వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ప్రతికూల పరిస్థితులకు ఎదురీదుతూ రైతులు, వ్యవసాయ కూలీలు చెమటోడ్చి అందరి ఇళ్ళకు ఆహారం చేరేందుకు శ్రమిస్తున్నారు
రబీ పంట కోతలు దేశంలో అనుకున్న సమయానికి సాగుతున్నాయి
81.55% గోధుమ పంటను ఇప్పటికే కోశారు
ఛత్తీస్‌గఢ్, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలలో చెరుకు పంట కోతలు పూర్తయ్యాయి.
పూర్తి అయిన కందులు, పెసలు, అల్చందల వంటి కాయధాన్యాలు, మినుములు, పెసరపప్పు, బఠాణీ కోతలు
రాజస్థాన్, యుపి, ఎంపి, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, ఒడిషా, అస్సాంలలో 100% పూర్తి అయిన ఆవపంట కోతలు
Posted On:
25 APR 2021 1:19PM by PIB Hyderabad
ప్రపంచవ్యాప్తంగా ప్రజలను పట్టిపీడిస్తున్న ప్రస్తుత మహమ్మారి నేపథ్యంలో, మన ఇళ్ళకు ఆహారం సజావుగా చేరేందుకు ప్రతికూల పరిస్థితులకు ఎదురీదుతూ రైతులు, వ్యవసాయ కూలీలు చెమటోడ్చి శ్రమిస్తున్నారు. వారి మౌన కృష్టి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమయానికూల జోక్యంతో పంట కోత కార్యకలాపాలలో అతి తక్కువ లేదా అసలు ఎటువంటి ఆటంకాలు లేకుండా పోయాయి. ఈ సానుకూల చర్యల ఫలితంగా, రబీ పంట కోత అనుకున్నట్టుగా సాగుతోంది, ఈ క్రమంలో రైతులకు లబ్ధి చేకూర్చేలా అనుకున్న సమయానికి సేకరణ జరుగుతోంది.
రబీ పంట కాలంలో దేశ వ్యాప్తంగా మొత్తం 315.80 లక్షల హెక్టార్లలో నాటిన గోధుమలలో దాదాపు 81.55% ఇప్పటికే కోతలు జరిగాయి. రాష్ట్రవారీ కోతలు కూడా పెరిగి, రాజస్థాన్‌లో 99%, మధ్య ప్రదేశ్‌లో 96%, ఉత్తర్ ప్రదేశ్‌లో 80%, హర్యానాలో 65%, పంజాబ్‌లో 60%వరకూ పూర్తయ్యాయి. హర్యానా, పంజాబ్, యూపీలలో కోతలు జోరుగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమం ఏప్రిల్ 2021 మాసాంతానికి పూర్తవుతుందని భావిస్తున్నారు.
మొత్తం 158.10 లక్షల హెక్టార్లలో నాటిన పప్పు ధాన్యాలలో కందులు, పెసలు, అల్చందల వంటి కాయధాన్యాలు, మినుములు, పెసరపప్పు, బఠాణీ కోతలు పూర్తి అయ్యాయి.
మొత్తం 48.52 లక్షల హెక్టార్లలో నాటిన చెరుకులో (చెరుకు సీజన్ 2020-2021), ఛత్తీస్‌గఢ్, కర్నాటక, తెలంగాణలలో కోతలు పూర్తి అయ్యాయి. ఇక, ఆంధ్రప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ లో 92-98% వరకు పూర్తయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్‌లో కోతలు 84% పూర్తయ్యాయి, ఈ కార్యక్రమం మే 2021 మధ్యవరకూ సాగనుంది.
ఇక, ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, కర్నాటక, కేరళ, ఒడిషా, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలలో మొత్తం 45.32 లక్షల హెక్టార్లలో నాటిన వరి పంటలో 18.73 లక్షల హెక్టార్లలో కోతలు పూర్తి అయ్యాయి. మిగిలినది కోతల దశలో ఉంది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో రబీ వరపంట కోతలు దాదాపు పూర్తయ్యాయి.
నూనె గింజల పంటల విషయానికి వస్తే, 70 లక్షల హెక్టార్లలో వేసిన ఆవ పంటకోతలు రాజస్థాన్, యుపి, ఎంపి, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, ఒడిషా, అస్సాంలలో 100% పూర్తయింది. హర్యానాలో దాదాపుగా (99.95%) పూర్తి కాగా, పంజాబ్‌లో 77% కోతలు పూర్తి అయ్యాయి. దాదాపుగా 7.34 లక్షల హెక్టార్లలో వేసిన వేరుశనగ పంటలలో 62.53% కోయడం జరిగింది.
కనుక, పంట కోతలు దాదాపుగా అనుకున్న సమయానికి పూర్తి అవుతున్నాయి, ఈ క్రమంలో రైతుల కృషిని గుర్తించి, ప్రశంసించాల్సిన అవసరం ఉంది.
***
(Release ID: 1714102)