ప్రధాన మంత్రి కార్యాలయం

దేశ వ్యాప్తం గా సార్వజనిక ఆరోగ్య సదుపాయాల వద్ద 551 పిఎస్ఎ ఆక్సీజన్ ఉత్పత్తి ప్లాంటుల ను పిఎమ్ కేర్స్ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది


దేశం అంతటా జిల్లా ప్రధాన కేంద్రాల లోని ప్రభుత్వ ఆసుపత్రుల లో ఆక్సీజన్ ఉత్పత్తి ప్లాంటుల ను ఏర్పాటు చేయడం జరుగుతుంది

ఈ ప్లాంటుల ను సాధ్యమైనంత త్వరగా పనిచేయించడం ప్రారంభించాలి: ప్రధాన మంత్రి

ఈ ఆక్సీజన్ ప్లాంటు లు జిల్లా ప్రధాన కేంద్రాల లో గల ఆసుపత్రుల లో ప్రాణవాయువు నిరాటంకం గా సరఫరా అయ్యేందుకు పూచీ పడుతాయి

Posted On: 25 APR 2021 12:16PM by PIB Hyderabad

ఆసుపత్రుల కు ఆక్సీజన్ అందుబాటు ను పెంచాలన్న ప్రధాన మంత్రి ఆదేశానికి అనుగుణం గా దేశం లోని సార్వజనిక ఆరోగ్య సదుపాయాల ఆవరణల లో 551 అచ్చమైన  ప్రెశర్ స్వింగ్ అడ్ సార్ప్ శన్ (పిఎస్ఎ) మెడికల్ ఆక్సీజన్ జనరేశన్ ప్లాంటుల ను ఏర్పాటు చేయడానికి పిఎమ్ కేర్స్ ఫండ్ సూత్రరీత్యా ఆమోదాన్ని తెలిపింది.  ఈ ప్లాంటుల ను సాధ్యమైనంత త్వరగా పనిచేయించడం ప్రారంభించాలి అంటూ ప్రధాన మంత్రి ఆదేశించారు.  ఈ ప్లాంటు లు జిల్లా స్థాయి లో ప్రాణవాయువు లభ్యత ను పెద్ద ఎత్తున పెంచడానికి తోడ్పడుతాయి అని ఆయన అన్నారు.

ఈ ప్లాంటుల ను అచ్చం గా వివిధ రాష్ట్రాలలోని, వివిధ కేంద్ర పాలిత ప్రాంతాల లోని జిల్లా ప్రధాన కేంద్రాల లో గుర్తించిన ప్రభుత్వ ఆసుపత్రుల లో నెలకొల్పడం జరుగుతుంది.  సేకరణ ను ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా చేపట్టడం జరుగుతుంది.

పిఎమ్ కేర్స్ ఫండ్ ఈ సంవత్సరం లో ఇంత వరకు దేశం లోని సార్వజనిక ఆరోగ్య సదుపాయాల ఆవరణల లో అదనం గా 162 ప్రెశర్ స్వింగ్ అడ్ సార్ప్ శన్ (పిఎస్ఎ) మెడికల్ ఆక్సీజన్ జనరేశన్ ప్లాంటుల ను ఏర్పాటు చేయడం కోసం 201.58 కోట్ల రూపాయల ను కేటాయించింది.

జిల్లా ప్రధాన కేంద్రాల లో గల ప్రభుత్వ ఆసుపత్రుల లో పిఎస్ఎ ఆక్సీజన్ జనరేశన్ ప్లాంటుల ను ఏర్పాటు చేయడం లోని ప్రధాన ఉద్దేశ్యమల్లా సార్వజనిక ఆరోగ్య వ్యవస్థ ను మరింతగా పటిష్టపరచడమూ, ఈ ఆసుపత్రులన్నీ అక్కడిక్కడే ఆక్సీజన్ తయారీ సామర్థ్యాన్ని సంతరించుకొనేటట్టు చూడడమూను.  ఆ తరహా ఇన్-హౌస్ కేప్టివ్ ఆక్సీజన్ జనరేశన్ ఫెసిలిటీ ఆ వైద్యశాలల్లోని రోజు వారీ మెడికల్ ఆక్సీజన్ అవసరాలను, జిల్లా వారీ గా దైనందిన మెడికల్ ఆక్సీజన్ అవసరాల ను తీర్చగలుగుతుంది.  దీనికి తోడు, ఈ లిక్విడ్ మెడికల్ ఆక్సీజన్ (ఎల్ఎమ్ఒ) స్థానిక ఆక్సీజన్ ఉత్పత్తి కి అదనం గా కూడా ఉపయోగపడుతుంది.  అటువంటి విధానం జిల్లాల లోని ప్రభుత్వ దవాఖానా లు ప్రాణవాయువు సరఫరాల లో ఆకస్మిక అంతరాయాన్ని ఎదుర్కోకుండా చూడడానికి పూచీ పడడమే కాకుండా కోవిడ్-19 రోగుల తో పాటు ఆ రకమైన సహాయం అవసరమయ్యే ఇతర రోగుల ను సైతం సంబాళించడానికి గాను అవాంతరాలు ఎదురవని రీతి లో ఆక్సీజన్ సరఫరా ను చాలినంత మేరకు అందుబాటు లో ఉంచేందుకు కూడాను సాయపడగలుగుతుంది.



 

***


(Release ID: 1713931)