగ్య రక్షణ సేవలు, పోలీసు, అగ్నిమాపక సేవలు, బ్యాంకులు, విద్యుత్, నీటి సరఫరా, పారిశుద్ధ్యం పనులు కొనసాగుతాయి.  ఈ పనులు సజావుగా జరిగేందుకు నియంత్రణతో కూడిన ప్రజా రవాణా కూడా కొనసాగుతుంది. ఈ కార్యకలాపాలకు ప్రభుత్వం, ప్రైవేటు రంగంలో కూడా అనుమతి ఉంటుంది.

VIII. గరిష్టంగా 50శాతం మంది ప్రయాణికులతో రైల్వేలు, మెట్రోరైళ్లు, బస్సులు, క్యాబ్.లు వంటి ప్రజా రవాణా వాహనాలకు అనుమతి ఉంటుంది.

IX. వివిధ రాష్ట్రాల మధ్య, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య రవాణాకు, నిత్యావసర సరకుల రవాణాకు ఎలాంటి ఆంక్షలు ఉండవు.

 X.ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని కార్యాలయాలన్నీ గరిష్టంగా 50శాతం సిబ్బంది హాజరుతో పనిచేయవచ్చు.

XI.ప్రభుత్వ, ప్రైవేటు పారిశ్రామిక, వైజ్ఞానిక సంస్థల్లో సిబ్బంది భౌతిక దూరం పాటిస్తూ పనిచేయడానికి అనుతించవచ్చు. సిబ్బందిలో ఫ్లూ వంటి వ్యాధి లక్షణాలు కనిపించిన పక్షంలో వారికి ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష (ఆర్.ఎ.టి.) ద్వారా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించవచ్చు.

  XII.కంటెయిన్మెంటు జోన్ల నిఘా సిబ్బందికి, సూపర్వైజర్లకు శిక్షణా నియమాలతో సహా ఇతర నిబంధనలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇప్పటికే విడుదల చేసింది. వెబ్ సైట్లో అందుబాటులో ఉన్న ఈ నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది.

XIII.అయితే, ఇవన్నీ కేంద్రం సూచన ప్రాయంగా తెలిసిన కార్యకలాపాలు మాత్రమే. స్థానిక పరిస్థితులు, వైరస్ వ్యాప్తికి గల అవకాశాలు తదితర అంశాలను ప్రాతిపదికగా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలే  తమంతట తామే పరిస్థితిని జాగ్రత్తగా విశ్లేషించుకోవలసి ఉంటుంది.

XIV. పైన పేర్కొన్న ఆంక్షలు 14రోజుల వ్యవధిపాటు కొనసాగుతాయి.

XX. ఏదైనా ప్రాంతాన్ని కంటెయిన్మెంట్ జోన్ గా ప్రకటించే ముందు, అందుకు సంబంధించి బహిరంగ ప్రకటన చేయాల్సి ఉంటుంది. కంటెయిన్మెంట్ ప్రాంతంగా ప్రకటించడానికి గల కారణాలను, విధించబోయే ఆంక్షల వివరాలను తెలిపేలా ఈ ప్రకటన ఉండాలి.  (ఇవే అంశాలను,..వైరస్ వ్యాప్తి పరిస్థితి తీవ్రతను, విధించే ఆంక్షలను వివరిస్తూ స్థానిక భాషలో ముద్రించిన కరపత్రాన్ని కూడా పంపిణీ చేయవచ్చు).

XXI.కంటెయిన్మెంట్ కార్యకలాపాల సక్రమంగా నిర్వహించేందుకు వీలుగా ప్రజా సంఘాల వాలంటీర్లు, పౌర సంఘాలు, మాజీ సైనిక సిబ్బంది, స్థానికంగా ఉండే నెహ్రూ యువ కేంద్ర, జాతీయ సేవా పథకం కేంద్రాల సభ్యులకు తగిన ప్రమేయం కల్పించవచ్చు. స్థానిక భాషలో కరపత్రాల పంపిణీకి, కోవిడ్ వ్యాప్తి నిరోధంకోసం ప్రజలు తమ ప్రవర్తనను మలుచుకువేలా ప్రోత్సాహం అందించేందుకు, టీకా పంపిణీకి సహాయ సహకారాలకోసం అందించేందుకు వీరిని వినియోగించుకోవచ్చు.

 

     బి. పరీక్షల నిర్వహణ, కేసులపై నిఘా

'పరీక్షలు-చికిత్స-అనుమానితుల గుర్తింపు- వ్యాక్సినేషన్ అమలు, కోవిడ్ సంబంధించిన ప్రవర్తనా నిబంధనావళి అమలు వంటి కార్యకలాపాలను ఆయా జిల్లాల పరిపాలనా యంత్రాంగాలు ఎప్పటిలాగే వ్యూహాత్మకంగా అమలు చేయవచ్చు. కోవిడ్-19 వైరస్ కట్టడికోసం అమలులో చేసే వ్యూహంలో భాగంగా ఈ కార్యకలాపాలను నిర్వహించవచ్చు.

i.కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహణ, ఇంటింటి గాలింపు ప్రక్రియ పూర్తిస్థాయిలో జరిగేలా చూడాలి. ఇందుకోసం తగిన సంఖ్యలో బృందాలను కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

ii.ఇన్.ఫ్లూయెంజా వంటి కేసుల లక్షణాలను తలపించే రోగులకు, శ్వాసపరంగా తీవ్ర అస్వస్థత ఎదుర్కొనే వారికి పరీక్షలు నిర్వహించేలా ప్రణాళిక ఉండాలి. వారికి ఆర్.ఎ.టి. పరీక్షలు, అవసరమైతే తిరిగి ఆర్.టి.పి.సి.ఆర్. పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది.

iii.ప్రజా సంఘాల ఆధారిత సంస్థలు, నియంత్రణతో కూడిన వ్యవస్థ సహాయంతో కోవిడ్ సంబంధిత ప్రవర్తన, నిబంధనావళి పటిష్టంగా అమలు జరిగేలా చూడవలసి ఉంటుంది.

 

సి. ఆసుపత్రులు, చికిత్సా నిర్వహణ

  1. రానున్న నెల రోజులకు తగినట్టుగా ప్రస్తుత కేసులు, రానున్న కేసుల నియంత్రణకోసం ఆరోగ్య మౌలిక సదుపాయాలపై విశ్లేషణ, మధింపును చేపట్టాల్సి ఉంటుంది. ఆక్సిజన్ సదుపాయంతో, ఐ.సి.యు. సదుపాయంతో, వెంటిలేటర్లతో తగినన్ని పడకలు, అంబులెన్స్ సేవలు, తాత్కాలిక ఆసుపత్రులు అందుబాటులో ఉండేలా ఈ విశ్లేషణ చేపట్టాల్సి ఉంటుంది. అవసరమైనమేర క్వారంటైన్ సదుపాయాలను కూడా తిరిగి క్రియాశీలం చేసుకోవాల్సి ఉంటుంది.
  2. చికిత్సకోసం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, కేంద్ర మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలోని ఆసుపత్రి సదుపాయాలను, రైల్వే బోగీలను, తాత్కాలిక ప్రాతిపదికన క్షేత్రస్థాయి ఆసుపత్రులను అవరసం మేరకు వినియోగించుకోవడం.
  3. ఇంట్లోనే ఉండి కోవిడ్ చికిత్స పొందేవారికి సంతృప్తికరంగా ఉండేలా వ్యవస్థను అమలు జరిగేలా చూడటం. వారిపై క్రమంతప్పకుండా పర్యవేక్షణకు తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం, కాల్ సెంటర్ల నిర్వహణ, , అలాంటి హోమ్ ఐసోలేషన్లో ఉండేవారి ఇళ్లను నిఘా బృందాలుఎప్పటికప్పుడు సందర్శించడం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. 
  4. హోమ్ ఐసోలేషన్ చికిత్సలో ఉండే రోగులందరికీ పనికివచ్చే కిట్ ను అందజేయడం, తప్పనిసరిగా పాటించవలసిన నిబంధనలను వారు అనుసరించేలా చూడటం, వారికి నిషిద్ధ అంశాలను తెలియజెప్పడం.
  5. విషమ స్థితి చేరుకోవడానికి ఎక్కువ అస్కారం ఉన్న కేసులను ప్రత్యేకంగా పర్యవేక్షించడం, అవసరాన్ని బట్టి సకాలంలో వారిని ఆసుపత్రులకు తరలించడం. అలాగే, వయో వృద్ధులు, ఇతర రుగ్మతలతో బాధపడే పాజిటివ్ రోగులను క్వారంటైన్ కేంద్రాలకు తరలించి, వారి పరిస్థితిని ఎప్పటకప్పుడు పర్యవేక్షించడం.
  6. జిల్లా పరిపాలనా యంత్రాంగంలోని సీనియర్ అధికారులను కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రుల ఇన్ చార్జులుగా నియమించడం. వ్యాధి లక్షణాల తాజా పరిస్థితిని బట్టి,.. హోమ్ ఐసొలేషన్ లో ఉండే వారితో సహా రోగులందరినీ అవసరమైనపుడు ఆసుపత్రులకు తరలించడం, అందుకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేయడం.
  7. ఇలాంటి కార్యకలాపాలకోసం తగినన్ని అంబులెన్సులు అందుబాటులో ఉండేలా చూసుకోవడం.
  8. ఆక్సిజన్ లభ్యత, రవాణా, మందులు తదితర సదుపాయాల లభ్యతపై సంబంధిత రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకోవడం. అవి హేతుబద్ధంగా  వినియోగపడేలా చూసుకోవడం.
  9. ఆసుపత్రిలోని కేసులకు ఆక్సిజన్ థెరపీ ప్రక్రియ,.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా ఉండేలా చూడటం. ఆక్సిజన్ హేతుబద్ధ వినియోగంపై ఈ సూత్రాలను పాటించడం.
  10. రెమ్.డెసివిర్/టోసిలీ జుమాబ్ వంటి మందుల వినియోగం,.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన చికిత్సా నిర్వహణా  నిబంధనలకు, సూచనలకు అనుగుణంగా ఉండేలా చూడటం.
  11. ఆసుపత్రుల వారీగా కేసులు, మరణాలను రోజువారీ ప్రాతిపదికన విశ్లేషించడం. ఆయా ప్రాంతాన్ని బట్టి, ఇన్సిడెంట్ కమాండర్ లేదా, జిల్లా కలెక్టర్ లేదా, మున్సిపల్ కమిషనర్ ఈ విశ్లేషణను నిర్వహించడం. ఆసుపత్రుల్లో సంభవించిన మరణాలన్నింటికీ తనిఖీని నిర్వహించడం. ఇతర చోట్ల జరిగే వాటిపై క్షేత్రస్థాయి సిబ్బందికి పర్యవేక్షణ బాధ్యత అప్పగించడం.

 

 

డి. వ్యాక్సినేషన్ (టీకా)

అర్హులైన అన్ని వయస్సుల వారికీ వందశాతం మేర వ్యాక్సినేషన్ (టీకాలు)ను అందించడం. ఇందుకోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రాలను గరిష్టస్థాయిలో వినియోగించుకోవడం.  అదనంగా కూడా వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం.

 

   ఇ. జన సమూహానికి ప్రమేయం

i.జన సమూహానికి ముందస్తుగానే తగినంతమేర సమాచారం ఇవ్వడం. వైరస్ కట్టడి చర్యల ఆవశ్యతకను వివరించడం ద్వారా ప్రజలకు తగిన ప్రమేయం కల్పించి, వారి మద్దతును గెలుచుకోవడం.

ii.విస్తృత స్థాయిలో వైరస్ కట్టడి ప్రక్రియను చేపట్టే ముందుగా, సదరు చర్యలను గురించి ముందస్తుగానే ప్రకటించడం. ప్రజలు తమ నిత్యావసర సరకులను సమకూర్చుకోవడానికి తగిన వ్యవధిని ఇవ్వడం.

iii.ప్రజా సమూహంలో ఆందోళన, దుష్ప్రచారం జరక్కుండా నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవడం.

iv.స్థానిక ప్రభుత్వేతర స్వచ్ఛంద సేవా సంస్థలకు, ప్రజా సంఘాలకు, ఇతర సంస్థలకు, ప్రజాభిప్రాయ నిర్ణేతలకు, సబ్జెక్టు నిపుణులకు ప్రమేయం కల్పించడం. తద్వారా తగిన చర్చ, వ్యాక్సినేషన్ ప్రక్రియకు సానుకూల వాతావరణం ఏర్పడేలా చర్యలు తీసుకోవడం.

v.కేసులను త్వరగా పసిగట్టి, హోమ్ ఐసొలేషన్ లో చికిత్స తీసుకునే రోగుల్లో మరణాలను తప్పించేందుకు సత్వర హెచ్చరికల సంకేతాల  వ్యవస్థపై విస్తృత ప్రచారం కల్పించడం.

vi. ప్రజలు తమంతట తామే చొరవ తీసుకుని స్వయంగా పరీక్షలు చేయించుకునేలా, వివరాలు ఆసుపత్రులకు అందుబాటులో ఉండేలా, అంబులెన్సులకోసం విజ్ఞప్తి చేసుకునేలా వీలు కలిగించే యంత్రాంగంపై విస్తృత స్థాయి ప్రాచుర్యం కల్పించడం. ఈ సమాచారం అందరికీ తెలిసేలా ప్రజా సంఘాల ప్రాతిపదికన వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసుకునే వీలు కలగించడం. తద్వారా అవసరమైన వారికి ఎలాంటి జాప్యం లేకుండా ఆరోగ్య రక్షణ సేవలు అందుబాటులో ఉండేలా చూడటం.

vii.ఆసుపత్రి పడకలు, వాటి లభ్యత పరిస్థితి వంటి వివరాలు ఆన్ లైన్ ద్వారా అందుబాటులో ఉండేలా చూడటం. సదరు వివరాలను సమాచార సాధనాలకు ప్రతి రోజూ వెలువరించడం.

viii.ఆక్సిజన్, ఔషధాలు, వ్యాక్సీన్, వ్యాక్సినేషన్ కేంద్రాలు, రెమ్ డెసివిర్, టోసిలీ జుమాబ్ వంటి మందుల వినియోగంపై మార్గదర్శక సూత్రాలు, తదితర అంశాలపై విస్తృతంగా ప్రచారం చేయవలసి ఉంటుంది. ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఈ చర్య తీసుకోవడం అవసరం.

ix. స్వల్ప లక్షణాలతో కూడినకోవిడ్ కేసులకు ఇంటివద్దనే చికిత్స చేసుకునేందుకు తగిన ప్రమాణాలతో కూడిన నిర్వహణా పద్ధతులపై ప్రజా సమూహానికి అవగాహన కల్పించడం అవసరం. శారీరక ఉష్ణోగ్రతను తెలుసుకోవడం,  ఆక్సీ మీటర్ ద్వారా దేహంలోని ఆక్సిజన్ సంతృప్త స్థాయిని తెలుసుకోవడం వంటి అంశాల్లో అవగాహన కల్పించడం. 

x.కోవిడ్ చికిత్సా నిర్వహణకు సంబంధించిన ప్రవర్తన, నియంత్రణ వ్యవస్థ అమలుకు సంబంధించి అంశాలను విస్తృతంగా ప్రచారం చేయవలసిన అవసరం ఉంది.

xi.వ్యాధి స్వభావం గురించి ఎప్పటికప్పుడు వివరిస్తూ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పాదుకొల్పడం. వ్యాధిని ముందస్తుగానే గుర్తించిన పక్షంలో రోగి ముందుగానే కోలుకునేందుకు గల అవకాశాలను తెలియజెప్పడం. 98శాతంపైగా జనం వైరస్ నుంచి కోలుకున్నారని తెలియజెప్పుతూ వారిలో కోవిడ్ గురించిన భయాందోళనలను తొలగించడం. ఇందుకు సంబంధించి సుదీర్ఘకాలం అవగాహనా కార్యకలాపాల్లో పౌర సమాజ సంఘాలకు తగిన ప్రమేయం కల్పించడం చాలా అవసరం.

 

************



(Release ID: 1714186) Visitor Counter : 147